ఎస్టియూ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి
తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి
పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిబంధనలు మార్చాలని ఎస్టియు టిఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి డిమాండ్ చేశారు, శనివారం రాష్ట్ర జాక్టో పిలుపు తొర్రూరు మండలంలోని హరిపిరాల హైస్కూల్లో జీవో ఎంఎస్ నెంబర్ 25కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించడం సరైనది కాదన్నారు, ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి, వెంకటేశ్వరరావు, అనురాధ, ఉపాధ్యాయులు రవి, మధుకర్, రాజేశ్వర్, కుమార్, సంపత్, చంద్ర ప్రకాష్ , మహేందర్ ఆంజనేయులు, పిడి రాజు, నిమ్మల రవి, జి శ్రీనివాస్ , దర్గయ్య, తదితరులు పాల్గొన్నారు
