బాసని కవిత
శాయంపేట ఆత్మకూరు ప్రధాన రహదారిపై నివాసం ఉంటున్న కుటుంబం దీనాగాధ. ఇండ్ల నుంచి మురికి నీరు ప్రధాన రహదారిపై ఏరులై పారుతోంది వాహనదారులు,పాదా చార్యులు అధికంగా నడవడం వల్ల మురుగు వాసనను భరించలేక నరకయాతన అనుభవి స్తున్నారు. ప్రతిరోజు ప్రజా ప్రతినిధులు అధికారులు ఇదే రోడ్డు గుండా వెళ్తున్న పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగండ్ర సత్యనారాయణ చొరవ చూపి డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించండి
