
-తాసిల్దార్ కి వినతి పత్రం
మంగపేట నేటి ధాత్రి
రాష్ట్రం లో ఉన్న తీవ్రమైన నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బి జే వై యం ఆధ్వర్యం లో మంగపేట మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల కు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ లలో అదనంగా పోస్టులు పెంచాలి 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని నిర్వహించాలి, ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్ట్ ఫోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని అన్ని నియమకల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి,జాబు క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలనీ వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు ఎర్రంగారి వీరన్ కుమార్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కట్కోజు ప్రశాంత్, జిల్లా ప్రచార కార్యదర్శి ఈర్ల మధుసూదన్, బూత్ అధ్యక్షులు కాసర్ల మల్లారెడ్డి, మండల కార్యదర్శి బొల్లికొండ సాంబయ్య, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఎంబడి నవీన్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.