prajaswamyama…? racharika rajayama…?, ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…?

ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…?

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా…, రాచరిక రాజ్యమా అని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఉన్న అవకతవకల వల్ల 24మంది విద్యార్థులు మతిచెందినా, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా గురువారం బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో బిజెపి వరంగల్‌ అర్బన్‌ జిల్లా శ్రేణులతోపాటు బంద్‌ నిర్వహిస్తున్న మాజీ మంత్రి గుండె విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమరేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ రాజేంద్రప్రసాద్‌, ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ కందగట్ల సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి గుండెకారి కోటేశ్వర్‌, అయినవోలు మండల అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌, 32వ డివిజన్‌ అధ్యక్షులు పెరుగు సురేష్‌, రాజేష్‌ ఖన్నా, శేఖర్‌ తదితరులను పోలీసులు అరెస్ట్‌చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని, ఎన్నో కలలు కనీ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బంగారం మయమవుతాయని అనుకుంటే భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గ్లోబరినా సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *