పిడిఎస్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ఆర్‌పిఎఫ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆర్‌పిఎఫ్ ఎస్సై కె. రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…తాను, తన సిబ్బంది తమ విధినిర్వహణలో భాగంగా టిఎన్ 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో తనిఖీలు చేపట్టారు. తనికీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం బస్తాలు కనిపించడంతో అవి ఎవరివి అని విచారించారు. వాటిని తరలిస్తున్న వారెవరు ఎవరు చెప్పకపోవడంతో ఆర్‌పిఎఫ్ సిబ్బంది లైసెన్స్ పోర్టర్‌ల సహకారంతో అక్రమంగా తరలిస్తున్న 25బస్తాలు సుమారు 800కిలోల పిడిఎస్ బియ్యంపై తగు చర్య తీసుకునేందుకు రైల్వేస్టేషన్‌లోనే దించివేశామని తెలిపారు. అనంతరం వీటిని సివిల్ సప్లై అధికారులకు అప్పగించనున్నారు.