మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు
జమ్మికుంట: నేటిధాత్రి
పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలని మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతినిత్యం కార్మికులు వివిధ రకాలైన డ్రైనేజీ పనులు చేస్తూ ఉంటారని, కార్మికులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయాలని, పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ కార్మికుల పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అలాంటి కార్మికులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం హుజరాబాద్ లో పనిచేస్తున్న డి.ఎస్.ఆర్.సి కౌన్సిలర్ బత్తుల బబిత మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహనను కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెడు వేసినాలకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. అనంతరం హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ పైన సందేహాలు ఉన్నట్లయితే 1097 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవాలని తెలిపారు .ఈ సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు వైద్య శిబిరాన్ని పరిశీలించి కార్మికులకు సూచనలు ఇచ్చారు . ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఫరహానుద్దిన్ ,చందన, మేనేజర్ రాజిరెడ్డి, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రసాద్ గౌడ్, జమ్మికుంట హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, దిడ్డి నరేందర్, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, ఏఎన్ఎంలు మంజుల, వనజ రాధా, మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు
దేవరకద్ర యం ఈ ఓ బలరాం..
లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని
దేవరకద్ర మండల విద్యాధికారి పి.బలరాం అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నూతన యం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం శనివారం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల తరగతి బోధన, తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ ఎం ఎం.ఏ. బాసిద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో యంఈ ఓ, బల రాం మాట్లాడుతూ, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గుణాత్మక మైన విద్యతో పాటు అక్షయ పాత్ర ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.పాఠ్యపుస్తకాలు రెండు జతల ఏక రూప దుస్తులు సైతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ల ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యా బుద్దులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల తో పాటు ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారంతో లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి చేస్తున్న కృషిని వివరించారు. కాగా మండల విద్యాధికారి బాధ్యతలు స్వీకరించిన తదుపరి లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన యంఈ ఓ, బలరాం ను ఈ సందర్భంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ యం లు , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ ఎం లు బాసిద్, మురళీధర్ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ , ఎస్.కల్పన, ఆస్ర ఖాద్రి, దోమ శంకర్, సుజాత, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
వీణవంక తాసిల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్
జమ్మికుంట: నేటిధాత్రి
వీణవంక మండల తాసిల్దారుగా గుర్రం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తాసిల్దారుగా పనిచేసిన లక్ష్మణ్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ కు బదిలీ కాగా శ్రీనివాస్ గౌడ్, వీణవంకకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రజలుసమస్యలుఉన్నట్లయితే నేరుగాతాసిల్దార్కార్యాలయంకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి భూమి విషయంలో రైతులకు సందేహాలు ఉన్నట్లయితే తన వద్దకు వచ్చి పరిష్కార మార్గాల గురించి చర్చించినట్లయితే వారికి అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పనిచేస్తూ ముందుకు పోతామని, పైరవీకారులకు ఆస్కారం లేకుండానే తన వద్దకు వచ్చిన సమస్యలను వారి ముందే పరిష్కరిస్తానని తెలిపారు. గతంలో కలెక్టరేట్లో, డి ఆర్ డి ఏ లో పనిచేయడం జరిగిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీణవంక తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించారు.
అశ్రునయనాల మధ్య విజేందర్ అంతిమయాత్ర.
@జనసంద్రోహంగా మారిన చింత నెక్కొండ.
@ నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..
@కడసారి వీడ్కోలు పలికిన బాల్యమిత్రులు, కుటుంబ సభ్యులు ,పోలీస్ ఉన్నత అధికారులు.
వరంగల్ / పర్వతగిరి,నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దబ్బట విజేందర్ శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో వరంగల్ నుండి తొర్రూరుకు బైక్ పై వస్తుండగా మార్గం మద్యలో మామునూరు సమీపంలో ప్రమాదానికి గురై మృతు ఒడిలోకి జారుకున్నాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ నుండి తొర్రూర్ కు బైక్ పై వస్తున్న విజేందర్ గుర్తుతెలియని వాహనం ఢీకొని మామునూరు సమీపంలో గాయాలపాలు అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తొర్రూరు ఎస్సై మరియు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విజేందర్ ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండ లోని మెడికవర్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే విజేందర్ మృతి చెందాడని వైద్యులు తెలపగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
శోకసముద్రంలో మునిగిన చింత నెక్కొండ.
