samanvayamtho panicheyali : cp doctor v.ravinder, సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

సమన్వయంతో పనిచేయాలి : సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

నేరాలకు పాల్పడిన నేరస్థులకు కోర్టులో నేరం నిరూపించబడి శిక్షలు పడాలంటే పోలీసులు, ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సి వుంటుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ తెలిపారు. కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడేన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్టిగేషన్‌ ప్రోసిజర్స్‌ ఫ్రం ఎఫ్‌ఐఆర్‌ టూ చార్జ్‌షీట్‌ అంశంపై వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమినార్‌ను శనివారం పోలీస్‌ పోలీస్‌ కమీషనర్‌ ప్రారంభించారు. డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ వరంగల్‌ విభాగం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పోలీస్‌ అధికారులు పాల్గోనగా వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సెమీనార్‌లో కోర్టులో నిందితులు పాల్పడిన నేరాలు కోర్టులో రుజువయ్యేందుకు పోలీస్‌ అధికారులు నేర పరిశోధనలో సేకరించాల్సిన సాక్ష్యాధారాలతోపాటు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు నిర్వహించే న్యాయ విచారణలో సమయంలో పరిగణనలోకి తీసుకోవల్సిన అంశాలతోపాటు, బెయిల్‌, రిమాండ్స్‌, పోలీస్‌ కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నూతనంగా వెలువరించిన తీర్పుల వివరాలకు సంబంధించిన అంశాలపై నిజామాబాద్‌ రెండవ గ్రేడ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాంరెడ్డి ఈ సెమీనార్‌లో వివరించారు. ప్రాసీక్యూషన్‌పరంగా పోలీస్‌ అధికారులకు ఎదురవుతున్నా సమస్యలకు పరిష్కారాలను పోలీస్‌ అధికారులు పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లతో చర్చించారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజలకు ఎప్పుడు ఎక్కడ నేరం జరుగుతుందో అనే భయం వుంది తప్పా, నేరం చేస్తే శిక్షపడుతుందనే భయం చాలా తక్కువగా వుందని అన్నారు. ఈ భయం లేకపోవడం వల్లనే నేరస్థులు పాల్పడే నేరాలకు పాల్పడుతున్నారని, ఇది దష్టిలో వుంచుకోని డీజీపీ అధ్వర్యంలో పోలీసులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిందితులకు శిక్షలు పడేందుకు అవలంభించాల్సిన విధానంపై చర్చించారు. న్యాయస్థానంలో నిందితులకు శిక్ష పడేందుకు నిందితులను అరెస్టు నుండి పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ప్లాన్‌ యాక్షన్‌ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం వుందని, కొన్ని సందర్బాల్లో నిందితులపై నేరనిరూపణ కాకపోవడంతో కేసులను కొట్టివేయబడుతున్నాయని చెప్పారు. ఇందుకు గల కారణాలను కేసు ఇన్వేస్టిగేషన్‌ పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు సంయుక్తంగా కల్సి కేసులు కొట్టివేయడానికి గల కారణాలపై చర్చించుకోవల్సి వుంటుందని తెలిపారు. నమోదైన ప్రతి కేసులో నిందితుడిపై నేరనిరూపణ జరిగి శిక్ష పడేయడం మన భాధ్యత అని, అలా చేయడం వలన నేరస్థుల్లో భయాన్ని కలిగించడంతో పాటు నిందితులు నేరాలకు పాల్పడకండా నియంత్రించడంతోపాటు ప్రజలకు భరోసా కలిగించవచ్చని తెలిపార. ఇందులో భాగంగానే గత సంవత్సరం వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో నేరస్థులకు శిక్షలు పడటంలో 46శాతానికి పెరిగిందని, పోలీస్‌ అధికారులు, పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరస్థులకు శిక్షలుపడే శాతం పెరిగిందని, శిక్షలు పడితేనే నేరస్థులకు భయం కలగడంతోపాటు బాధితులు న్యాయం చేసిన వారమవుతామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరక్టర్‌ ఆఫ్‌ ప్రాసీక్యూషన్స్‌ సత్యనారాయణ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎసిపి శ్రీనివాస్‌తోపాటు పబ్లిక్‌ ప్రాసీక్యూటర్లు పాల్గోన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *