తేది 27-12-2024 రోజున భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ టెన్ కోర్ట్స్ కాంప్లెక్స్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్లో జరిగినది. ఇట్టి సంతాప సభను హనుమకొండ, వరంగల్ ఇరు బార్ అసోసియేషన్ అధ్యక్షులైన మాతంగి రమేష్ బాబు, టి. జీవన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినది ఇట్టి కార్యక్రమం లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో చాలా మంది సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అపారమైన జ్ఞానంతో, సమగ్రత తో దేశాన్ని నడిపించారని మరియు తను దేశానికి చేసిన సేవలను కొనియాడారు మరియు అతని మృతి దేశానికి పెద్ద తీరని లోటని అన్నారు. ఇట్టి సమావేశంలో ఇరు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని గోపాలపురం గ్రామానికి చెందిన దూడం లావణ్య భర్త దూడం రాజేందర్ కు 50వేల రూపాయల చెక్కును మరియు మండల కొమురక్క భర్త కీర్తి శేషులు మండల రవి) కి 21000/- రూపాయల చెక్కును ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇరువురికి కలిపి మొత్తం 71 వేల రూపాయల చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శుక్రవారం రోజున చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ అందజేశారు, ఈ కార్యక్రమంలో, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఏకు రవీందర్ నీలం కుమారస్వామి, శ్రీరామ్ కుమారస్వామి, గొర్రె హరీష్, గోవిందుల సాంబశివుడు, గూడెపు అశోక్, పైడిపాల రాజయ్య,కాట్రేవుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని కూడలి వద్ద మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గొప్ప ఆర్థికవేత్త లో ఒకరు, నాయకులు సంస్కర్త అన్నిటికంటే మించి మన కాలంలోని మానవ తావా ది మన్మోహన్ సింగ్ జి ఇక లేదని అన్నారు. సద్గుణం ని ష్కలమైన సమగ్రత నిర్ణయం తీసుకోవడంలో అన్నిటికంటే మానవీయత చూసే వ్యక్తి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేస్తూ , ఆయన కుటుంబానికి యావత్తు భారతదేశ ప్రజలకి తీరని లోటు మహాత్మా మళ్ళి జన్మించాలి భారతదేశ పునర్నిర్మాణంలో భాగం కావాలి ఆయన ఆశయాన్ని కొనసాగించేటువంటి వంటి బాధ్యత అలాగే భారతదేశ ప్రజల మీద ఉన్నదని ఆశిస్తూ అన్నారు.ఈ కార్యక్రమంలో మారపేల్లి రవీందర్ ,దుబాసి కృష్ణమూర్తి, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి రాజు, కట్టయ్య, చిందం రవి, బాసని రవి-శాంత, మార్కండేయ, ప్రపంచ రెడ్డి, రఫీ, అన్ని గ్రామాల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
వనపర్తి నెటిధాత్రి : మాజీ ప్రధానమంత్రి దివంగత మహానేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్యసభసభ్యులు గా 33 సంవత్సరాలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి దివంగత మజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే తెలిపారు 2004 నుండి 2014 వరకు దేశ ప్ర దానిగా ఉండిమన్మోహన్ సింగ్ ప్రజలకు సేవలు అందించారని ఎమ్మెల్యే ఒకప్రకటనలో పేర్కొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐ టి సి రా మెటీరియల్ సి సి ఏ ఆఫీస్ నందు భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట్ పుల్లయ్య భద్రతా నియమాల పట్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన ఐటీసీ అధికారులు .తొలత మొక్కలు నాటి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక్క మొక్కను ప్రతి ఒక్కరు నాటాలని పిలుపునిచ్చారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి ప్రాణం ఎంతో ముఖ్యమైనదని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించాలని అప్పుడే ప్రమాదాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రమాదం జరిగితే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మొత్తం కూడా సర్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి భద్రత ఏ విధంగా పాటించాలో వివరించారు. ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్టు హెల్మెట్ నియ మనిబంధనలు ఆచరించాలని అప్పుడే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని సూచించారు.
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతదేశానికి ప్రధానిగా,ఆర్థిక మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా,వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన *మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంపట్ల నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, కొండిశెట్టి కృష్ణమూర్తి, భోగాల శ్రీనివాస్ రెడ్డి, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, చుక్కా సుధాకర్, భీమవరపు వెంకటరెడ్డి, చెగోండి శ్రీనివాస్, బండారు నాగేశ్వరరావు, ఒగ్గె రమణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రసమళ్ళ రాము, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గాడి విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, కొప్పుల రాజా, మహిళలు మైధిలి బి, రసూల్ బి, రాజేశ్వరి, రూపా దేవి, తుమ్మల రాణి తదితరులు పాల్గొన్నారు
#ఎట్టకేలకు రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు.
#రైతు బాధలను వెలుగులోకి తీసుకువచ్చిన నేటిధాత్రి కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.
నల్లబెల్లి, నేటిధాత్రి: గత పది రోజులుగా నేటి దాత్రి సంచికలో రైతుల కోసం అనునిత్యం ప్రచురణ వార్తలు రావడంతో అధికారులతో పాటు, పి ఏ సి ఎస్ చైర్మన్ స్పందించి రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చారు మండలంలోని పలువురు డీలర్లు ఇష్ట రాజ్యాంగ యూరియాకు పురుగుమందు లింకు పెడుతూ అమ్మడం జరిగింది. దీనిని నేటి ధాత్రి ప్రతినిధి వెలుగులోకి తీసుకురాగా పలువురు డీలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కానీ రైతుల సంక్షేమమే అనే దిశగా నేటి ధాత్రి ప్రతినిధి ఎవరి బెదిరింపులను లెక్కచేయకుండా రైతులకు అండగా నిలుస్తూ వారికి భరోసా కల్పించారు. ప్రత్యేక చొరవతో పి ఎస్ ఎస్ చైర్మన్ తో మాట్లాడి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని వారిని కోరగా స్పందించిన చైర్మన్ మరుసటి రోజే యూరియాను తెప్పించి రైతులకు అందించడంతో రైతులు వారి పక్షాన నిలబడిన నేటి దాత్రి కు కృతజ్ఞతలు తెలియజేశారు.
వరంగల్ కాశీబుగ్గ మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి కుమారుడు అమెరికాలో ఉంటున్న బయ్య మదు, తన పుట్టిన రోజు వేడుకలను వరంగల్ లోని వారి స్వగృహంలో, స్థానిక ముదిరాజ్ నాయకులు, బయ్య యువసేన బృందం ఆధ్వర్యంలో శాలువా కప్పి, కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బయ్య మదు పుట్టినరోజు సందర్భంగా “బయ్య యువసేన” తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బయ్య యువసేన మిత్రులు సిలివేరు రాజు, గుజ్జుల రాకేష్ రెడ్డి, శేషు, చింటూ, వినయ్ గౌడ్, మరియు స్థానిక కాశీబుగ్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బిళ్ళ శివ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, దేవేందర్ ముదిరాజ్, తిరుపతి ముదిరాజ్, పవన్ ముదిరాజ్, చింటూ ముదిరాజ్, చంద్రశేఖర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, సాయి ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
-చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే చీరి చింతకు కట్టుడే
-తిక్కవేషాలేస్తే తొండలు జొర్రగొట్టుడే.
-సినీ గద్దలకు సిఎం స్ట్రాంగ్ వార్నింగ్.
-అల్లు అర్జున్ గీత దాటాడు.
-చట్టం ముందు అందరూ సమానులే.
-రాజ్యానికి ఎదురుతిరిగితే ఎవరికైనా ఇదే గతే.
-సిఎం పంతం నెగ్గి…సినిమా పెద్దలు తగ్గి!
-నోరెత్తని హీరోలు, దర్శకులు.
-ప్రభుత్వ కార్యాలయాలు ప్రచారం చేయాలి.
-తెలంగాణ అభివృద్ధిని చూపించాలి.
-పిలిచి మరీ వెదవలను చేశారని లోలోన ఆక్రోశం.
-సినీ పెద్దలలో కనిపించిన అసహనం.
-ఎగేసుకుంటూ వెళ్లడంపై గొణుక్కుంటూ జారుకున్నారు.
-రాజ్యం ముందు తలెగరేస్తే దించుకోవాల్సిందే అని తెలుసుకున్నారు.
-హీరోలు జీరోలైపోయారు. తెలంగాణ దెబ్బ రుచి చూశారు.
-మీ పని మీరు చేసుకోండి..ఇతర విషయాలపై వేలు పెట్టడం మానుకోండి.
-సినిమా విషయంలో ఏది జరిగినా బాధ్యులు మీరే.
-ఒళ్లు దగ్గర పెట్డుకొని ఉండండి.
-నోరు మెదపలేకపోయిన సినిమా గద్దలు.
-రెండు గంటల పాటు అంతా సైలెన్స్.
హైదరాబాద్,నేటిధాత్రి:
మేం వేరు..మా బ్లడ్ వేరు..మేము అభిమానుల పాలిట దేవుళ్లం. అద్దాల మేడలోవుంటాం. మేమొస్తున్నామంటే పోలీసులు కూడా కాపలా కాయాల్సిందే.. పడిగాపులు కాయాల్సిందే..ప్రభుత్వాలు వణకాల్సిందే. సెలెబ్రిటీలంటే మేమే..మా ముందు ఎవరైనా జుజుబీయే..మేం కనుసైగ చేస్తే అభిమాన ఆర్మీలు కదులుతాయి. ఎంతటి వారి కూసాలైనా విరుగుతాయి. ప్రభుత్వాలు మాకో లెక్కనా..మేం ఎవరు కావాలనుకుంటే వారే పాలకులౌతారు. మా రాకతోనే నాయకులకు కూడా కలొస్తుంది. సభలకు బలమొస్తుంది. నాయకులకు గెలుపొస్తుంది. మేం అన్నిటికీ అతీతలం..ఇదీ సినీ జనం ఒకప్పటి మాట…కాలం మారింది. రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. సినీ చరిత్రలో మొదటిసారి సినీ లోకం గజగజ వణుకుతోంది. ప్రభుత్వం పేరు వింటేనే వారి వెన్నులో చలి మొదలౌతోంది. మేం వేరు అనుంటే వేర్లతో సహా పెకలించే నాయకుడు వచ్చాడు. అటు వంటి పాలకుడిని చూస్తున్నాం. ఈక జాడిస్తే తోక కత్తిరించే ముఖ్యమంత్రి వున్నారు. ఉడుత ఊపులు ఊపితే తొండలు జొర్రించేలా వున్నాడు. అని ఇప్పటిదాకా దైవాంశ సంబూతులమన్న భ్రమల్లో తేలియాడుతున్న వారి జీవితాల్లో మొదటిసారి భయం అంటే ఏమిటో రుచి చూపించిన ఏకైక పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. భయం అంటే ఏమిటో సినీ రంగానికి రుచి చూపించడమే కాదు, ఇక్కడ టన్నులు టన్నులుంది అని గజ్జున వనికిస్తున్నాడు. కలలో కూడా రేవంత్ రెడ్డి పేరు కలవరించేలా చేస్తున్నాడు. కంటి మీద కునుకే లేకుండా కాళరాత్రులు చూపుతున్నాడు. సినిమా పేరుతో తెలంగాణను దోచుకొని, అభిమాని కుటుంబం తొక్కిసలాటకు బలి చేసిన అల్లు మీద కన్నెర్ర చేయడంతో సినీ పెద్దలు ఒక్కసారికి ఉలికిపాటుకు గురయ్యారు. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి రావడానికి భయపడిపోయాడు. అల్లు అర్జున్ స్వయంగా బావమరిది కొడుకు. తన ఇంట్లో పెరిగాడు. అలాంటి అల్లు అర్జున్ కేసుల్లో ఇరుక్కుంటే ఓదార్పుతోనే సరిపెట్టాడు. తలదూర్చేందుకు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. స్టార్లు, మెగాస్టార్లు ఎంత మంది వచ్చినా జరిగిన తప్పును సరిదిద్దే పరిస్దితి లేదు. ఒక వేళ వచ్చినా పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు. పెద్ద మనిషి తరాహా వ్యవహారం కూడా వుంటేనే అప్పుడు సార్ధకమౌతుంది. ఒక మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్‌నే ఇంత వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇరవై రోజులు తర్వాత గాని ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు తీరిక దొరకలేదు. ఇతర సినీ పెద్దలకు మనసు రాలేదు. ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఇష్టం లేని చూపులు చూస్తున్నారు. మీడియా ముందు ఫోజులు కొడుతున్నారు. ఎప్పుడైతే మంత్రి కోమటి రెడ్డి వెళ్లి తన ట్రస్టు ద్వారా అబ్బాయి కుటుంబానికి 25వేల చెక్కు అందించిన తర్వాత సిగ్గు తెచ్చుకున్నారు. గత పదిహేను రోజుల క్రితం సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత 25లక్షలు అందిస్తామని చెప్పి పది లక్షలిచ్చి అల్లు అర్జున్ చేతులు దులుకున్నాడు. ఈ సంగతి స్వయంగా మృతి చెందిన మహిళ భర్త చెప్పడంతో సమాజమంతా అల్లు అర్జున్‌ను, చీచీ అన్నది..తూతూ అని ఉమ్మేసింది. అప్పుడు నిర్మాతలను పంపి 50లక్షల చెక్ ఇప్పించాడు. తర్వాత అల్లు అరవింద్ వచ్చిన మరో కొత్త కథ చెప్పాడు. ట్రస్టు ఏర్పాటు చేసి, నిర్మాతల సొమ్ముతోపాటు రెండు కోట్లతో బ్యాంకులో జమ చేస్తామని చెక్కులు కూడా చూపించకుండా జారుకున్నాడు. ఇంత తంతు జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? తన దొడ్లోకి అందర్ని పిలిపించుకున్నాడు. పిచ్చ క్లాస్ పీకి పంపించాడు. సినిమా పెద్దలుగా చెలామాణి అవుతున్న వారికి చెమడల్ తీస్తానని తనదైన స్టైల్‌లో సిఎం. రేవంత్ రెడ్డి సినిమా చూపించారు. రెండు గంటల పాటు సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు బుద్దిగా కూర్చునేలా చేశారు. ఇక అప్పుడు తన విశ్వరూపం చూపించాడు. తాను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన ప్రతి మాటకు తాను కట్టుబడి వుంటానని ముఖ్యమర్రతి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇకపై రెగ్యులర్ షోలు మాత్రమే వుంటాయాన్నారు. సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరల పెంపు వుండదన్నారు. రేట్లు పెంచుకునే అవకాశాలు ఇవ్వడం కుదరదన్నారు. ప్రీమియర్ షోలు, బెన్‌ఫిట్ షోలకు తావులేదన్నారు. ప్రభుత్వం ఎంతో సహృదయంతో ఇచ్చిన జీవోలను అతిక్రమించి, ఒకమహిళ చినిపోవడానికి కారణమై, కూడా పశ్చాత్తాపం లేని సినిమా వర్గాలు కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడం జరగదన్నారు. సినిమాలు విడులైన తర్వాత హీరోలు చేసే హంగామాలకు పర్మిషన్లు ఇవ్వడం జరగదన్నారు. హీరోలు ఎక్కడికి వెళ్లినా, ఏదైనా సమస్యలు ఎదురైనా, సంఘటనలు జరిగినా బాధ్యత వాళ్లే వహించాలని సూచించారు. ఇక బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని లేని పోని రాద్దాంతాలు చేసినా, ప్రజలకు అసౌకర్యం కల్గించినా క్షమించేది లేదని తేల్చి చెప్పారు. అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా ఎలాంటి దురుద్ధేశం లేని, పోలీసులు చెప్పినా వినకుండా ఆయన సంధ్య ధియేటర్‌కు వెళ్లడం తప్పన్నారు. అంటి సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ చూపిన నిర్లక్ష్యాన్ని చట్టం సహించదని గుర్తు చేశారు. పెద్దఎత్తున వేలాది మంది అభిమానులు చేరుకుంటున్నారని తెలిన వెంటనే పోలీసులు అల్లు అర్జున్‌ను రావొద్దని హెచ్చరించిన వచ్చి హంగామా చేయడం వల్లనే దురదృష్ట సంఘటన జరిగింది. పోలీసుల సూచనలు బేఖాతరు చేసినందునే బన్నీ మీద కేసులు నమోదు చేయడం జరిగిందన్న సంగతిని మరోసారి సిఎం. స్పష్టంచేశారు. జరిగిన సంఘటనపై సినీమా పెద్దలకు మరోసారి వీడియోలు చూపించి న్యాయం మీరే చెప్పండి? అని వారికి సూచించినట్లు తెలుస్తోంది. అప్పుడు సినిమా పెద్దలంతా ఏం మాట్లాడలేదని సమాచారం. అంతే కాకుండా పోలీసులదే తప్పన్నట్లు, ప్రభుత్వం మీద నెపం నెట్టేసే ప్రయత్నం పదే పదే చేయడాన్ని ఎవరూ సహించరు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. చట్టమంటే అందరికీ భయం కూడా