పెద్దకోడేపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవగాహన సదస్సు
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో శాయంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పెద్దకోడపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపి పరకాల కిషోర్ కుమార్ సీఐ శాయంపేట మల్లేష్ ,ఎస్సై దేవేందర్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసిపి ఈస్ జోన్ రవీందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వారి వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైనా నేరాలకు పాల్పడినట్లు అయితే దాని పర్యవసనం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలలో ఉన్న ప్రజలు గ్రూపులుగా విడిపోయి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడదని తెలిపినాడు. ఎలరీత్యా గ్రామాలలో మద్యం మరియు డబ్బులు పంపిణీ చేసినట్లయితే ఎలక్షన్ కమిషన్ వారు ఏర్పాటు చేసిన 1950 నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించగలరని తెలిపినాడు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మహిళలు, గ్రామ యూత్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *