మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ వద్ద శనివారం రోజున మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో, ఎంపీఓ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శాలువా కప్పి సత్కరించారు. అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా ఆర్థిక ఆర్జీలు పెట్టుకోగా వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీఓ శ్రీపతి బాపూరావు, తహసిల్దార్ వనజా రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నడికూడ,నేటిధాత్రి: ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చుక్క రత్నాకర్ ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పార్టీ జెండా దిమ్మేలు,శిలాఫలకాల పరిరక్షణ కమిటీ స్టేట్ ఇన్చార్జిగా నియమించారు. నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన చుక్క రత్నాకర్ మహారాజ్ డి.ఎస్.పి ఉద్యమ ప్రస్థానం గత 15 సంవత్సరాల నుండి విశారదన్ మహరాజ్ నాయకత్వంలో ఉద్యమ, మరియు పార్టీ ఆదేశాల ప్రకారం నియమ నిబంధనలకు లోబడి క్రమశిక్షణతో జిల్లాలో పనిచేసి పార్టీని విస్తరించిన పనిని గుర్తించి ఈరోజు గౌరవప్రదమైన బాధ్యతకి నియమించిన గౌరవనీయులు డా,,విశారదన్ మహారాజ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ,రత్నాకర్ మహారాజ్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన ధర్మ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ కోడేపాక ప్రతాప్.ఈ కార్యక్రమంలో బుస్స తిరుపతి,మేకల ప్రవీణ్, దినేష్,క్రాంతి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిగురుమామిడి రాజయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఫోటోకు పూల దండేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు రాజయ్య గారి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జీఎస్సార్ పూలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటానని అధైర్య పడొద్దని అన్నారు ఎమ్మెల్యే వెంట గ్రామ కమిటీ అధ్యక్షుడితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు
ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని నర్సంపేట – 4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్ల భారతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల పోషణ మాసం సందర్భంగా పోషణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు సిడిపివో మధురిమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 వ వార్డు కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రంలో అన్ని కార్యక్రమాలు ఆదర్శవంతంగా చేపడుతున్నారని అన్నారు.కలెక్టర్ మంజూరు చేసిన అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మాధవ రెడ్డితో మాట్లాడి వెంటనే నిర్మాణ పనులు చేపట్టేటట్లు చొరవ చూపిస్తానని హామీ ఇచ్చారు.సిడిపివో మధురిమ,ఏసిడిపివో హేమలతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, పోషణ లోపం నుంచి విముక్తులను చేయడం, రక్తహీనతను తగ్గించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా ఐసిడిఎస్ ముందుకు సాగుతుందని ఐసిడిఎస్ లో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గర్భిణీ, బాలింత స్త్రీలు విధిగా వచ్చి అంగన్వాడి కేంద్రంలో ఒక పూట భోజనం చేసి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని సూచించారు. అంగన్వాడీ టీచర్స్ చెప్పే ప్రతి విషయాలను పాటించాలని తెలిపారు. సీనియర్ సిటిజెన్సు ఐసిడిఎస్ లో భాగమని వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా 37 మంది సీనియర్ సిటిజన్స్ కు శాలువాలు కప్పి సన్మానించారు. సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా టీహెచ్ఆర్ పిల్లల తల్లి బొల్లు శ్రావణి బాలామృతంతో తయారుచేసిన కేక్ ను సీనియర్ సిటిజన్ తో కట్ చేయించారు. ఇఎంఏ మహిళా అధ్యక్షురాలు,గైనకాలజిస్ట్ డాక్టర్ భారతి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సన్మానించబడిన 37 మంది సీనియర్ మహిళలకు క్యాంపు చేపట్టి పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు మూడు నెలల పాటు ఉచితంగా అందిస్తామని,దశలవారీగా సీనియర్ మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తానని హామీ ఇచ్చారు.
36 మంది మహిళలు వివిధ పోషకాలతో కూడిన వంటకాలు తయారు చేసి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. వంటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలకు,అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు గేమ్స్ నిర్వహించి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమ, ఝాన్సీరాణి,హెల్త్ ఎడ్యుకేటర్ మార్త, మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పావని, జెండర్ స్పెషలిస్ట్ హర్షిత, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, మాజీ కౌన్సిలర్ వాసం కరుణ, సీనియర్ సిటిజన్ మండల కాంతమ్మ, ఇమ్మడి మంజుల, మాజీ వార్డ్ మెంబర్ తక్కల్లపల్లి ఉమ,ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు అడ్డగట్ల భాగ్య, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ లావన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్, అంగన్వాడీ టీచర్స్ గొర్రె రాధ,బత్తిని శిరీష,ఎండీ గౌసియా, వాణి, ఆయా సునీత,ఏఎల్ఏంఎస్సి సభ్యులు గడ్డం భవాని, చార్ల మౌనిక, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ క్యాతం తేజశ్రీ,ఆర్పి రజిత,ఆశా కార్యకర్తలు రాజమణి, రమ,తల్లులు, పిల్లలు,సీనియర్ సిటిజన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదైనా కూడలిలో ఏర్పాటు చేయాలనీ బీజేపీ నాయకుల డిమాండ్
పరకాల నేటిధాత్రి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరకాల కూడలిలో ఏర్పాటు చేయాలని పరకాల బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా మార్త బిక్షపతి మాట్లాడుతూ దేశం కోసం కృషి చేసి ప్రపంచమే గుర్తించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత పాలకుల అలసత్వంతో పరకాలలో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ముందుకు రావడం స్వాతిస్తున్నామని కానీ ఆ విగ్రహాన్ని ఏదో మూలన ఏర్పాటు చేయకుండా కూడలిలో ఏర్పాటు చేసి ఆ కూడలికి గాంధీ చౌక్ గా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్,తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, భూపాలపల్లి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సయ్యద్ గాలిప్, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్,ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,సీనియర్ నాయకులు పావుశెట్టి శ్రీనివాస్,మహిళా మోర్చా అధ్యక్షురాలు వెలిశెట్టి శారద తదితరులు పాల్గొన్నారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశం కోసం ఊరుకోయ్యోలను సరసాలను ముద్దాడిన భగత్ సింగ్ నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని వారన్నారు. ఈ దేశంలో ఒక దిక్కు మతోన్మాద విధానాలు మరో దిక్కు సావర్కర్ లాంటి దేశద్రోహుల చరిత్ర ను పాఠ్యాంశాలలో లిఖిస్తున్న కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టే అటువంటి కుట్రను, వ్యతిరేకించాలంటే నిజమైన దేశభక్తుడు అయినటువంటి భగత్ సింగ్ లాంటి పోరాట జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది అన్నారు . అదేవిధంగా పుస్తకాల నుండి దేశ చరిత్ర నీ తొలగిస్తూ ఈ దేశాన్ని అజ్ఞానంలో నెట్టే ప్రయత్నంలో ఈ కేంద్రంలో కూడా బీజే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు . ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు విద్య అందరిని, ద్రాక్షల తయారవుతుందన్నారు. ఈ దేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యావ్యత్రిక విధానాలకు వ్యతిరేకంగా పోరావలసిన అవసరం ఉందని వారు అన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ 27న నిర్వహించిన హలో విద్యార్థి చలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జన ధర్నా కార్యక్రమం సందర్భంగా ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వంపై అక్రమ అరెస్టను తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్ కోటేష్ స్వామి చరణ్ వంశీ అర్జున్ శివ కేశవులు తదితరులు పాల్గొన్నారు
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు గురుకుల విద్యా JAC పిలుపు మేరకు శనివారం TTREITA ఆధ్వర్యం లో చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులు విధులకు హాజరై తరగతిగది బోధన, కార్యాలయ పనులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. * అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు శాశ్వత భవనాలను సమకూర్చాలి * అన్ని గురుకులాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి * 0 1 0 పద్ధు ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలి * గురుకులలో నిధుల లోటు తీర్చడానికై ఆర్థిక శాఖ ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి * పెండింగ్ బిల్లులను సత్వరం విడుదల చేయాలి * అశాస్త్రీయమైన కొత్త టైం టేబుల్ ఉపసంహరించుకుని 9 నుండి 4:30 వరకు గల పాత టైం టేబుల్ ను పునరుద్ధరించాలి * నైట్ స్టే, హాలిడే డ్యూటీలు చేసిన టీచర్లకు సిసిఎల్ లేదా వీక్ ఆఫ్ ప్రకటించాలి * ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు చేర్చి కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి * ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్ ద్వారా గురుకులం సెక్రటరీకి మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, వైస్ ప్రిన్సిపల్ నరసింహ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ భవాని తో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం గణపురం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రఅంబేద్కర్ యువజన సంఘం పిలుపుమేరకు తేదీ 29,- 9 2024 రోజున జరగబోయే 48వ వార్షికోత్సవ సభ విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 1955 సంవత్సరంలో ఏర్పాటుచేసిన షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1977 సెప్టెంబర్ 21న 2014లో తెలంగాణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని కావున 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి కొత్త పాత సంఘాల అనుబంధ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులు గౌతమ బుద్ధ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నారాయణ గురు సాహు మహారాజ్ బీర్సా ముండా భాగ్యరాజు వర్మ ఫాతిమా గార్ల చరిత్రను యువజన బహుజనులకు చెప్పి వారిని చైతన్యం చేయాలని అవసరం కార్యకర్తలపై ఉన్నదని బహుజన రాజ్య స్థాపనకు ముందడుగు వేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం మండల అధ్యక్షుల సన్నాయిల వెంకటేష్ ములుగు జిల్లా ఎరుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ పాలకొండ భాస్కర్ చిలువేరు ఉదయాకర్ దూడపాక పున్నం మూల రఘు రెంటాల సదానందం కృష్ణ అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఎస్టియూ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిబంధనలు మార్చాలని ఎస్టియు టిఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి డిమాండ్ చేశారు, శనివారం రాష్ట్ర జాక్టో పిలుపు తొర్రూరు మండలంలోని హరిపిరాల హైస్కూల్లో జీవో ఎంఎస్ నెంబర్ 25కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించడం సరైనది కాదన్నారు, ఆశాస్త్రీయమైన రేషలైజేషన్ నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి, వెంకటేశ్వరరావు, అనురాధ, ఉపాధ్యాయులు రవి, మధుకర్, రాజేశ్వర్, కుమార్, సంపత్, చంద్ర ప్రకాష్ , మహేందర్ ఆంజనేయులు, పిడి రాజు, నిమ్మల రవి, జి శ్రీనివాస్ , దర్గయ్య, తదితరులు పాల్గొన్నారు
స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిమొగిలిచర్ల సందీప్,పిడీఎస్యు డివిజన్ అధ్యక్షులు కొమ్ము కరవి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ 117 వ జయంతిని పురస్కరించుకొని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ చింతకుంట్ల వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.అనంతరం మొగిలిచర్ల సందీప్,కొమ్ముక రవి మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయసులో దేశ స్వాతంత్రం కోసం ఊరికాంబాన్ని ముద్దాడిన గొప్ప మహనీయుడని అలాంటి మహనీయుని యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో అందరికీ విద్యా ఉపాధి కలగాలని లక్ష్యంతో పోరాడుతామని తెలిపారు.భగత్ సింగ్ యొక్క అడుగుజాడల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ జయంతి కార్యక్రమంలో కాలేజీ యుఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సాత్విక్ ,రాజు,వెంకటేష్,మహేష్,రాణి, సమత,మమత,సరిత,రాజేందర్, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
పరకాల నేటిధాత్రి సెయింట్ గాబ్రియేల్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయిక్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)విద్యార్థినిలు 9,10 తరగతులకు చెందిన ఏకు.తేజశ్విని,బి.అనూష ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యారు.జిల్లా స్థాయి పోటీలకు ఎన్నికైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది శాలువాలతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరం అని క్రీడలు శారీరక ఉల్లాసంతో పాటు మానసిక దృఢత్వాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను వారు అభినందించారు అలాగే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు. అందరూ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని,తదుపరి సంవత్సరం విద్యార్థులందరూ క్రీడల్లో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల ఉన్నత పాఠశాల(బాలుర) ప్రధానోపధ్యాయులు చిలువేరు సురేందర్ ఉన్నత పాఠశాల బాలుర ఉపాధ్యాయులు ఎండి షేక్ దావుద్,దొమ్మటి భద్రయ్య,పి.సుచరిత,ఓ.భాగ్యమ్మ,కే అరుణ,స్వప్న,పి.శ్రీనాథ్, డి.నాగయ్య,ఎం.బిక్షపతి,జి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివంగత బాలకిష్టయ్య విగ్రహం దగ్గర రోడ్ చిన్నగా ఉన్నది ఈరోడ్ లో బారి వాహనాలు లారీలు ఇతర రాష్ట్రాల లారీలు రోడ్డుపై నిలబెట్టి సరుకులు దింపడంవల్ల బాటసారులకు ప్రజలకు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసెల్ నెంబర్ 83 281 58 949 ఆందోళన వ్యక్తం చేశారు . భారీ వాహనాలు కమాన్ చౌరస్తాలో రోడ్డుపై ఆపడం వల్ల కమాన్ చౌరస్తా దివంగత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణయ్య విగ్రహం నుండి ఇందిరా పార్క్ వరకు రోడ్డు జామ్ అవుతుందని అదేవిధంగా మజీద్ రోడ్డు డాక్టర్ బాలకృష్ణయ్య షాపింగ్ కాంప్లెక్స్ వరకు రోడ్డు జామ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .గతంలో ట్రాన్స్పోర్ట్ లోడింగ్ లారీలు ఇతర వాహనాలు ఉదయం ఏడు గంటల వరకే అన్లోడింగ్ చేసేవారని ఆ తర్వాత వాహనాలు రోడ్డుపై నిలిపి సరుకులు దింపడం పోలీసులు నిషేధించారని ఆయన గుర్తు చేశారు . ప్రస్తుతం వనపర్తి లో ఆ పరిస్థితి లేదని వెంటనే పోలీస్ అధికారులు చర్యలు తీసుకొని రోడ్లపై ట్రాన్స్పోర్ట్ వాహనాలు భారీ వాహనాలు ఇతర రాష్ట్రాల వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఖాదర్ పోలీసులకు ఒకప్రకటనలో విజ్ఞప్తి చేశారు
అనంతరం ఎ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ… హన్మకొండ జిల్లా నగరం లోకల్ నారాయణ జూనియర్ కళాశాల విద్యాశాఖ నుండి 38290 కోడితో 31-3-58/8 హౌస్ నెంబర్ తో కోమటిపల్లి లో అనుమతి ఉంటే అదనంగా గోపాలపుర్ లో రెండు కో బ్రాంచులు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలు నారాయణ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) అనుమతి ఉంటే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ లోకల్ నారాయణ జూనియర్ గర్ల్స్, కళాశాల, నారాయణ జూనియర్ బాయ్స్ కళాశాల పేర్లతో కళాశాల నిర్వహిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కూడా పట్టించుకోకుండా చోద్యంగా చూస్తున్న విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలు పాటించని లోకల్ నారాయణ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ప్రశాంత్ వినయ్ రాజు ప్రసాద్ రాకేష్ రోషన్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ కొమ్ముగూడెం లోని ఆర్ డబ్ల్యు ఎస్ బోరు త్రాగునీరు కలుషితమవుతుందని స్థానిక తాజా మాజీ వార్డ్ మెంబర్ జాగటి వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం బోరు పరిసర ప్రాంతంలో నీటి వసతి కొరకు బిగించిన నాల్లాను నివాస ప్రాంత ప్రజల అవసరాలకు వినియోగించుకునే సమయంలో అడ్డుగా వచ్చి ట్రాక్టర్లు బైకులు కడుగుతున్నారని ఆరోపించారు.నీటి వసతిని అనుగుణంగా వినియోగించుకోకుండా వాహనాలు కడిగి నీటిని వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బోర్ కేసింగ్ సరైన ఎత్తులో లేక వ్యర్థ నీరు మళ్లీ బోరులోకి చేరి త్రాగు నీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నదని వివరించారు.అదనంగా బోర్ కేసింగ్ బిగించి,బోర్ చుట్టూ గద్దె నిర్మాణం చేపట్టి త్రాగునీరు కలుషితం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అఖిల భారత పద్మశాలి యువజన విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన పోరండ్ల కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా పెగడపల్లి గ్రామానికి చెందిన కందికట్ల ప్రశాంత్ ను నియమిస్తూ అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం శనివారం నియామక పత్రాలను అందజేశారు. మర్రిపెల్లిగూడెం చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా,కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన పోరండ్ల కృష్ణ ప్రసాద్ గత రాజకీయ అనుభవంను దృష్టిలో ఉంచుకొని పద్మశాలి యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి నూతనంగా అధ్యక్షునిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం తెలిపారు.యువజన అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం,రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్,రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ ,ప్రధాన కార్యదర్శి దాసి వెంకటేశ్వర్లు, కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్,పోరండ్ల రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు పద్మశాలీల సమస్యల సాధన కోసం కుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గొల్లపల్లి సెక్టర్, ఇబ్రహీం నగర్ సెక్టర్ పరిధిలోని సివియర్ ఆ క్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎస్ ఏ ఎం) మాడే ట్రీ ఆక్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎం ఏ ఎం) తక్కువ బరువు గల పిల్లలకి వైద్యాధికారి నరేష్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిడిపిఓ వీరలక్ష్మి మాట్లాడుతూ ఎస్ ఏ ఎం, ఎం ఏ ఎం పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురి అవుతారు, కాబట్టి వాళ్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్వాడి కేంద్రంలో పిల్లల బరువులు ఎత్తులు చూయించి అంగన్వాడి పాఠశాల పిల్లలు వారి యొక్క పెరుగుదల ఆరోగ్యం కొరకు అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టికాహారం గుడ్లు, పాలు, బాలామృతం , బాలామృతం ప్లేస్ పిల్లలకు నిత్యం అందించాలని పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పిల్లలు యొక్క పెరుగుదల, బలంగా, పిల్లలు ఉంటారని పౌష్టికాహారం పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని ఆరోగ్యంగా బాగుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, వైద్యాధికారి నరేష్, సూపర్వైజర్లు జానకి, జ్యోతి, అంగన్వాడి టీచర్లు హెల్త్ సిబ్బంది పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇటీవల చనిపోయిన తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తోట ఎల్లయ్య, జడల పేట గ్రామానికి చెందిన గొర్రె రాజయ్య, నైన్ పాక గ్రామానికి చెందిన నాగుల శంకరయ్య కంచర్ల చంద్రయ్య కుటుంబాలను శనివారం రోజున పరామర్శించిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ఆయన వెంట టిఆర్ఎస్ మండల నాయకులు శ్రీనివాస్ నాయక్ మాజీ ఎంపీటీసీ పిట్ట సురేష్ నల్ల దేవేందర్ రెడ్డి మిన్నపురం రమేష్ గొర్రె మల్లేష్ సాంబయ్య తదితరులు ఉన్నారు.