వుండాల్సింది. సెక్యూరిటీ ఇస్తున్నారని పోలీసులను చులకన చేయడానికి సినిమా కాదని అన్నట్లు కూడా తెలుస్తోంది. సినిమా అంటే వినోదంగా వుండాలి. లేదా సందేశాత్మకంగా వుండాలి. అంతే కాని వ్యవస్ధను కించపర్చేలా, యువతను తప్పుదోవ పట్టించేలా వుండొద్దని సూచించినట్లు కూడా సమాచారం. ఇకపై సినీ రంగం తప్పకుండా తమ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలని సిఎం. సూచించారు. సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సినీ రంగం కూడా కృషి చేయాలన్నారు. యువత డ్రగ్స్ లాంటి మహమ్మారి బారిన పడి జీవితాలను బలి చేసుకుంటున్నారు. సినిమాల్లో చూపి వాటిని అనుసరిస్తున్నారు. అనుకరిస్తున్నారు. వాటి బారిన పడుతున్నారు. ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేషాలు లేకుండా చూసుకోవాలి. అంతే కాకుండా గంజా, డ్రగ్స్, మద్యం సేవనాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు రావాలన్నారు. సినిమా నిర్మాణాల పరంగా ఎక్కడా ఇబ్బంది వుండదు. మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బొంబాయిని మించి సినిమాలు నిర్మాణం చేసుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాము. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే ముందుకు సాగుతున్నాము. వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి ప్రత్యేకమైన అభిప్రాయాలు లేవు. వ్యక్తిగత ఇస్టాఇస్టాలకు ఎలాంటి తావులేదు. తెలుగు సినీ పరిశ్రమ తెలుగుకే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా వుంటుంది. అండగా వుంటుంది. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం వుంటుందని సిఎం. చెప్పారు. అయితే సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతలను కర్తవ్యంగా తీసుకోవాలి. సమాజాభివృద్దికి తోడ్పాడునందించాలి. సామాజిక రుగ్మతల మీద సినిమాలు రావాలి. వాటిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుక సినీ పరిశ్రమ ముందుకు రావాలి. యువతకు మంచి మార్గం చూపే సినిమాలు రావాలి. సినీ పెద్దలకు సిఎం. సూచించారు. సమావేశం ముగించారు. దాంతో బాలకృష్ణ సినిమాలో మొదటిసారి ఒక సింహాన్ని చూశాను సార్ అని చలపతి రావు అన్నట్లు, ఇంత కాలానికి ఒక ధైర్యవంతుడైన సిఎంను చూసి సినీ పెద్దలు జడుసుకున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) కార్యాలయం ముందు సిపిఐ జెండా ఏఐటియుసి గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కొండు బానేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ 1925 డిసెంబర్ 26 న ఆవిర్భవించింది నాటి నుంచి నేటి వరకు నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం సిపిఐ పనిచేస్తుందని దున్నే వానికే భూమి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీనీ ఎందరో కమ్యూనిస్టు యోధులు ఈ పార్టీ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని వారిని పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎన్నో పోరాటాలు కొనసాగించారని త్యాగాలు పోరాటాలు చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ ఒక్కటే అన్నారు.