రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం

రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు

అన్నదాతల అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేటమండలం రైతు వేదికలో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు భాగం గా అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త లు రైతులకు పంట సాగు యాజమాన్య పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పిం చారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త విద్యాధర్ మాట్లాడుతూ రైతులు తక్కువ చూడడం వాడండి నేలతల్లిని ఆరోగ్యంగా ఉంచండి, పంట మార్పిడి పాటించండి మార్కెట్లో గిరాకీ ఉన్న వరి వంగరకాలను పండించండి అధిక ఆదా యాన్ని పొందండి సాగునీటిని ఆదా చేయండి భావితరాలకు ఆదరించండి ప్రస్తుత వ్యవసా య రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తెలిపారు.పంటల అధిక ఖర్చులు, పురుగుల పెరుగుదల కార ణంగా దిగుబడులు తగ్గి రైతుల ఆదాయం దెబ్బతింటుంది పురుగుమందుల అధిక వినియోగం వల్ల పురుగులు రోగనిరోధక శక్తిని పెంపొందిం చుకుంటున్నాయని, అధిక నత్రజని వాడడం వల్ల భూమి కలుషితం అవుతుంది.అలాగే పంటలపై రసాయన అవశేషా లు మిగిలి మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతు న్నాయని హెచ్చరించారు.ఈ సమస్యల నుండి బయటప డేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు(ఐపీఎం)అనుసరించడం అత్యవసర మని సూచిం చారు.లోతైన దుక్కులు, విత్త న శుద్ధి, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి పద్ధతు లను పాటించాలని తెలి పారు.సేంద్రియ ఎరువులకు వర్మికంపోస్ట్ వాడటం, ట్రైకోడెర్మా విరిడిని కలిపి ఉపయోగించడం ద్వారా మట్టి ఆరోగ్యం మెరుగుపడు తుంది అలాగే,వేపనూనె పిచికారి,రంగు జిగురు పట్టాల వినియోగం ద్వారా పురుగు లను నియంత్రించ వచ్చని పేర్కొన్నారు.పత్తి పంటలో బంతి,ఆముదం మొక్కలను పెంచడం ద్వారా కాయతొల చు పురుగుల నివారణ సాధ్య మని,మిరప పంటలోజొ న్న,మొక్కజొన్న,సజ్జ వంటి పంటలను అంతర పంటలుగా వేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని సూచించారు.ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి రకాలను సాగు చేస్తే అధిక దిగుబడితో పాటు ప్రభుత్వ ప్రోత్సాహ కాలు పొందవచ్చని తెలిపా రు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విద్యాధర్, సిద్ధార్థ నాయక్, ఏవో ప్రియ దర్శిని,ఏఈఓ అన్వేష్ రాకేష్,,రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version