samyuktha collectorga yasmin basha, సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా యాస్మిన్‌ భాషా కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. నాన్‌ క్యాడర్‌ హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పనిచేస్తున్న యాస్మిన్‌ భాషాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదా ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. జెసితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మరో 10మందికి కలిపి మొత్తం 11మందికి కన్‌ఫర్డ్‌ ఐఎఎస్‌ హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

కొత్తగా ఐఎఎస్‌ పదోన్నతి పొందిన యాస్మిన్‌ భాషాకు నూతన హోదాతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యాస్మిన్‌ భాషా ఐఎఎస్‌ హోదాతో రాజన్న సిరిసిల్ల జిల్లా సంయుక్త కలెక్టర్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐఎఎస్‌ హోదాతో జేసిగా బాధ్యతలు స్వీకరించిన జెసి యాస్మిన్‌ భాషాకు జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామరెడ్డి ఫోన్‌లో అభినందించారు. డిఆర్వో ఎన్‌.ఖీమ్యానాయక్‌, ఆర్డీఓ టి.శ్రీనివాసరావు, డిఆర్‌డిఓ బి.రవీందర్‌, డిఇఓ రాధాకిషన్‌, డిసిఎస్‌ఓ శ్రీనాథ్‌, డిపిఆర్వో మామిండ్ల దశరథం, పౌరసరఫరాల సంస్థ డిఎం శ్రీకాంత్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పరిపాలనా అధికారి గంగయ్య, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రసాద్‌, విజయ్‌, రామకష్ణ, ప్రశాంత్‌, ఇతర కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల స్వీకరణ అనంతరం జెసి యాస్మిన్‌ భాషా మాట్లాడుతూ ఐఎఎస్‌ హోదా మరింత భాద్యతను పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు మరింత విస్తత సేవ చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *