నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని 22వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల భాగ్యలక్ష్మి తెలిపారు. శనివారం డివిజన్‌లోని రంగశాయిపేట, గొల్లవాడ, రజకవీధి, కాపువాడలలో పర్యటించారు. అనంతరం డిఇ, ఎఇలకు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని పంపిణీ చేయించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రంగశాయిపేటలోని కొన్ని ప్రాంతాలలో కనీసం ఒక బిందె నీరు కూడా రావడం లేదని, ఈ ప్రాంత ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డిఇ మనోహర్ మాట్లాడుతూ నీరురాని ప్రాంతంలో నూతనంగా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తే ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడిని తీర్చవచ్చని తెలిపారు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తయారుచేసి కమీషనర్ దృష్టికి తీసుకువెళుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇ వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ నాయకులు మరుపల్ల రవి, లైన్‌మెన్ కరుణాకర్‌తోపాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.