గత పాలకుల తప్పిదాలు పునరావృతం కావద్దు సీపీఐ(ఎం) నేత పీ.సోమయ్య
కారేపల్లి నేటి ధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిస్తే అధోగతి పాలుకాక తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పీ.సోమయ్య హెచ్చరించారు. కారేపల్లి మండలం మాణిక్యారం`1,2, గ్రామశాఖల సమావేశం శుక్రవారం రేపాకుల లాలయ్య నగర్‌లో జరిగింది. ఈసభలో పీ.సోమయ్య మాట్లాడుతూ అధికారంలోకి రావటానికి బూర్జువా పార్టీలు హామీ గుమ్మరించటంలో వాటిని అమలులో షరతులు పెట్టటం అసంపూర్తిగా అమలు చేయటం సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. పెట్టుబడుల కాలం కావటంతో రైతులు ఒత్తిడికి గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల చేసిన దప్పిదాలను పునరావృత్తం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. చౌకదుకాణాలను బలోపేతం చేయటం ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల బాధలను వదిలేసి మందిరాలు మతం అందిపుచ్చుకుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మైనార్టీలు బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భూక్యా వీరభద్రం మాట్లాడుతూరాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో ఆరంభశూరత్వం కనపిస్తుందని విమర్శించారు. గిరిజన గిరిజనేతర పోడు సమస్యకు పరిష్కారం రాలేదని సీతారామ ప్రాజెక్టు నీరు కారేపల్లి మండలానికి అందేలా వైరా ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాణిక్యారం`మొట్లగూడెం బీటీ రోడ్డు వెంటనే చేపట్టాలని పదోతరగతి పరీక్షాకేంద్రాన్ని మాణిక్యారంలో ఏర్పాటు చేయాలని పేదలందరికి పక్కా గృహాలు ఇవ్వాలని రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులకు పెన్షన్ ఇవ్వాలని మహాసభలోతీర్మానాలు చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు రేపాకుల వీరభద్రం ఎగరవేశారు. కార్యదర్శులుగా కరపటి సీతారాములు పోతర్ల నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మెరుగు సత్యనారాయణ మండల కార్యదర్శి కే.నరేంద్ర నాయకులు వజ్జా రామారావు దాసరి మల్లయ్య కొండబోయిన ఉమావతి కొత్తూరి రామారావు ధారావత్ వస్రాం పాయం వరలక్ష్మి. రేపాకుల వీరమ్మ కల్తీ రామచంద్రు వడ్డూరి వీరబాబు పండగ కొండయ్య కుర్సం శ్రీను దమ్మాలపాటి ప్రభాకర్ కాటేపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3వ ఐకాన్స్ హెల్త్ కేర్ అవార్డ్స్ – 2024 ఉత్తమ డాక్టర్ ప్రశంసా పత్రన్నీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కి చెందిన పాలమూరు న్యూరో సర్జన్ డాక్టర్ సందీప్ బోయిల కు దక్కింది.శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సందీప్ బోయిలను సన్మానించారు.. ఈ కార్యక్రమం లో జడ్చర్ల మాజీ ఉపసర్పంచ్ డి.శ్రీనివాసులు, మాజీ వార్డు సభ్యులు మాజీ మూడ డైరెక్టర్ వై.జి.ప్రీతం, మాజీ వార్డు సభ్యులు టి.విజయభాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, పి.కాశీ విశ్వనాథ్, మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..
జమ్మికుంట: నేటి ధాత్రి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు స్థానిక వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులచే పదివేల సీడ్ బాల్స్ తయారు చేసి చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు రామిడి శ్రీనివాస్ మాట్లాడుతూ అడవుల పెంపకానికి ఉద్దేశించి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారుచేసి అక్టోబర్ 2న ఫారెస్ట్ ఏరియాలో వెదజల్లుతామని తెలిపారు. దేశంలో చెట్లను నాటడం కన్నా అడవుల నరికివేత అధికంగా ఉన్నందున ప్రతి పౌరుడు బాధ్యత గా వ్యవహరించి చెట్లను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లంకి రమేష్, చందా రవీందర్,మహిళా అధ్యక్షురాలు అయిత స్వాతి, రామిడి విజయలక్ష్మి, నవ్య మరియు కళాశాల ప్రిన్సిపల్ కె. రాజిరెడ్డి , అధ్యాపక బృందం పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.