*తాతయ్య గుంట గంగమ్మ తల్లి కి సారె సమర్పించిన శాప్ చైర్మన్ రవి నాయుడు.
తిరుపతి(నేటిధాత్రి:
తిరుపతి పట్టణంలో జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజు శాప్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనిమిని రవి నాయుడు దంపతులకు దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్
వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రవి నాయుడు దంపతులు అమ్మవారికి సారె సమర్పించారు.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ తిరుపతి ప్రజలపై ఉండాలని, వారికి అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు..
