ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
లారీ యజమానుల, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
(శుక్రవారం)భూపాలపల్లి పట్టణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ది కాకతీయఖని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం లారీ అసోసియేషన్ కార్యాలయంలో టెంకాయ కొట్టి, వేదికపై నూతనంగా ఎన్నికైన ఐదుగురు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. మేకల చంద్రయ్య ప్రధాన కార్యదర్శిగా అన్వర్ పాషా ఉపాధ్యక్షులుగా సురేందర్ సహాయ కార్యదర్శిగా ఎనగంటి రమేష్ తక్కెళ్ళపల్లి తిరుపతిరావు ఎన్నికైనారు అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా నూతన కార్యవర్గం సంఘం అభివృద్ది, సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. లారీ యజమానులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెన్నంటే ఉండి కాపాడుకున్నామన్నారు. లారీల మీద ఆధారపడి వందలాది కార్మికుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, లారీ ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు