హెచ్ఎం అచ్చ సుదర్శన్
నడికూడ,నేటిధాత్రి: మండలంలోని చర్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో రెండవ రోజు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు హాండ్ మైకు పట్టుకుని గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకతలను తెలియజేస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ విద్యార్థులను నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ తల్లి తండ్రులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్య లభిస్తుందని ఆయన అన్నారు.ప్రైవేట్ పాఠశాలలో మీ బిడ్డపై పెట్టే ఖర్చు ప్రస్తుతం పొదుపు చేసినట్లయితే వారి ఉన్నత చదువులకు ఉపయోగప డుతుందనిఅన్నారు.మన ఊరు మనబడి కార్యక్రమంలో చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య,శీలం సరిత,తాళ్లపల్లి మంజుల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.