ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెరా కిరణ్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
దామెర కిరణ్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం ఊరుకోయ్యోలను సరసాలను ముద్దాడిన భగత్ సింగ్ నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు.
ఈ దేశంలో ఒక దిక్కు మతోన్మాద విధానాలు మరో దిక్కు సావర్కర్ లాంటి దేశద్రోహుల చరిత్ర ను పాఠ్యాంశాలలో లిఖిస్తున్న కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టే అటువంటి కుట్రను, వ్యతిరేకించాలంటే నిజమైన దేశభక్తుడు అయినటువంటి భగత్ సింగ్ లాంటి పోరాట జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది అన్నారు .
అదేవిధంగా పుస్తకాల నుండి దేశ చరిత్ర నీ తొలగిస్తూ ఈ దేశాన్ని అజ్ఞానంలో నెట్టే ప్రయత్నంలో ఈ కేంద్రంలో కూడా బీజే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు .
ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు విద్య అందరిని,
ద్రాక్షల తయారవుతుందన్నారు.
ఈ దేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యావ్యత్రిక విధానాలకు వ్యతిరేకంగా పోరావలసిన అవసరం ఉందని వారు అన్నారు.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ 27న నిర్వహించిన హలో విద్యార్థి చలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జన ధర్నా కార్యక్రమం సందర్భంగా ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వంపై అక్రమ అరెస్టను తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్ కోటేష్ స్వామి చరణ్ వంశీ అర్జున్ శివ కేశవులు తదితరులు పాల్గొన్నారు