విజేందర్ ఇక లేడు అనే వార్తను చింత నెక్కొండ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు చిన్ననాటి నుండి గ్రామస్తులతో పంచుకున్న ప్రేమ అనురాగాలు చిన్ననాటి స్నేహితుల ఆప్యాయతల నడుమ విజేందర్ అంతక్రియలు శోక సముద్రంలో కొనసాగాయి. అంతేకాక పక్క మండలమైన నెక్కొండ లోని చిన్ననాటి స్నేహితుల కన్నీటి జాలల మధ్య విజేందర్ పై ఉన్న ప్రేమ అనురాగాలతో కంటినీరు వరదయ్య పారింది. చింత నెక్కొండ లోని గల్లి గల్లి కి విజేందర్ అమరహే అనే నినాదాలు మిన్నంటాయి. విజేందర్ కడసారి చూపు కోసం నర్సంపేట, నెక్కొండ, తొర్రూర్ ప్రజల కన్నీటితో విజేందర్ అంతక్రియలు చింత నెక్కొండ స్మశాన వాటికలో శుక్రవారం రాత్రి ముగిసాయి.
అంతిమయాత్రలో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులు.
కానిస్టేబుల్ విజేందర్ అంతిమయాత్రలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని విజేందర్ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నర్సంపేట ప్రజల నోటిలో నాలుకలా..
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ 9 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ విజేందర్ ప్రజల నోట్ల నాలుకలా అయ్యాడు.అందరినీ ఆప్యాయంగా పరికరించే కానిస్టేబుల్ ప్రమాదంలో మరణించాడనే సమాచారంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.తనతో కలిసి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నివాళులు అర్పించారు.
వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోగులకు వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే..ఆసుపత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డా.శ్రీకాంత్ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
పలు విభాగాలకు స్వయంగా వెళ్లి రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే..
డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, చికిత్స అందజేయాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముక్కిరాల మదువంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ నాయకులుచిలుకలరాయకోమురు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ కు వెళ్తే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన రావాలి
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి….
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామగుండం పోలీస్ కమిషనర్(సీపీ )ఎం శ్రీనివాస్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. రికార్డులను పరిశీలించారు.పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు,వారి సమస్యల గురించి రామకృష్ణాపూర్ ఎస్సై ని అడిగితెలుసుకున్నారు. కాలనీలు, గ్రామాల్లో జరిగే నేరాలపై ఆరా తీశారు. డయల్ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్‌లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళితే సత్వరమే న్యాయం జరుగుతుందనే భావన ప్రజలకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ లు ఉన్నారు.
కె.ఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి.
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఓదెలు మాదిగ డిమాండ్.
చిట్యాల నేటిదాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నీరుల మాధవ్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ కోసం తన కుటుంబాన్ని పట్టించు కోకుండా ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ఎంచుకొని 30 సంవత్సరాల సుదీర్ఘకాలం పోరాట ఫలితమే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశమంతా మాదిగలు మాదిగ ఉపకులాలు గర్వించదగ్గ విషయమని తెలుసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తెలుసుకోవాలని చిట్యాల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలుమాదిగ డిమాండ్ చేశారు ,మందకృష్ణ మాదిగ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని కె ఆర్ నాగరాజు మాట్లాడాలని అన్నారు, మంద కృష్ణ మాదిగ ఒక శక్తి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల పోలీసు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయి ఒక ఎమ్మెల్యే అయినవు
మాల ఉద్యోగస్తుల సమావేశంలో మాదిగలను కించేపర్చేలా ఏ బి సి డి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు వెంటనే రాజీనామా చెయ్యాలి అనిడిమాండ్ చేశారు
వర్ధన్నపేట నియోజకవర్గంలో మాలల ఓట్లు 6000 ఉంటే మాదిగల ఓట్లు 60000 వేలు ఉన్నవి ఒక్క మాలలే ఓట్లేస్తే గెలిచినా అనడం సిగ్గుచేటని ఎమ్మెర్పీఎస్ నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు…
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలతో ఇచ్చిన ఏబీసీడీ వర్గీకరణ తీర్పును అపహాస్యం చేసేలా మాట్లాడటం సిగ్గుచేటని మాదిగల పట్ల వివక్షత చూపిన ఎమ్మెల్యే నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు… మరియు అంబేద్కర్ వాదిని అని చెప్పుకునే ఎమ్మెల్యే నాగరాజు అంబేద్కర్ సామాజిక న్యాయా సూత్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఒక మాలవర్గమే రిజర్వేషన్ ఫలాలు తినాలని మాట్లాడడం సిగ్గుచేటని ఆయన అంబేద్కర్ వాది కాదని దీన్ని బట్టి రుజువైంది ఇప్పటికైనా అంబేద్కర్ వాదులు అని చెప్పుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా దళిత గిరిజనులారా అన్ని పార్టీలో ఉండే మాదిగ మాదిగ ఉప కులాల నాయకులారా అప్రమత్తం కండి చైతన్యవంతులై బూటకపు మాటలు చెప్పే నాయకులను తరిమికొడదాం భవిష్యత్ కార్యచరణ రూపొందిద్దాంఅని అన్నారు,
పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి మరువలేనిది
మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని గాలివారిగూడెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని మరిపెడ సముదాయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత రావు అన్నారు.గాలివారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేసి ఇటీవల బదిలీ పై వెళ్ళన ఉపాధ్యాయులు గుగులోతు వెంకన్న, లింగాల మహేష్ గౌడ్,ఫైజుద్దీన్,బాలు గార్లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేశారని,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయుల కృషి మరువలేనిది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి,గాలివారిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకన్న,బి.మురళీధర్,
వీరన్న,విద్యార్థినీ,విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
రామన్న పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం
ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది..
ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఇందిరమ్మ రాజ్యం లోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం, రామన్న పల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం రోజు ఆయన ప్రారంభించరు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామస్థాయి లోనే బీజం పడాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో పదవతరగతి, ఇంటర్ మరియు డిగ్రీ చదివిన యువతకు త్వరలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ యశోద, పిఆర్ఎఇ సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై. అచ్చన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, నాయకులు శ్రీశైలం యాదవ్, రఘుపతి రెడ్డి, యాదన్న యాదవ్, గోపాల్, కృష్ణయ్య, అంజి, చంద్రయ్య , తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న కౌన్సిలర్ పార్వతి విజయ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఎమ్మెల్యే వివేక్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కౌన్సిలర్ పార్వతి విజయ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసి ముందుకెళ్తానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టి పి సి సి కార్యదర్శి రఘునాథరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భగత్ సింగ్ జన్మదిన వేడుకలు
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ
జిల్లా కమిటీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భగత్ సింగ్ 117 వ జయంతిని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఏంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో భగత్ సింగ్ జన్మదిన వేడుకలలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జయంతి కార్యక్రమంలో భగత్ సింగ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూనుగు మీసాల వయసులోనే ఉరికంభం ఎక్కి 23ఏళ్లకే దేశం కోసం తన ప్రాణం అర్పించిన భగత్ సింగ్ ఒక గొప్ప విప్లవ కారుడు అని, దేశం కోసం యువత దేశం భద్రత కోసం ముందు వరుసలో నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయు జిల్లా కన్వీనర్ చంద్రగిరి శంకర్ ఏఐఎస్ఏ భూపాలపల్లి జిల్లా సెక్రటరీ శీలపాక నరేష్ తాటికొండ రాకేష్, రాజు మధు, సురేష్ విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది.
కుక్కకరిసిన వెంటనే టీకాలు వేయించుకోవాలి.
# ఘనంగా ప్రపంచ రేబీస్ దినోత్సవం.
నర్సంపేట,నేటిధాత్రి :
ఎలాంటి పరిస్థితుల్లోనైనా కుక్కకరిసిన వెంటనే టీకాలు వేయించుకోవాలని ప్రాంతీయ పశు వైద్యశాల ఏడీ.డాక్టర్ బిఎన్ రెడ్డి అన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నర్సంపేట
ప్రాంతీయ పశు వైద్యశాల వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా రైతులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి టీకా కార్యక్రమం చేపట్టారు.ఇండ్లల్లో పెంచుకొనే కుక్కలకు తప్పనిసరిగా క్రమపద్ధతిలో టీకాలు వేయించాలి.
అదేవిధంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకు వాటిపట్ల అవగాహణ నిర్వహించారు.రేబీస్ సోకిన పిచ్చికుక్క,ఇతర కుక్కల నుండి వ్యాది ఏవిధంగా వస్తుంది, కుక్కలు కరవ కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కరిచినచో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ నేపథ్యంలో 23 కుక్కలకు మరియు 19 గెదెలకు ఉచిత టీకాలు వేశారు.ఈ కార్యక్రమంలో బానోజీపేట పశువైద్యారికారి డాక్టర్ ఎం.వింధ్య,పాఠశాల హెడ్ మాస్టర్ రామకృష్ణ,ప్యార వెట్, స్టాఫ్ మాసు రబ్బానీ,రాజ్ కుమార్,గోపాలమిత్ర రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
30న భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చౌక్ లో జరిగే రిలే దీక్షలను జయప్రదం చేయండి. పాయం.
