ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
జెండా ఎగరావేసిన అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి
ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ నందు అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ కోశాధికారి ఎర్రం లక్ష్మణ్ ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఫర్టిలైజర్ అధ్యక్షులు అరుణ ఫర్టిలైజర్ యజమాని గందె వెంకటేశ్వర్లు జెండా ఎగరావేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరకాల ప్రజలకు తెలియపరుస్తూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్రం భారతదేశంలోని ప్రతి పౌరుడు ఐక్యమత్యంతో భారత దేశ ఔనిత్యాన్ని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులు,ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్,సీడ్స్ కంపెనీ ఎంప్లాయిస్,పట్టణ షాపు గుమాస్తా సంఘం మరియు ఎంప్లాయిస్,హమాలీ సభ్యులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.