బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో నేటిధాత్రి స్పెషల్ ఇంటర్వూ..
-బైపోల్లో బీఆర్ఎస్ నిశ్శబ్ద విప్లవం.

-కాంగ్రెస్ కు ప్రజల దిమ్మతిరిగే సమాధానం.
-ఓటర్లను బెదిరించే కాంగ్రెస్ కాల గర్భంలో కలవడం తధ్యం.

-బీఆర్ఎస్ బలం ముందు కాంగ్రెస్ జుజుబీ.
-కాంగ్రెస్, మజ్లిస్ అనైతిక పొత్తుకు చెంపపెట్టు.

-కాంగ్రెస్ భయపెట్టాలని చూసినా, ప్రలోభ పెట్టినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.
-సునీత గెలుపు ఎప్పుడో ఖాయమైంది.

-బీఆర్ఎస్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ వణుకుతోంది.
-ప్రచారంలో కాంగ్రెస్ నాయుకుల ముఖం మాడిపోయింది.
-జూబ్లీలో బీఆర్ఎస్ నిశ్శబ్ద విప్లవం.
-కాంగ్రెస్‌కు ఘోరీ కట్టడం ఖాయం.
-కాంగ్రెస్ చేసిన మోసాలకు చరమగీతం.
-అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం.
-ఓటర్లను బెదిరించి సిఎం. రేవంత్ పెద్ద తప్పు చేశారు.
-ఓటర్లను బెదిరించి గెలుస్తామనుకోవడం కాంగ్రెస్ మూర?త్వం.
-తెలంగాణలో కాంగ్రెస్ ను ఇక జన్మలో ఎవరూ నమ్మరు.
-బీఆర్ఎస్కు జనం ఆదరణ చూసి కాంగ్రెసోళ్ల గుండెలు అదురుతున్నాయి.
-కాంగ్రెస్ పార్టీ జూబ్లీలో చేతులెత్తేసినట్లే లెక్క.
-సీఎం. రేవంత్ మీడియా సమావేశంతో తేటతెల్లమైంది.
-ఓడిపోతున్నామని సీఎం. రేవంత్ కు అర్థమైపోయింది.
-ప్రస్టేషన్లో రేవంత్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.
-సీఎం. వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
-రెండేళ్లలలో కాంగ్రెస్ సర్కార్ చేసిన ఒక్క పని లేదు.
-రెండేళ్లలో చేసిన పనులేమీ లేక చెప్పుకునే దిక్కు లేదు.
-కారు ముందు కాంగ్రెస్ కహానీలు ఖతం.
-కాంగ్రెస్ పతనం జూబ్లీ నుంచే ప్రారంభం.
-కాంగ్రెస్ కు తప్పదు గుణపాఠం.
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్దాలు నమ్మడానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలు, మోసాలు, అక్రమాలను ప్రజలు సహించడానికి సిద్దంగా లేరు. ఎన్నికల ముందు ఒకటా, రెండా 420 అబద్దాలు చెప్పారు. హమీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత తెప్ప తగిలేసినంత పని చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఇక నమ్మే పరిస్దితి అసలే లేదు. రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలే నమ్మేందుకు సిద్దంగా లేరు. కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిరచేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు ప్రశాంత విప్లవాన్ని చూపిస్తారు. ఓటు ద్వారా బిఆర్ఎస్ పార్టీని గెలిపించి నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తారు. కాంగ్రెస్‌ను గొయ్యి తీసి పది అడుగుల లోపల పాతి పెడతారు. మళ్లీ ముప్పై ఏళ్లపాటు తెలంగాణలో ఇక కాంగ్రెస్ ఓటు అడగకుండా భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీర్పిచ్చేందుకు సిద్దంగా వున్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను తక్కు తక్కుకింత ఓడిరచనున్నారు. భవిష్యత్తు అంతా బిఆర్ఎస్ పార్టీదే అని నిరూపించబోతున్నారంటున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి ,నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వూ….
నేటిధాత్రి: నమస్తే!
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి: నమస్తే.
ప్ర: జూబ్లీహిల్స్ బై పోల్ ప్రచారం ఇక ఒక్క రోజులో ముగియనుంది. బిఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఎలావున్నాయి?
జ: ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను బంపర్ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దమయ్యారు. అసలు ప్రచార సమయంలోనే కాంగ్రెస్, బిజేపిలకు ప్రజల మూడ్ తెలిసిపోయింది. వారికి ఓటమి ఖాయమని తేలిపోయింది. అందుకే సిఎం. రేవంత్ రెడ్డి ప్రస్టేషన్కు గురయ్యారు. ఏడు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం సాగించారు. అయినా జనం నమ్మడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు అంత సులువు కాదని తెలుసుకున్నారు. బిఆర్ఎస్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అంటేనే కాంగ్రెస్‌పార్టీ పరిస్ధితి ఏమిటో సిఎం. మాటల్లోనే అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవని తెలిసింది. బిఆర్ఎస్ గెలుపును ఆపడం కష్టమని అర్దమైపోయింది. ఇంకేముంది కాంగ్రెస్ నాయకులు గాయి, గాయి చేస్తున్నారు.
ప్ర: జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించకపోతే పథకాలు అగిపోతాయని సిఎం. అంటున్నాడు. ప్రజలు భయపడి ఓట్లు వేయరంటారా?