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం శనివారం నాడు ఐటిడిఏ ధర్నా చౌక్ ఆవరణలో సున్నం సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఆఫీస్ ఆదివాసుల మౌలిక సమస్యలు మరియు భూమి సమస్యలు ఆదివాసి హక్కుల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని ఐటీడీఏ అధికారులను కోరారు
ఏజెన్సీలోకి వలసలు విపరీతంగా పెరిగిపోయాయని వలసలు మూలంగా ఏజెన్సీలో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసుల మనుగడ భవిష్యత్తులో ప్రమాద అంచులో పడిపోతుందని కావున ప్రభుత్వం వలస నిరోధక చట్టం రూపకల్పన చేయాలని ఆదివాసీల మనుగడ కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా అవసరం ఉందని అన్నారు
పేరుకే ఐటీడీఏ ఏజెన్సీ చట్టాలు ఏ మండల కేంద్రంలో గాని జిల్లా కేంద్రంలో మరియు నియోజకవర్గ కేంద్రంలో గాని అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీలకు భూమితోనే జీవనాధారం అలాంటి భూములను వలస గిరిజనేతర కబ్జా చేతుల్లోకి మారాయని ఇలాంటివి అనేక సమస్యలు ఆదివాసులకు ఎదురవుతున్నాయని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే 30న దీక్షలు ప్రారంభానికి సిద్ధమయ్యామని వెల్లడించారు. ఈ యొక్క సమావేశంలో పాయం సన్యాసి కారం సుధ కారం లక్ష్మి పోడియం నాగమణి కారం సమ్మక్క పాల్గొన్నారు
కల్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులపంపిణి చేసిన ఎమ్మెల్యే రేవూరి
మల్లక్కపేట గ్రామ లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే రేవూరి
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటినుండి దరఖాస్తు చేసుకున్న వారికీ తక్కువ సమయంలోనే చెక్కులను అందించడం జరుగుతుందని అన్నారు.పట్టణం మరియు మండలానికి కలిపి 120మంది లబ్ధిదారులకు 12,013,920 రూపాయల చెక్కులను అందజేశామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి వినోద,భైరపాక రేణుక,బొజ్జం సుజాతలకు చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలో ఓ “ఎస్ఐ” (ర్యాంకర్) బూతు పురాణం?
సా…., బండి ఆపురా.. లం…? ఎన్కౌంటర్ చేస్తా, అంటూ రాయలేని బాషలో బూతు పురాణం?
ఫోన్లో మాటలు రికార్డ్ చేసుకున్న బాధితుడు?
ప్రభుత్వాలు మారిన, మారని కొందరి పోలీసుల తీరు?
మెయిల్ ద్వారా డీజీపీ కి పిర్యాదు చేసిన బాధితుడి కుమారుడు?
మొన్న సుబేదారి పోలీస్ స్టేషన్లో చిన్న పిల్లల మీద కేసు నమోదు చేసిన సంఘటన వెలుగులోకి
నేడు వరంగల్ నగరంలోని ఓ ఎస్ఐ మాటల బూతు పురాణం ఆలస్యంగా వెలుగులోకి..
