సా…., బండి ఆపురా.. లం…? ఎన్కౌంటర్ చేస్తా, అంటూ రాయలేని బాషలో బూతు పురాణం?
ఫోన్లో మాటలు రికార్డ్ చేసుకున్న బాధితుడు?
ప్రభుత్వాలు మారిన, మారని కొందరి పోలీసుల తీరు?
మెయిల్ ద్వారా డీజీపీ కి పిర్యాదు చేసిన బాధితుడి కుమారుడు?
మొన్న సుబేదారి పోలీస్ స్టేషన్లో చిన్న పిల్లల మీద కేసు నమోదు చేసిన సంఘటన వెలుగులోకి
నేడు వరంగల్ నగరంలోని ఓ ఎస్ఐ మాటల బూతు పురాణం ఆలస్యంగా వెలుగులోకి..
వరంగల్ తూర్పు నేటిధాత్రి
నగరంలో రోడ్ల మీద వెళ్తున్న వాహనదారులను అర్థరాత్రి పూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐ (ర్యాంకర్) రోడ్డు మీద వెళ్ళే వారిని ఆపి మాట్లాడే బాష చెప్పలేని పరిస్థితి అని ఒక బాధితుడి ఆవేదన. అధికారులు సైతం సామాన్యులతో సౌమ్యంగా మాట్లాడుతుంటే ఈ ర్యాంకర్ ఎస్ఐ లు మాత్రం వీళ్ళ మాటలు, చేష్టలు వెనకటిలాగనే ఉంటున్నారు తప్ప ఏమాత్రం మారలేదు అనే వాదన వినిపిస్తోంది. వారి సర్వీస్ విషయంలో కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఉన్నతాధికారులను సైతం బహిరంగంగానే తిడుతున్న సదరు ర్యాంకర్ ఎస్ఐ?. సదరు ర్యాంకర్ ఎస్ఐ సామాన్యులను రోడ్ల మీద నానా భూతులు మాట్లాడటం వింటుంటే ఫ్రెండ్లీ పోలీస్ వాహనదారుల పట్ల లేదనే చెప్పాలి. సదరు ఎస్ఐ తనకు కేటాయించిన విధుల్లో భాగంగా తనిఖీ పేరుతో రోడ్ల మీద వెళ్తున్న వాహనదారుల పట్ల బండ్లు ఆపే క్రమంలో అరేయ్ బండి ఆపురా.., సా… అంటూ చెప్పలేని, రాయలేని మాటలు మాట్లాడినట్లు తెలిసింది. ఇలాంటి అధికారుల మాటల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది అనేది వాస్తవం. ర్యాంకర్ ఎస్ఐ రాత్రి పూట రోడ్డుపై ఆపిన వ్యక్తి కొడుకు గ్రూప్1 అధికారి కావడంతో జరిగిన ఘటన ఫోన్లో రికార్డ్ చేసిన మాటలు విన్న సదరు అధికారి, ఈ అంశంపై తెలంగాణ డీజీపీ కి మెయిల్ ద్వారా పిర్యాదు చేసినట్లు సమాచారం? రిటైర్మెంట్ అయి ఇంట్లో ఉండాల్సిన వారిని గత ప్రభుత్వం 3ఏండ్లు పెంచి నిరుద్యోగులను ఆగం చేసింది అని కొందరు నిరుద్యోగుల ఆవేదన.