అనుమతి లేకుండా చెట్టు కొట్టివేసినందుకు జరిమానా

రూ.10 వేల పెనాల్టీ విధించిన అధికారి

జిడబ్ల్యూఎంసి, నేటిధాత్రి

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఉద్యానవన శాఖ (హార్టికల్చర్) అధికారుల అనుమతి లేకుండా హన్మకొండ పరిధి 30వ డివిజన్, బాలసముద్రం సైకిల్ పార్క్ యందు, తబూబియా రోసియా చెట్టును కొట్టివేసినందుకు, సదరు వ్యక్తికి కమిషనర్ ఆదేశాల మేరకు రూ.10 వేల పెనాల్టీ విధించినట్లు హార్టికల్చర్ అధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భగా హెచ్ఓ మాట్లాడుతూ బల్దియా పరిధిలో చెట్లను నరకాలంటే సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరని, ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను కొట్టివేస్తే (నరికివేయడం చేస్తే) పెనాల్టీ విధించడం జరుగుతుందని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అసిస్టెంట్లు అశ్విని, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!