తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ అందరి కుటుంబాలల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగృహం హన్మకొండ లోని మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందన్నారు. కాగా, సంక్రాంతి కానుకగా రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నదని తెలిపారు. ఈ మూడు హామీలను ఈనెల 26 నుంచి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భోగి పండగను పునస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి లలిత గోవర్ధన్ దంపతుల శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు గోవర్ధన దుర్వాస చార్యులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ స్వామివారి కళ్యాణాన్ని వేదమంత్రాలతో వైష్ణవ సాంప్రదాయ విధంగా జరుపబడింది అని ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారి శంకర్ మోటపోతుల రాజన్న గౌడ్ మాదాస్ మొగిలి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మూల శ్రీనివాస్ గౌడ్ దెయ్యాల భద్రయ్య బటిక స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
మూడు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్న హైడ్రా
హైడ్రా చర్యలతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదకాల్వల పునరుద్ధరణ
పబ్లిక్ పార్కులు, రోడ్లపై నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్,నేటిధాత్రి:
హైడ్రా తన కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేసింది. సంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేయడం తాజా పరిణామం. ఇక్కడ మొత్తం 13 విల్లాలుండగా, వీటిల్లో రెండు విల్లాలను కోర్డు వివాదం నేపథ్యంలో విడిచిపెట్టి మిగిలిన వాటిని కూల్చివేశారు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లలో మున్సిపాలిటీ, ఇరిగేషన్ నోటీసులను పట్టించుకోకుండా విల్లాలను నిర్మిస్తుండటంతో హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేయడమే కాకుండా ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి, అ క్రమంగా నిర్మిస్తున్న విల్లాలను కూల్చివేయాలని ఆదేశించడంతో, అధికార్లు పనిపూర్తిచేశారు. ఇక్కడ ఒక్కొక్క విల్లా 400 చదరపు గ జాల్లో నిర్మాణ మయ్యాయి. గత ఏడాది జులైకి ముందు అనుమతులు పొందిన రెసిడెన్షియల్ నిర్మాణాలను కూల్చివేయబోమని హైడ్రా అంతకుముందు ప్రకటించింది. అయితే వీటి నిర్మాణాలు ఎప్పుడు చేపట్టింది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసు కుంటుంది. ఇదే సమయంలో వాణిజ్య నిర్మాణాలు ఎప్పుడు నిర్మించినా, అవి ఫుల్ ట్యాంక్ లెవె ల్ ప్రాంతంలో లేదా సమీపంలో వుంటే కూల్చివేయడం తధ్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్) సరిహద్దులను మార్కింగ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్ 22న కూకట్‌పల్లిలోని నల్లచెరువు, కిష్టారెడ్డిపేట, సంగారెడ్డి జిల్లాకు చెందిన అ మీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. సెప్టెంబర్ 23న మాదాపూర్ ప్రాంతానికి చెందిన కావూరిహిల్స్‌లోని స్పోర్ట్స్ అకాడమీ భవ నాలపై కూడా హైడ్రా చర్యలు చేపట్టింది. మొదటి డ్రైవ్‌లో హైడ్రా కూకట్‌పల్లి ప్రాంతంలోని 16 భవనాలను, కిష్టారెడ్డిపేటకు చెందిన మూడు ఆర్.సి.సి. నిర్మాణాలు మరియు పటేల్‌గూడలోని 25 ఆర్.సి.సి.నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇక స్పోర్ట్స్ అకాడమీకి చెందిన రెండువేల చదరపు గజాల స్థలంలో పార్క్ నిర్మాణంకోసం జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. హైడ్రా ఈవిధంగా అక్రమ నిర్మాణాలపై కొరడా రaుళిపిస్తుండటంతో, వివిధ గృహ నిర్మాణాలకురుణాలు మంజూరు చేసే సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మరియురియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులు మంజూరు చేసిన డాక్యుమెంట్ల పరిశీలనను క్షుణ్ణంగా చేపడుతున్నాయి. ముఖ్యంగా వివిధ బ్యాంకులకు చెందిన అధికార్లు, తమ క్షేత్రస్థాయి సిబ్బందికి, రుణాలు మంజూరు చేసిన గృహాల నిర్మాణాల తనిఖీలపై నిక్కచ్చి ఆదేశాలిస్తున్నాయి. ముఖ్యంగా నీటి తావులకు సమీపంలో నిర్మించే గృహాల నిర్మాణం అనుమతుల ప్రకారమే ఏవిధమై ఉల్లంఘనలకు పాల్పడకుండా జరుగుతున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారం సేకరించాలని వారు తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ ఈ గృహ రుణాలపై స్పష్టమైన మార్గదర్శకాలేవీ లేనట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతలకు గురైన ఇళ్లకు సంబంధించి తిరిగి రాబట్టుకోవాల్సిన మిగిలిన రుణమొత్తాల విషయంలో బ్యాంకులు ప్రస్తు తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులకు సమీపంలో నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు అనుమతులను తాత్కాలికంగా నిలుపుచేశాయి. నగరంలోని 400చె రువుల సమీపంలో నిర్మాణలు చేపట్టడానికి అవసరమైన నియమ నిబంధనల్లో స్పష్టత లోపించడమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. సంబంధిత అధికార్లు ఈ నిబంధనల విషయంలో తుది నోటిఫికేషన్ జారీచేసేవరకు ఈ తాత్కాలిక నిలిపివేత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనుమతుల తాత్కాలిక నిలిపివేత నేపథ్యంలో హైడ్రా గత నవంబర్‌లో ఫిల్మ్‌నగర్ ప్రధాన రహ దారిపై వున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. స్థానికులనుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సంస్థ ఈ చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో ఆక్రమణలకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు చెరువులు, ఫీడర్ కెనాల్స్ ఒడ్డున వున్న వ్యర్థాల దిబ్బలు, ఏవిధమైన పరిశీలన లేకుండా చేపడుతున్న నిర్మాణాల తనిఖీలు చేపట్టింది. ఇదే సమయంలో రోడ్డుపై చేపట్టిన అ క్రమ నిర్మాణాలను కూల్చివేసిన వెంటనే రెండు మూడు రోజుల్లోగా ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మా ణం పూర్తిచేయాలని హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ శాఖను కోరింది. ఇక వాణిజ్య కట్టడాల విషయానికి వస్తే అక్రమమని తేలినప్పుడు తక్షణమే కూల్చివేస్తామని హైడ్రా హెచ్చరించింది. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు 17మీటర్ల వెడల్పున వరదకాల్వ నిర్మాణం పూర్తి చేయకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్టును కొనసాగిస్తున్న వాసవి గ్రూప్‌కు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది. ఈ కాల్వ లేకపోవడం వల్ల సఫ్దర్‌నగర్, రాజీవ్‌గాంధీనగర్ ప్రాంతాల్లోని మురికివాడల్లో వర్షాకాలంలో పెద్దఎత్తున నీరు నిల్వ వుంటోంది. దీనివల్ల ఆ ప్రాంతంలో నివసించే పేదలు నానాఇ బ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యేలోగా ఈ వరదకాల్వ నిర్మాణాన్ని పూర్తిచేయాలని హైడ్రా, వాసవి గ్రూప్‌ను కోరింది.
ఔటర్‌రింగ్ రోడ్డు పరిధిలో అక్రమ నిర్మాణాలపై నవంబర్‌కు ముందు విపరీతమైన ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్లు, పార్కులు, నీటి కాల్వలు వంటి ప్రాంతాలను యదేచ్ఛగా ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాల కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో స్థానికులనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఓఆర్‌ఆర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీకి చెందిన కొన్ని ప్రాంతాలున్నాయి. ఇవన్నీ అక్రమ నిర్మాణా లకు హాట్‌స్పాట్‌గా మారడం సమస్యలకు ప్రధాన కారణం. ఇప్పుడు హైడ్రాకు అందుతున్న ఫి ర్యాదులు నగర విస్తరణ వేగంగా జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించినవే కావడం గమనా ర్హం. అయితే వీటికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి హైడ్రా ముందడుగు వేయడానికి వివిధ సమస్యలు అడ్డంకిగా మారాయి. మొదటగా చాలా భూములకు న్యాయపరమైన వివాదాలుండటంతో హైడ్రాకు చెందిన లీగల్ టీమ్‌లు వీటిని చట్టపరిధిలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా యి. కొన్ని నిర్మాణాల విషయంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇక్కడనిర్మాణాలు చేపట్టినవారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు స్పష్టంగా లేకపోవడంతో, హైడ్రా మున్సిపల్, రెవెన్యూ రికార్డులను తనిఖీ చేయడం ద్వారా తగిన నిర్ణయం తీసుకొని ముందుకెళుతోంది. మరికొన్ని నిర్మాణాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడానికి హైడ్రాకు, మున్సిపల్, లీగల్, రెవె న్యూ శాఖల మద్దతు అవసరమవుతోంది.
ఈ నేపథ్యంలో ఒకపక్క లీగల్ సమస్యలున్న భూములపై చట్టపరంగా చర్యలు కొనసాగిస్తూనే, తక్కువ లీగల్ సమస్యలున్న ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఈ ప్రాంతాల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేసి, కూల్చివేతలకు ముందుకెళ్ళనుంది. ప్రస్తుతం ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే 60కి పైగా పెండిరగ్‌లో వున్న ముఖ్యమైన ఫిర్యాదులను పరిష్కరించడం, స్థానిక మరియు జీహెచ్‌ఎంసీ అధికార్ల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం, ఇక ముందు ఆక్రమణలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయడం అనే మూడు అంశాలకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోంది.ప్రస్తుతం హైడ్రా తీసుకుంటున్న చర్యలకు మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా పార్కులు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రజలనుంచి పూర్తి మద్దతు లభిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో చేపట్టే కూల్చివేతల వల్ల నిరాశ్రయులమవుతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం హైడ్రా చేపడుతున్న చర్యల వల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడటం,పబ్లిక్ పార్కులు, రోడ్లు పునరుద్ధరణకు నోచుకోవడం కీలక పరిణామం. అయితే నోటీసు కాలపరిమితి తక్కువగా వుంటున్నదన్న ఫిర్యాదులున్నాయి. కొన్ని సంక్లిష్ట జోన్లలో న్యాయపరమై వివాదాలు హైడ్రా చర్యలు జాప్యం కావడానికి కారణమవుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పె రుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హై డ్రా పటిష్టంగా పనిచేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల 33 గ్రామపంచాయతీలను హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశముంది. ఈ గ్రామాల మొత్తం జనాభా రెండు లక్షలు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో ఉన్న ఈ పంచాయతీల జాబితాను ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే తయారుచేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా పరిధిని ఓఆర్‌ఆర్ పరిధివరకు విస్తరించాలన్న ఉద్దేశంతో వున్న నేపథ్యంలో ఈ పరిధిలో వుండే పంచాయతీల జాబితాను సిద్ధంచేశారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ పరిధిలో 30 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు వున్నాయి. ఇక ఇవన్నీ హైడ్రా పరిధిలోకి రాను న్నాయి. వీటితోపాటు 33 గ్రామపంచాయతీలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురానుండటంతో ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరింత జోరందుకుంటుందని అంచనా. ప్రస్తుతం నగరంలోని వివిధ చెరువులు, నాలాలు, బఫర్ జోన్‌లు యదేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో వరదనీరు స్వేచ్ఛగా ప్రవహించేందుకు మార్గాలు మూసుకుపోయి ఆక్రమిత ప్రాంతాల్లో గృహాలు ముంపునకు గురికావడం, ఆయా ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయలు కావడం జరుగుతోంది. ఈవిధంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఈ వరద సమస్యకు ఒక పరిష్కారం లభించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకూడా సాధ్యంకాగలదు. కానీ ఇటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడమే హైడ్రా ముందున్న ప్రధాన సవాలు. అక్రమ ఆక్రమణలకు గురైన పంచాయతీల్లో కచవాని సింగారం, ప్రతాప్ సింగారం, కొర్రెమూల, గౌరెల్లి, చీర్యాల్, గుధుమకుంట, రాంపల్లి, కీసర, మంకల్, గౌడవల్లి, బమ్రాస్‌పేట్, గొల్కండ కలన్ వంటి పంచాయతీలు కొన్ని మాత్రమే. వరద ప్రవాహానికి అడ్డుగా పుట్టగొడుగుల మాదిరిగా కాలనీల నిర్మా ణం చేపట్టడంతో వర్షాకాలంలో ఈ ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.
ఎన్.ఆర్.ఎస్.సి. నివేదిక ప్రకారం గత 44 సంవత్సరాలుగా జంటనగరాల పరిధిలో ఎన్నో చెరువులు/సరస్సులు, కుంటలు అక్రమ కట్టడాల కార ణంగా అదృశ్యమైపోయాయి. వీటిల్లో కొన్ని చెరువులు 60శాతం మరికొన్ని 80శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఆవిధంగా అదృశ్య మైన 56 చెరువులపై హైడ్రా ప్రస్తుతం అధ్యయనం ప్రారంభించింది. గతంలో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 40.35 చదరపు కిలోమీటర్లు! ప్రస్తుతం ఇవి కేవలం 16.9 చదరపు కిలోమీటర్లకుకుంచిచుకుపోగా మిగిలిన 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయ్యాయి. అంటే చెరువుల అసలు విస్తీర్ణంలో 60% ఆక్రమణలకు గురైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణల విషయంలో హైడ్రా మూడు దశలుగా తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మొదటిదశలో ఆక్రమణల నివారణ, రెండో దశలో ఆక్రమంగా ఆక్రమించి నిర్మించిన భవనాలకు అనుమతుల రద్దు మరియు అటువంటివారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడం, ఇక మూడోదశలో ఆయా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం. ఆక్రమణలను తొలగించ డం ద్వారా హైదరాబాద్ పర్యావరణాన్ని పూర్వపుస్థాయికి తీసుకురావాలన్న భగీరథ యత్నాన్ని రేవంత్ తలకెత్తుకున్న నేపథ్యంలో, ఆయన ప్రభుత్వ ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఈ దిశగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎన్నో అడ్డంకులు, అనివార్యతల నేపథ్యంలో సంస్థ మొక్కవో ని దీక్షతో తన విధులను నిర్వరిస్తోందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
రాను రాను సంప్రదాయ పార్టీలకు మేమేం తీసిపోము అన్నట్లు బిజేపి కూడా నిరూపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటనలో ఇలాంటి దోరణే కనిపిస్తోందని స్వయంగా ఆ పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు అన్న నినాదం ఆది నుంచి వుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇస్తూ వచ్చింది. పార్టీ జెండాలు మోసిన వారికి ప్రాధాన్యత వుంటుంది. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న వారికి వుండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాంటి వారికి సీట్లు కేటాయింపుపై ఆర్‌ఎస్‌ఎస్ చెప్పిందంటే పార్టీ పాటించేది. ఇలా అటు పార్టీకోసం, దేశం కోసం, దర్మం కోసం, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వ్యాప్తి కోసం పనిచేసే వారికి టిక్కెట్లు దక్కుతాయన్న నమ్మకం బలంగా వుండేది. రాను రాను బిజేపి కూడా కేవలం అదికార దాహం కోసమే పనిచేసే పరిస్ధితులు సృష్టించుకుంటోంది. అందుకే ఆ పార్టీ కూడ పార్టీకోసం పనిచేసిన వారితోపాటు, గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టింది. బైటి పార్టీల నుంచి కూడా పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తోంది. ఇంతకు ముందు ఏ వాదంతో అంటకాగినా సరే, బిజేపిలో చేరేందుకు సుముఖంగా వుంటే