ఇది అజరామరమని దేశంలో పేదరికం ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా పోరాడుతునే ఉంటుందని దీనికోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యంగా ఈ దేశంలో అవినీతి పెరిగిపోయిందని దీనిని రూపుమాపాలంటే ఈ దేశంలో ఉన్న 30 శాతం యువత ముందుకు రావాలని కమ్యూనిస్టు పార్టీ చేరాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి సాలీగామ సంతోష్, మలిశెట్టి సత్యనారాయణ మండల సహాయ కార్యదర్శి, మాదారం టౌన్ కార్యదర్శి పట్టీ శంకర్,సముద్రాల ఆనంద్, గజ్జల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
హిందువులతో పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరుడు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని దొరగారిపల్లె లో రామాలయం గుడి నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు మహిళా సోదరీమణులు హరతులతో వచ్చేసి విజయవంతం చేసినారు.వచ్చిన ప్రజలు మరియు గ్రామ ఒక ముస్లిం బిడ్డ మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఈ రామాలయం గుడి నిర్మాణం చేయడం సంతోషంగా ఉంది.అలాగే ఈ ఫయాజ్ ఎప్పుడు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన ముందుంటాడు.ఎప్పుడు కులామతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం వినాయకుల దగ్గర దుర్గ మాత దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా పేద వారికీ ఆపద ఉంటే ఆదుకుంటాడు.మా ఇందారం గ్రామంలో ఇలాంటి ప్రజల సేవకులు ఉండాలి అని ప్రజలు అంటూ ఉంటే ఫయాజ్ మాట్లాడుతు ఋణం తీర్చుకుంటాను గ్రామ ప్రజల శ్రేయస్సే నా సంతోషం,కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా ఉంటానని నా మతాన్ని పూజిస్తూ అన్ని మతాలకు గౌరవిస్తూ గ్రామ అభివృద్ధి కి అండగా ఉంటా ఈ గుడి మెజార్టీ ప్రజల కోరిక అందుకే రాముడి భక్తులు అందరు నాకు అండగా ఉండి ఈ గుడి తొందరగా పూర్తి చేయుటకు తోడుంటారని ఆశిస్తున్నాను.
హనుమకొండ లోని గుండ్ల సింగారం బ్రిడ్జి వద్ద, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కీ.శే శనిగరపు శివకుమార్ యొక్క కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తూ, హనుమకొండ జిల్లా సగర (ఉప్పర) సంఘం అధ్యక్షులు నలుబోల సతీష్ ఆధ్వర్యంలో శివకుమార్ భార్య పవిత్ర, మరియు కుమార్తె, కుమారుడు లను పరామర్శించి, వారి యొక్క కుటుంబ పరిస్థితిని చూసి, మానవత్వంతో దాతల సహకారంతో వారి స్వగృహం గుండ్ల సింగారంలో, హనుమకొండ సదర సంఘం ఆధ్వర్యంలో 70 వేల రూపాయలు, ఒక క్వింటాల్ బియ్యము నలుబోల సతీష్ చేతుల మీదుగా శివకుమార్ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ సగర, తెలంగాణ రాష్ట్ర సగర సంగం కోశాధికారి వడ్ల కుమారస్వామి సగర, వీరగంటి రవీందర్ సగర, నెక్కొండ కిషన్ సగర, గుంటి శ్రీనివాసరావు, సీతా కమలాకర్ సగర, కమలాకర్ రావు, గాండ్ల స్రవంతి, కురిమిండ్ల సదానందం సగర, మంజుల, మల్లేశం, సీతా రమేష్, సీతాదుర్గ ప్రసాద్ రావు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమండ్ల అయోధ్య, సోమ కరుణ, కవిత, కుడిపాక గణేష్ సగర, మంజుల, రాజన్న, తాడిశెట్టి శ్రీధర్, వేముల వెంకన్న, వీరేందర్, మరియు సగర కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మరణించిన కుటుంబానికి భరోసా కల్పిస్తూ, హనుమకొండ సగర సంగం ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు.
