ఎన్నికలప్రచార యాత్ర లో ఓటర్లను అభ్యర్థించిన చెరుకువాడ.
ప.గో జిల్లా/పోడూరు నేటి ధాత్రి.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం ,పోడూరు గ్రామం లో మంగళవారం ఎన్నికల శంఖారావం ప్రచార పాదయాత్ర లో ఆచంట శాసనసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి సంఘీభావంగా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్లతాతాజీపాల్గొన్నారు.అడుగడుగున ప్రజల బ్రహ్మరథం పట్టారు.ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొని గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వెయ్యమని ప్రజలను అభ్యర్థించారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో రంగరాజు చేస్తున్నటువంటి అభివృద్ధిసంక్షేమకార్యక్రమాలను పేద బడుగు బలహీన వర్గాలనుఆయనచేస్తున్నటువంటి కృషి గ్రామ ప్రజలే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలదండలతో వేసి హారతులతో ఘన స్వాగతంపలికారు.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిచేయడానికినియోజకవర్గంలో రంగరాజుని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని స్వాగతం పలుకుతూ మహిళలు,రైతులు,అవ్వ తాతలు,అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని నినాదాలతో హోరెత్తించిప్రచారంనిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చట్టబత్తుల సువర్ణ రాజు, జడ్పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీసబ్బిత సుమంగళి సాగర్, ఆచంట ఏఎంసీ చైర్మన్ చిల్లే లావణ్య, చేకూరి సూరిబాబు, పొడూరి సత్య సాయి బాబా, రుద్రరాజు శివాజీ రాజు, గంట గిరిబాబు, మండల వైసీపీ కన్వీనర్ పిల్లి నాగన్న, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పోతుమూడి రామచంద్ర రావు, పైడి ఏసుబాబు, గెద్దాడ ఏకలవ్య కంది కట్ల వెంకట్రావు,గొట్టుముక్ల ఏసురత్నం,స్థానిక పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామప్రజలుఅభిమానులుపెద్దఎత్తునపాల్గొన్నారు.