బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో శుక్రవారం చేపూరి లచ్చమ్మ స్మారకార్థం ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇట్టి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చేపూరి లచ్చవ్వ కుమారుడు చేపురి మల్లయ్య తెలిపారు. ఇట్టి నిర్వాహనను చేకూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో వేసవి కాలమంతా కొనసాగించనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు వాహనదారులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ చేపురి వరలక్ష్మి, కనకయ్య, ప్రజా ప్రతినిధులు ప్రజలు యువకులు పాల్గొన్నారు.
తడగొండలో చలివేంద్రం ప్రారంభం
