రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్
ఈనెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్ కళాశాల మైదానంలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షణలో జరిగాయి. రేపటి కవాతు రిహార్సల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…యూనిఫార్మ్ ధరించి చూపరులను ఆకట్టుకునేలా కవాతు నిర్వహించాలని చెప్పారు. నేడు చేసిన రిహర్సల్స్ చాలా బాగున్నాయని, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. కళాశాల మైదానంలో జిల్లా బాంబ్ డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్, ప్లాటూన్ కమాండర్ దామోదర్, ఆర్‌ఎస్సై, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.