నడికూడ,నేటి ధాత్రి:
నడి కూడ మండల ఆటో యూనియన్ కార్యదర్శి గోనెల రమేష్ కుమారుడు గోనెల రాహుల్ మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ బారిన పడగా గాయాలు కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నడికూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు భాదితున్ని కలిసి పరామర్శించి ఆర్థిక సాయం చేసి అన్ని విధాలా అండగా ఉంటాం అని దైర్యం నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నడికూడ గ్రామ కార్యదర్శి రావుల కిషన్,బిఆరెస్ సీనియర్ నాయకులు చెన్నబోయిన రామచందర్,తాళ్ళ వంశీ,ఈర్ల మధుకర్,తదితరులు పాల్గొన్నారు.