మైలారం గుట్టల పైన ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనకు మంత్రుల రాక

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ తేదీ- 3 -8 -2024 శనివారం రోజున గాంధీనగర్ మైలారం గుట్టల పైన 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడాల్ ఏర్పాటు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్న మంత్రులు
దుద్దిల్ల శ్రీధర్ బాబు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
దానసరి అనసూయ (సీతక్క) వరంగల్ ఎంపీ కడియం కావ్య భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి విచ్చేయుచున్నారు ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు మహిళ నాయకులు యువజన నాయకులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము బహిరంగ సభ అయిపోయిన తర్వాత గాంధీనగర్ గ్రామం నుండి భూపాలపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగు తుంది కావున అధిక సంఖ్యలో పాల్గొనగలరని వారు కోరారు స్థలం గాంధీనగర్ మిషన్ భగీరథ వాటర్ పంప్ హౌస్ పక్కన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!