నిజాయితీతో ప్రజలకు సేవాలందించాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు నిజాయితీగా సేవాలందించాలని పోలీస్ కమిషనర్, పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి సూచించారు. వార్షిక పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీంచారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసికెమెరాలు, సన్నిహిత సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ లో తీవ్రమైన నేరాల సి.డి ఫైల్స్, స్థిరస్తి చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితి గతులపై పోలీస్ కమిషనర్ రికార్డులను తడువుగా తనిఖీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని, అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, అరెస్ట్ చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్థుల సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందజేయాలని. పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలి. కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి సూచించారు.ఈ తనిఖీలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, ఇన్స్పెక్టర్ శివకుమార్ తోపాటు ఎస్. ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!