పరకాల నేటిధాత్రి 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ కుమారుడు అభినవ్-అంకిత ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం కరీంనగర్ లోని సీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరగగా ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని వారిని ఆశీర్వదించి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,మార్క విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్స్ మడికొండ సంపత్ కుమార్, పోరండ్ల సంతోష్,గొర్రె రాజు స్రవంతి,దామెర మొగిలి, అడప రాము,పసలు లావణ్య రమేష్,బండి రాణి సదానందం గౌడ్,ఏకు రాజు,నాయకులు మడికొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వనం రాజయ్య కుమారుడు చి,, వేణు, చి. ల. సౌ.నీరజ తో . విహహం పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం. గుంపుల గ్రామంలోని పంక్షన్ హల్ లో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం మొగుళ్లపల్లి మండల యూత్ అధ్యక్షులు చెక్క శ్రీధర్ వివాహ కార్యక్రమానికి హాజరై మూడుముళ్ల బంధంతో ఒక్కటైన నూతన వధూవరులను చెక్క శ్రీధర్ దీవించారు. వారి దాంపథ్య జీవితంలో చిరకాలం అన్యోన్యంగా సుఖః శాంతులతో కలసి మెలసి ఉండాలని నిండు మనసుతో దంపతులను దీవించారు.ఈ కార్యక్రమంలో క్యాతరాజు రజనీకాంత్ వనం ప్రభాకర్ వనం కార్తీక్ దేవునూరి రాజేష్ గోస్కుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
జనవరి 5,6,7 తేదీలలో హైదరాబాద్ లో జరిగే డిహెచ్పిఎస్ జాతీయ మహాసభల విజయవంతం కొరకు డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి దేవీ పోచన్న ఆధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సమక్షంలో విరాళాల సేకరణ ప్రారంభించడం జరిగిందని అన్నారు .దేశవ్యాప్తంగా దళితులకు ఆర్థిక ,రాజకీయ, సామాజిక హక్కుల పరిరక్షణ కొరకు కుల వివక్షత, కుల నిర్మూలన కొరకు, ఎస్సీ సప్లై దేశవ్యాప్తంగా అమలు చేయాలని, దళితుల అభివృద్ధికి కేటాయించిన నిధులు దారి మళ్ళించకుండా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు హైదరాబాదులో జరిగే రెండవ జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తెలిపారు. విరాళాలు సేకరిస్తున్న నేపథ్యంలో కార్మికులు ప్రజలు వ్యాపార వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి రవి, పిఎన్ఎమ్ రాష్ట్ర సమితి సభ్యులు మామిడి గోపి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మొగిలి, లక్ష్మన్ లు పాల్గొన్నారు.
మొబైల్ ఫోన్ పోవడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా సి ఈ ఐ ఆర్ సహాయంతో మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించడం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చేపూరి మహేష్ తండ్రి మల్లయ్య డిగ్రీ విద్యార్థి “ఒప్పో ,కంపెనీ ఎఫ్ 23 మోడల్ “తన మొబైల్ ఫోన్ పోవడంతో స్థానిక పోలీస్ అమీన్, పవన్ కుమార్ కు సంప్రదించడం జరిగింది. కానిస్టేబుల్ చంద్రమోహన్ రైటర్ తిరుపతి ,కృషి ఈసీఐఆర్ పోర్టల్ ,ను ఉపయోగించి మొబైల్ ఫోన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి తిరిగి బాధిత విద్యార్థి మహేష్ కు మొబైల్ ఫోన్ను అప్పగించడం జరిగిందని, అమీన్ కచేరి ప్రకటనలో తెలిపారు.పోగొట్టుకున్న ఫోన్ ను విద్యార్థికి అందించడంతో విద్యార్థి మహేష్ ఎస్సై కుమార్ తో పాటు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.
బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావ్,జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ ఆధ్వర్యంలో గురువారం రోజున వీర్ బల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సిక్కుల గురువు గురు గోవింద్ జీ కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్,అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ సింగ్ హిందుత్వం లోంచి ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు సిధ్వాండ్ నవాబ్ వజీర్ ఖాన్ చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.సనాతన ధర్మం కోసం వారు చేసిన ప్రాణ త్యాగాలకు స్మరణగా,ఇస్లామిక్ మూర్ఖపు మతోన్మాదానికి బలైపోయిన ఈ అమర వీరుల వీరోచిత ధైర్యానికి గుర్తుగా గురువారం రోజున దూదాని అమృత్ సింగ్,జగదీష్ సింగ్ ల ఇంటి వద్ద సిక్కు గురువు గురుగోవింద్ జీ,ఫతే సింగ్,జోరావర్ సింగ్ ల చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు,మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు గజ్జెల సురేష్,ఓబీసీ మోర్చ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.