వరంగల్ తూర్పు నేటిధాత్రి
నగరంలో రోడ్ల మీద వెళ్తున్న వాహనదారులను అర్థరాత్రి పూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ (ర్యాంకర్) రోడ్డు మీద వెళ్ళే వారిని ఆపి మాట్లాడే బాష చెప్పలేని పరిస్థితి అని ఒక బాధితుడి ఆవేదన. అధికారులు సైతం సామాన్యులతో సౌమ్యంగా మాట్లాడుతుంటే ఈ ర్యాంకర్ ఎస్ఐ లు మాత్రం వీళ్ళ మాటలు, చేష్టలు వెనకటిలాగనే ఉంటున్నారు తప్ప ఏమాత్రం మారలేదు అనే వాదన వినిపిస్తోంది. వారి సర్వీస్ విషయంలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఉన్నతాధికారులను సైతం బహిరంగంగానే తిడుతున్న సదరు ర్యాంకర్ ఎస్ఐ?. సదరు ర్యాంకర్ ఎస్ఐ సామాన్యులను రోడ్ల మీద నానా భూతులు మాట్లాడటం వింటుంటే ఫ్రెండ్లీ పోలీస్ వాహనదారుల పట్ల లేదనే చెప్పాలి. సదరు ఎస్ఐ తనకు కేటాయించిన విధుల్లో భాగంగా తనిఖీ పేరుతో రోడ్ల మీద వెళ్తున్న వాహనదారుల పట్ల బండ్లు ఆపే క్రమంలో అరేయ్ బండి ఆపురా.., సా… అంటూ చెప్పలేని, రాయలేని మాటలు మాట్లాడినట్లు తెలిసింది. ఇలాంటి అధికారుల మాటల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది అనేది వాస్తవం. ర్యాంకర్ ఎస్ఐ రాత్రి పూట రోడ్డుపై ఆపిన వ్యక్తి కొడుకు గ్రూప్1 అధికారి కావడంతో జరిగిన ఘటన ఫోన్లో రికార్డ్ చేసిన మాటలు విన్న సదరు అధికారి, ఈ అంశంపై తెలంగాణ డీజీపీ కి మెయిల్ ద్వారా పిర్యాదు చేసినట్లు సమాచారం? రిటైర్మెంట్ అయి ఇంట్లో ఉండాల్సిన వారిని గత ప్రభుత్వం 3ఏండ్లు పెంచి నిరుద్యోగులను ఆగం చేసింది అని కొందరు నిరుద్యోగుల ఆవేదన.
ఫుట్ బాల్ రాష్ట్రస్తాయి పోటీలకు ఇద్దరు విద్యార్థినులు ఎంపిక
ఎంపికైన విద్యార్థినులను సన్మానించిన పరకాల ఎంపిడిఓ ఆంజనేయులు
పరకాల నేటిధాత్రి
సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి క్రీడల ఎంపికలో పరకాల ప్రభుత్వ పాఠశాలనుండి 10 వతరగతికి చెందిన తేజశ్విని,9వ తరగతికి చెందిన అనూష ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యారు.అక్టోబర్ 3 నుండి 5 వరకు మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు.ఎస్జియఫ్ఐ కార్యదర్శి సంధి కరిత ద్వారా విషయం తెలుసుకున్న పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు విద్యార్థినులను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అవార్డు తెచ్చుకోవాలని విధ్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామాని సాంబయ్య,పరకాల ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్,మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
16వ డివిజన్ గరీబ్ నగర్ లో కార్పొరేటర్ పర్యటన.
సమస్యలపై దృష్టి సారించిన స్థానిక కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి.
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ గరీబ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ సుంకర మనీషా శివకుమార్ పలు సమస్యలపై పర్యటించడం జరిగింది.గరీబ్ నగర్ లో పారిశుద్ధ్య మరియు వాటర్ సప్లయ్ కి సంబంధించిన పలు సమస్యలపై గ్రామములోని పలు వీధులలో మున్సిపల్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలతో సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పలు వీధులలో పేరుకుపోయిన చెత్తను,మరియు మురుగు కాలువలు శుభ్రం చేయడం లాంటి శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ జవాన్ కు సూచించారు.వాటర్ సప్లయ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.దోమలు,ఈగలు వ్యాప్తి చెందకుండా వెంట, వెంటనే అర్బన్ మలేరియా సిబ్బంది చే మందులు పిచికారీ చేయడం, నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది అన్నారు.ప్రజలు కూడా స్వీయ పరిశుభ్రత, పరిరక్షణ పాటించాలని కోరారు.ఇంటి ఆవరణ లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పోగుల సంజీవ, స్థానిక నాయకులు బొజ్జం తిరుపతి,రాజారాం, ఎస్ కె అంజాద్,బొంత.రవికుమార్,పూర్ణ, ఆకుల.శ్రీకాంత్,గిరిశెట్టి.అశోక్,మెండు.రామకృష్ణ,మున్సిపల్ జవాన్ రాజేష్,సిబ్బంది,అర్బన్ మలేరియా సిబ్బంది,గరీబ్ నగర్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన సనత్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భగత్ సింగ్ విగ్రహానికి జనసేన పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నాయకుడు సనత్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ 117వ జయంతిని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది భగత్ సింగ్ నునూరు మీసాల వయసులోని దేశం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు భగత్ సింగ్ ప్రాణాలను సైతం దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే అర్పించిన నాయకుడు మనం అందరం భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాకేష్ మధు శ్రీకాంత్ రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు
ప్రమాదకర స్థితిలో తూరుబాక కల్వర్టు
కూలిపోయేందుకు సిద్ధంగా తూరుబాక కల్వర్టు.
