
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో సుతారి స్వామి ( 50 ) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మరణించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన స్వామి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు వెంకు గారి రాజిరెడ్డి మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ శ్రీనివాస్, హనుమన్ల కింది స్వామి, నాగయ్య తదితరులు ఉన్నారు.