గుండాల మండలం లో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వార్షికోత్సవాలు
ప్రజా ఉద్యమాలే సీపీఐ ఆయుధం
త్యాగాలలో పునీతమైన చరిత్ర సిపిఐది
సిపిఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రజా ఉద్యమాలే సీపీఐకి ఆయుధమని మనిషిని మనిషి దోపిడి చేయని సమ సమాజ నిర్మాణంకోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటివరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుదూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని, సిపిఐ 100 వ ఆవిర్భావ వార్నికోత్సవాలను గుండాల,సాయనపల్లి,మాజీ సర్పంచ్,కీర్తిశేషులు బచ్చల లక్ష్మినర్సు స్థూపం వద్ద వివిధ ప్రాంతాలలో ఘనంగా అరుణ పతాకాల ఆవిష్కరణలు చేశారు, ఈ సందర్భంగా రమేష్ మాట్లడుతూ కార్మిక, కర్షక, ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టలకే ఉంది అన్నారు. దేశ స్వాతంత్ర్య కోసం, పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన పార్టీ సిపిఐ ఎన్నో త్యాగాలు చేస్తూ బ్రిటీష్ కాలం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పడిందని స్పష్టం చేశారు. అప్పటి రజాకార్ల, భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి దొరలను, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టి లక్షలాది ఎకరాల భూమిని పంచి బాంచన్ దొర నీకాల్మోకుత అని బతికే బడుగు బలహీన జీవులు బందూకులు పట్టించి గెరిల్లా రైతాంగ పోరాటం నడిపించిన చరిత్ర సీపీఐదన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా హక్కుల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 100 ఏండ్ల సుధిర్ణ ప్రస్తానంలో సిపిఐ నిర్వహించిన పోరాటాలు, ఉద్యమాలతో ప్రజలకు, కార్మికవర్ష్గానికి అనేక హక్కులు, సౌకర్యాలు సాధించి పెట్టిట్టామని, ఎందరో అమరవీరులు నేలకొరిగారని, మరెందరో ప్రజలకోసం తమ జీవితాలను త్యాగం చేశారని వారి ఆశయాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు అనునిత్యం శ్రమించాలని కోరారు. ఉద్యమాలు నిర్వహించి నిర్మాణపరంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో ప్రతి కార్యకర్త కృషిమరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బికేఏంయు మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్, బచ్చల లక్ష్మయ్య, గంగాధరి రాజయ్య,దాశరథి,ముత్తయ్య, రమ్మల్లెష్,అంజి, హరీష్,విజయ్, రాజేష్,మహేష్,శివ వంశి తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం రోజున నూతన ఎస్ఐ గా డి.రమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ చట్టానికి ఎవరు చుట్టాలు కారని తప్పులు చేస్తే ఎంతటి వారినైనా ఆపేక్షించేది లేదని, ప్రజలు ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని,ఎలాంటి పైరవీలకు తావు లేదని అన్నారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా ప్రతిష్టమైన ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఓదెల మండల కేంద్రానికి చెందిన బూర సదానంద ఇటీవల మృతి చెందగా, సదాశయ ఫౌండేషన్, ఆధ్వర్యంలో ఆతనినేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి స్వగృహంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానంపై మేర్గు. భీష్మాచారి అవగాహన కల్పించారు. నేత్రదాత తల్లి మధురమ్మ కూతుళ్లు ఆమిదాల రమేష్ రాజేశ్వరి, కి,శే,సింగని లక్ష్మీరాజం-కళావతి, కుడికాల.కుమార్- స్వరూప. మనుమలు ఆమిదాల కిషన్ సింగనీ సాయికిరణ్ .శివ మరియు,మనమరాడ్లు లను అభినందించి, (భారత్ గ్యాస్) సత్యనారాయణ చేతుల మీదుగా అభినందన పత్రాన్ని అందజేశారు. గ్రామస్తులు కుల బంధువులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు . సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గౌరవ సలహాదారు నూకా రమేష్. కె.ఎస్.వాసు. ప్రధాన కార్యదర్శిలింగమూర్తి మండలఇంచార్జ్ క్యాతం.మల్లేశం మెరుగు సారంగం,బైరి వినోద్,మల్లేశం,సదానందం,తదితరులు అభినందించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.