జగదీశ్వర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ కూటమి గెలుపొందిన శుభ సందర్బంగా మంథని నియోజకవర్గ నాయకుడు నాగినేని జగదీశ్వర్ రావు హర్షం వ్యక్తం చేసారు ఈ సందర్బంగా జగదీశ్వర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపింది
మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గమనించారు. కాంగ్రెస్ ను ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. అక్కడ వార్ వన్ సైడ్ అయ్యింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన అభివృద్ధి పనులను కార్యక్రమాలకు ప్రజలు చూసి ఆమోదం తెలిపి ప్రజలు గెలిపించుకున్నారని తెలిపారు