పశువులపై పిచ్చికుక్క దాడి..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం బర్దిపూర్లో నిన్న రాత్రి ఒక పిచ్చికుక్క తిరుగుతూ పశువులపై దాడి చేసింది. ఈ ఘటనలో పలు పశువులు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి సిబ్బందితో కలిసి గ్రామంలో ప్రత్యేక పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. గాయాల పాలైన బర్రెలు, మేకలు, ఎద్దులు, కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు అందించారు. రైతులకు, గ్రామస్తులు జాగ్రత్తలపై సూచనలు చేశారు.