ఏఐటీయూసీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఇతర సంఘాలు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే లాభాల వాటా సాధ్యమైందనే విషయాన్ని యువ కార్మికులకు వివరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓ సి 3 గనిలో ఏఐటీయూసీ పిట్ సెక్రటరీఎల్. శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం వచ్చిన లాభాల మీద అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ అసలు విషయాలను కార్మికులకు వివరించాలని కోరారు. చెప్పడం కొంతమంది ఇతర సంఘ నాయకులు పని కట్టుకొని ఏఐటియుసిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం జరుగుతుందని, దాన్ని యువ కార్మికులకు తెలిసే విధంగా వివరించాలని అన్నారు.కొన్ని సంఘాలు కేవలం వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే ఏఐటియుసి పై బురద చల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. అలాంటి సంఘాలు సింగరేణిలో నామరూపాలు లేకుండా చేయాలని కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు పొందుతు న్నటువంటి లాభాలు కేవలం ఏఐటియూసి ఘనత మాత్రమే మరొక సంఘానికి లాభాల పై మాట్లాడే అర్హత లేదు అని ఉద్ఘాటించారు. కొత్తగా వచ్చిన యువతరం కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కార్మికుల హక్కులను సాధించే, కాపాడే ఏకైక యూనియన్ ఏఐటీయూసీ మాత్రమే, కార్మిక లోకం కోసం తమ యొక్క ప్రాణ త్యాగాలకైనా వెనకడుగు వేయని సంఘం ఏఐటీయూసీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మధుగాని విజేందర్,వైస్ ప్రెసిడెంట్ మాతంగి రాంచందర్ , బ్రాంచ్ కమిటీ సభ్యులు నూకల చంద్రమౌళి వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ అజయ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు,సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు,టెంపుల్,క్యాంటీన్ కమిటీ సభ్యులు, షిఫ్ట్ ఇంఛార్జిలు, అసిస్టంట్ షిఫ్ట్ ఇంఛార్జిలు, కార్యకర్తలు,కార్మిక పాల్గొన్నారు.