ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా రత్నం శైలేందర్
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిన్న రాము తెలియజేశారు. రత్నం శైలేందర్ గత 30 సంవత్సరాల నుండి వివిధ దళిత సంఘాలలో పనిచేస్తూ దళితులను సామాజికంగా చైతన్యం కొరకు వారిని మేల్కొల్పడం జరుగుతుంది రత్నం శైలేందర్ గత కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారని ఈయన చేస్తున్న పలు కార్యక్రమాలను దళితులకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని ఇతనిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జాతీయా అ ధ్యక్షులు తెలిపారు.ఈ సందర్భంగా రత్నం శైలేందర్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల దాటుచున్న అప్పటికి పేదవాడు మరింత పేదవాడు గానే ఉంటున్నారని ధనికులు మాత్రం పైపైకి ఎదుగుతున్నారు దీనికి అనేకమైనప్పటికీ ఈ అంతరాలను సేదించడానికి స్వతంత్ర భారత్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల,మత వర్గా లింగ వేదం లేకుండా ప్రతి భారత పౌరుడు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ ఓసి ఆయా కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరికీ సమన్యాయం చేయాలని అన్నారు.
