గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఎస్ జి ఎఫ్ క్రీడలు ప్రారంభమైనాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీవో జనార్దన్ రెడ్డి, ఎంఈఓ వేణు కుమార్ క్రీడలను ప్రారంభించారు. మండలంలోని 12 పాఠశాలల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం వాలీబాల్ లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు అనిత కుమారి, ఎస్ జి ఎఫ్ మండల అధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్, క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.