ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.
రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పట్టణంలో నీటి సరఫరా చేయడానికి నూతనంగా 5 ట్రాక్టర్ వాటర్ ట్యాంకులను శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పట్టణంలో ఎక్కడ కూడా నీటి కష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు తాళం చెవిలను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కౌన్సిలర్లు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.