జ: ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే నాయకులు, పాలకులు. వారిని బెదిరించి ఓట్లు సంపాదించడమనేది ఎవరి తరం కాదు. అందులోనూ సిఎం. రేవంత్ ప్రజలను బెదిరించడం వల్ల కాంగ్రెస్‌కు ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్రజలు మరింత గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ అభ్యర్ధికి మరింత మెజార్టీ వచ్చేలా చేశారు. ఏ పార్టీకైనా సరే గెలవాలన్న ఆలోచన మంచిదే. ఉద్దేశ్యం మంచిదే. ఎలాగైనా గెవాలి అనుకోవడం తప్పు. ప్రజల మన్ననలను పొందకుండా గెలవడం అసాధ్యం. అందులోనూ పాలకులు పథకాలు ఆపేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అయినా రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌కు ముఖ్యమంత్రా? లేక తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రా? ఒక్క ఉప ఎన్నిక కోసం ఇన్ని విన్యాసాలు చేయడం అవసరమా?
ప్ర: బిఆర్ఎస్ అభ్యర్ధి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి?
జ: రాజకీయ నాయకులకు ఓపిక, సహనం వుండాలి. మాట్లాడే మాటలు హద్దుల్లో వుండాలి. ముఖ్యంగా పాలకులు ఎంతో ఒద్దికగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో వున్న మాగంటి సునీత కన్నీళ్లను కూడా అపహాస్యం చేశారు. ఇది తెలంగాణ సమాజమే గమనించింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తూనే వున్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు సహజ గుణం తెలిసిపోయింది. ఒక మహిళను అంతలా అవమాంచే రీతిలో మాట్లాడిన నాయకులను ప్రజలు ఇప్పటికే చీ అన్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి గురించి ప్రజలకు తెలియంది కాదు. కాని ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
ప్ర: కాంగ్రెస్‌కు మజ్లిస్ పార్టీ సపోర్టు చేయడం ఎలా అర్ధం చేసుకోవచ్చు?
జ: అది అనైతికపొత్తు. అంతకు మించి ఆ పొత్తు గురించి మాట్లాడడం వేస్టు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్లో కాంగ్రెస్‌మీద దుమ్మెత్తిపోస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చిప్ప కూడా చేతికి రాదని బిహార్‌లో ఎంపి. అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ మాత్రం సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి అనైతిక పొత్తులు ఎక్కడైనా వుంటాయా? కాంగ్రెస్‌పార్టీ ప్రాంతీయపార్టీ కాదు. జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఎక్కడైనా సరే ఒకే విధానం వుండాలి. ఇలా రెండు మూతుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లింది. అయినా కాంగ్రెస్‌పార్టీ ఎన్ని అనైతిక పొత్తులతో వచ్చినా బిఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు. ఆపడం కూడా వారికి సాద్యంకాదు.
ప్ర: కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్ల మీద ఆశల పెట్టుకున్నది. ముస్లిం ఓట్లు ఎటు పడే అవకాశం వుంది?
జ: ముస్లింల ఓట్లన్నీ బిఆర్ఎస్కే పడతాయి. ముస్లింలు కాంగ్రెస్‌ను నమ్మడానికి సిద్దంగా లేరు. ముఖ్యంగా రేవంత్‌ను, జూబ్లీహిల్స్ అభ్యర్ధినవీన్ యాదవ్‌ను నమ్మడం లేదు. తెలంగాణ ముస్లిం మైనార్టీ ప్రజలకు బిఆర్ఎస్ చేసిన సేవ ఎవరూ చేయలేదు. ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేశాం. ముస్లింకు పండుగల తోఫాలు అందించాం. ముస్లింకు షాదీ ముభారక్ అందించాం. అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాం. ముస్లింలు అంటే మజ్లిస్ ఓటు బ్యాంకు కాదు. ముస్లింలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ముస్లింలు కూడా మళ్లీ సారే రావాలి. కారే గెలవాలి. తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ పాలన రావాలి. కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలిన బలంగా కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తు గా ఓడిరచి, బిఆర్ఎస్ను గెలిపించాలని చూస్తున్నారు. అలాంటి ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతారు?
ప్ర: నాలుగు కట్టడాలు చూపించి ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారని సిఎం. అంటున్నాడు?
జ: మాట్లాడడానికి సిఎంకు కొంచెమైనా సిగ్గుండాలి. సెక్రెటరియేట్ ఎందుకు అనే వాళ్లు ఎవరైనా వుంటారా? సెక్రెటరియేట్ నిర్మిస్తే ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించే సిఎం. ఎక్కడైనా వుంటాడా? నేనున్నాని సిఎం.రేవంత్ రెడ్డి నిరూపించారు. అంత గొప్ప నాయకుడిని సిఎం.ను చేసి కాంగ్రెస్‌పార్టీ తలపట్టుకుంటున్నది. కమాండ్కంట్రోల్ బోర్డు ఎందుకు? అని ప్రశ్నించడంలో అర్దముందా? కాళేశ్వరం మీద రేవంత్‌రెడ్డి చెప్పే అబద్దాలను ఎవరూ నమ్మేందుకు సిద్దంగాలేరు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడతారు. అప్పుడు సిఎంకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది.
నేటిధాత్రి: ధన్యవాదాలు.
పోచంపల్లి: నమస్కారం.
