Petition to Tahsildar on Shikham Land Encroachment
శిఖం భూమి ఆక్రమణపై తహసీల్దార్ కు వినతి
గుండాల,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా ఆక్రమించుకున్న మోద్గులకుంట శిఖం భూములను తక్షణమే స్వాధీనపర్చుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ మోద్గులకుంట శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని దీనిపై రెవిన్యూ యంత్రాంగం సర్వే నిర్వహించి ఆ ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూనెం శ్రీను, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వజ్జా ఎర్రయ్య, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వీసీ దొర తదితరులు పాల్గొన్నారు.
