సీనియర్ జర్నలిస్టు సదానందం
22 ఏళ్లుగా BRS పార్టీ కార్యకర్తగా
“నేటిధాత్రి” వరంగల్
ఉద్యమకారునిగా, జర్నలిస్టుగా ఏలాంటి పార్టీ పదవులు, ఆర్థిక లబ్ధి పొందని నాకు అవకాశం వచ్చేలా చొరవ చూపాలని.
రాబోయే లోకసభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేయుటకు BRS పార్టీ నుండి అవకాశం కల్పించాలని ఉద్యమ కారుడు సిరిమల్లె సదానందం కోరారు.
ఈ మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందని అందుకు కడియం శ్రీహరి
సానుకూలంగా స్పందించినందుకు శ్రీహరికి ధన్యవాదాలు తెలిపారు
హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం,
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని
8వ డివిజన్ స్థిర నివాసిగా సిరిమల్లె సదానందం 2001నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా.. ఉద్యమకారునిగా… సీనియర్ జర్నలిస్టుగా ఇప్పటివరకు ఎలాంటి పార్టీ పదవులు, ప్రభుత్వాన్ని నామినేటెడ్ పోస్టులు, ఆర్థికపరమైన ఎలాంటి లబ్ధి పొందకుండా నిస్వార్ధంగా, నిజాయితీగా, క్రమశిక్షణతో తెలంగాణ సిద్ధించే వరకు జరిగిన ఉద్యమాలతో పాటు
పార్టీ బలోపేతం కోసం నిర్విరామంగా కృషి చేసి స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు మొదలు, సభలు, సమావేశాలు, ప్లీనరీల సక్సెస్ కోసం పార్టీ కార్యకర్తగా, ఉద్యమకారునిగ నిరంతరం శ్రమించానని
ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక మాజీ ఎమ్మెల్యే
వినయ భాస్కర్ సూచనల మేరకు నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో రూపాయి ఆశించకుండా నిద్రాహారాలు మాని, రేయింబవళ్లు కష్టపడడం జరిగిందని
22 ఏళ్లుగా..
వరంగల్ ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువైన హనుమకొండలో స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన అన్ని రకాల ఉద్యమాలల్లో ఉద్యమ కారునిగా, కార్యకర్తగా BRS పార్టీ బలోపేతం కోసం, తెలంగాణ జర్నలిస్టు ఫోరం(TJF) ఆధ్వర్యంలో జర్నలిస్టుగా స్వరాష్ట్రం సాధించేవరకు జరిగిన అలుపెరుగని పోరులో జర్నలిస్టుగా పాల్గొంటూనే, ఉద్యమ వార్తలను పతాక శీర్షికన నిలబెడుతూ కృషిచేసిన తనను గుర్తించి వరంగల్ ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ సెగ్మెంట్ స్థానంలో అవకాశం కల్పించాలని సదానందం ఈ సందర్భంగా కోరారు.