భద్రాచలం నేటి ధాత్రి
అధికారుల ఆదేశాలు బేఖతారు.
ఆందోళన చెందుతున్న స్థానికులు, ప్రయాణికులు.
చర్ల మండలంలోని పెద్దపల్లి ఇసుక ర్యాంపు, దుమ్ముగూడెం మండలంలోని రేగుపల్లి ఇసుక ర్యాంపు ల ద్వారా వస్తున్న భారీ ఇసుక లారీలను నియంత్రించకపోతే తూరుబాక గ్రామ శివారులోని కల్వర్టు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నది. మండల పోలీస్ అధికారులు , రెవిన్యూ అధికారులు ఇసుక లారీలను అటువైపుగా వెళ్లవద్దని ఆదేశించిన ఇసుక మాఫియా అవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలే సగం రోడ్డు కోతకు గురవడం వలన కృంగిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నది. అధిక బరువుతో లారీలు రావడం ఇబ్బందిగా మారింది. తక్షణమే జిల్లా కలెక్టర్ , ఇతర ఉన్నత అధికారులు స్పందించి ఇసుక లారీలు రాకుండా నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
నస్పూర్ ఎస్సై సుగుణాకర్
నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆక్స్ ఫర్డ్ స్కూల్ విద్యార్థుల ద్వారా డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. రామగుండం సిపి ఆదేశాల మేరకు నస్పూర్ సిఐ అశోక్ కుమార్, ఎస్సై నేల్క సుగుణాకర్ ఆధ్వర్యంలో షిర్క్ సెంటర్ నుంచి ర్యాలీగా విద్యార్థులు పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహం వరకు వందలాది మంది ర్యాలీగా పాల్గొన్నారు. ఎస్సై సుగుణాకర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు అనేవి మనిషికి తక్షణం ఆనందాన్నిచ్చిన దీర్ఘకాలంలో అవి భయంకరమైన ప్రభావాలను దారి చూపుతాయి. మాదకద్రవ్యాలు వినియోగం వలన విద్యార్థుల యొక్క జ్ఞాపకశక్తి నశించిపోతుందని, శారీరక రుగత్మకలు కలిగి చిన్న వయసులో అనేక రకాలైన వ్యాధులకు గురి అవుతారని, విద్యార్థిని, విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండాలని మీ చుట్టూ ప్రక్కల వారు ఎవరైనా మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వారిని రిహాబిటేషన్ సెంటర్కు తరలించే కార్యక్రమంలో సహాయ సహకారాలను అందించాలని తెలిపారు.50 వేల వరకు ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలలో విద్యార్థులు డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. మద్యం, మాదకద్రవ్యాలు, గంజాయి వంటి ప్రమాదకర దురలవాట్లకు వీరిలో కొంతమంది బానిసలుగా మారుతున్నారు. పశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో వీరిపై మాధక ద్రవ్యాల ప్రభావం పడుతుంది. యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలయ్యే అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనకాడరు, స్నేహితులు, బాంధవ్యాలను మరచి ఒంటరిగా కుంగిపోయి చివరికి ఆత్మహత్యలు కూడా దారి తీయొచ్చని తెలియజేశారు. గంజాయి, మాదకద్రవ్యాలను తీసుకుంటే మానసిక మరియు నాడీవ్యవస్థ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. గంజాయిలో కెన్వవినాయిడ్స్ అనే మత్తు పదార్థం ఉంటుంది. అతిగా సేవిస్తే స్క్రోజోఫోనియాకు గురవుతారు. మత్తుకు బానిసలుగా మారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. కుటుంబ సభ్యుల దురలవాట్లు వారసత్వంగా సక్రమించే ఆస్కారం ఉంది. స్వేచ్ఛతో పరిస్థితుల ప్రభావంతో చెడుపోకడలకు బానిస అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచి విద్యార్థులకు లైఫ్ స్కిల్ ఇంప్రూవ్మెంట్స్, జనరల్ బిహేవియర్ వంటి వాటిపై కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ఎస్సై నేల్కా సుగుణాకర్, ఆక్స్ ఫర్డ్ కరస్పాండెంట్ ఆంటోనీ, ప్రిన్సిపాల్ జస్టిన్, వైస్ ప్రిన్సిపాల్ థామస్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
