నడికూడ,నేటిధాత్రి:
ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చుక్క రత్నాకర్ ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పార్టీ జెండా దిమ్మేలు,శిలాఫలకాల పరిరక్షణ కమిటీ స్టేట్ ఇన్చార్జిగా నియమించారు. నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన చుక్క రత్నాకర్ మహారాజ్ డి.ఎస్.పి ఉద్యమ ప్రస్థానం గత 15 సంవత్సరాల నుండి విశారదన్ మహరాజ్ నాయకత్వంలో ఉద్యమ, మరియు పార్టీ ఆదేశాల ప్రకారం నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణతో జిల్లాలో పనిచేసి పార్టీని విస్తరించిన పనిని గుర్తించి ఈరోజు గౌరవప్రదమైన బాధ్యతకి నియమించిన గౌరవనీయులు డా,,విశారదన్ మహారాజ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ,రత్నాకర్ మహారాజ్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కోడేపాక ప్రతాప్.ఈ కార్యక్రమంలో బుస్స తిరుపతి,మేకల ప్రవీణ్, దినేష్,క్రాంతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