చాలు పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా పార్టీ వ్యాప్తి కోసం బిజేపి పెద్దలు అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర స్ధాయిలో నాయకులు కూడా వాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వారి పంతం నెగ్గించుకుంటున్నారు. వాళ్లు ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో ముందే నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్లకే టిక్కెట్లు ఇప్పిస్తున్నారంటూ బిజేపిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ టిక్కెట్లే సాక్ష్యం అంటున్నారు. ముఖ్యంగా నాలుగు ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోలేదని సీనియన్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం కరీంనగర్, మెదక్, నిజాబాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి గత ముప్పై, నలభై ఏళ్ల నుంచి కష్టపడుతున్న వారు వున్నారు. పార్టీ కోసం తెగించి పోరాటాలు చేసిన వారున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా ఒక దశలో పార్టీ కోసం ప్రాణం పెట్టిన నాయకులున్నారు. వాళ్లేమీ ఆషామాషీ నాయకులు కాదు. ఎంతో మందికి స్పూర్తి నింపిన నాయకులు. ఎంతో మంది యువత బిజేపి భావజాలానికి ఆకర్షితులు కావడానికి కారకులు. అంతగా పార్టీపై ముద్ర వేసిన నాయకులున్నారు. ఈ రోజు పార్టీ ఇంత బలంగా వుందంటే అలాంటి నాయకులే కారణం. బిజేపి పార్టీకి ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా సరే పడిన ప్రతీసారి నిలబెడుతూ, ప్రజల్లో బిజేపి వ్యాప్తికోసం నిరంతరం పని చేసిన వాళ్లున్నారు. వాళ్లను కాదని పారిశ్రామిక వేత్త అయిన అంజిరెడ్డికి టికెట్ కేటాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. అసలు ఆయన ఎవరో కనీసం మెదక్ జిల్లా ప్రజలకే పూర్తిగా అవగాహన లేదని అంటున్నారు. ఆయన పారిశ్రామిక వేత్తగా కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే సుపరిచితమంటున్నారు. మితగా మూడు జిల్లాల పట్టభద్రులైన బిజేపి శ్రేణులకు ఆయన తెలియదని అంటున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన పార్టీ శ్రేణులను కూడా కలుపుకుంటాడన్న నమ్మకం లేదని చెబుతున్నారు. బడాబాబులకే బిజేపిలో టిక్కెట్లు అని పార్టీ నిరూపించిందని నాయకులు అసంతృప్తికి లోనౌతున్నారు. పలుకుబడి వున్న వాళ్లుకే టిక్కెట్లు ఇస్తామని పార్టీ సంకేతాలు తెలిపినట్లౌందని, సామాన్య కార్యకర్తలకు కష్టకాలమే అంటున్నారు. పిల్లికి బిచ్చం పెట్టన వ్యక్తి అంజిరెడ్డి అంటూ పార్టీ నాయకులే దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం ప్రతి జిల్లాలో పది మంది నాయకులు, కార్యకర్తల పేరు తెలియని అంజిరెడ్డికి టికెట్ ఎలా ఇ స్తారని ప్రశ్నిస్తున్నారు. దాంతో పెద్దఎత్తున బిజేపి శ్రేణులు అసంతృప్తికి లోనౌతున్నారు. ఈ ఒక్కటే కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల టిక్కెట్ల పంపిణీ వ్యవహారం మొత్తాన్ని తప్పు పడుతున్నారు. మండిపడుతున్నారు. అంజిరెడ్డికి గ్రాడ్యుయేట్ స్ధానానికి టిక్కెట్ కేటాయించి దాని అర్ధమే మార్చేశారని వాపోతున్నారు. కార్పోరేట్ శక్తులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్దానం కేటాయిస్తే, ప్రజలు బిజేపి మీద ప్రేమతో గెలిపిస్తే ఆ వ్యక్తి ప్రజల్లో వుంటాడా? జనం గోడు వింటాడా? ఆయన వృత్తి పారిశ్రామిక వేత్త. ఆయన ప్రవృత్తి రాజకీయంగా ఎంచుకొని, ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు చేరవ కావడం కష్టం. ఆయన ఎంత సేపు తన వ్యాపార లావాదేవీలు, వ్యాపార సాంమ్రాజ్య విసృత్తి, పారిశ్రామికంగా మరో ఎత్తు ఎలా ఎదగాలి అన్నదానిపై వున్న ద్యాస ప్రజల మీద వుండదు. ఆ పదవి అడ్డం పెట్టుకొని బ్యాంకులను నమ్మించి, మరిన్ని అప్పులు తెచ్చుకొని మరిన్ని పరిశ్రమల ఏర్పాటు కోసం ఆలోచన చేస్తారు. అంతే కాని పేదల పక్షాన నిలిచేంత సమయం అంజిరెడ్డికి వుండదని సాక్ష్యాత్తు బిజేపి నాయకులే గుసగుసలాడుతున్నారు. అసలు పారిశ్రామిక వేత్తలు నిరుద్యోగుల, ఉద్యోగుల కోరికలు మన్నిస్తారా? వారి కోసం నిలబడతారా? వారికి అండగా వుంటారా?వారి కోసం రోడ్డెక్కుతారా? ప్రభుత్వాలతో పోరాటం చేస్తారా? పారిశ్రామిక వేత్తలకు నిత్యం పాలకులతోనే పని. వారి ఆశీస్సులతోనే వారి వ్యాపారాలు సాగేది. ఏ పార్టీ అధికారంలో వుండే ఆ పార్టీకి గొడుగు పట్టడం మాత్రమే పారిశ్రామిక వేత్తలకు తెలుసు. కాకపోతే జాతీయ స్ధాయిలో బిజేపి అప్రతిహాతంగా గెలుస్తూ వస్తోంది. వ్యాపారపరమైన అన్ని సౌకర్యాలు అనుమతుల కోసం బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం పార్టీలో పనిచేసేవాళ్లు కొంత మంది వున్నారు. అందులో అంజిరెడ్డి ఒకరు అని అంటున్నారు. అసలు పారిశ్రామిక వేత్తలుగా వెలుగొందుతున్న వారు తమ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకే సరైన వేతానాలు అందించరు. వేజ్‌బోర్డ్ అమలు సరిగ్గా అమలు చేయరు. అనేక వివాదాలు ఎదుర్కొంటారు. అలాంటి వారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తారా? వారి హక్కులను కాపాడుతారా? అంజిరెడ్డికి వున్న కంపనీలలో ఉద్యోగులందరికీ కార్మిక చట్టాలను అమలు చేస్తున్నారా? వారికి న్యాయంగా అందాల్సిన వేతనాలు అందిస్తున్నారా? అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. తమ ఉద్యోగుల సమస్యలే వినేందుకు సమయం లేని, తీరిక లేని, ఒక రకంగా ఇష్టం వుండని అంజిరెడ్డి సగటు నిరుద్యోగి సమస్యలు వింటాడా? పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడా? కనీసం సమయం కేటాయిస్తాడా? నిరుద్యోగులకు అప్పాయింట్ మెంటు కల్పిస్తాడా? పార్టీ కోసం నాలుగు జిల్లాల్లో క్షేత్ర స్దాయిలో పనిచేస్తాడా? కనీసం తన గుమ్మం దాకా నిరుద్యోగులను రానిస్తాడా? అని కూడా అంటున్నారు. కార్పోరేట్ శక్తులు ప్రజా ప్రతినిధులైతే పదవులు వారికి అలంకారమౌతాయే గాని, ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. వారికి సమస్యలకు పరిష్కారమే దొరకదు. పదవులు అడ్డం పెట్టుకొని మరింత ఆర్ధికంగా బలవంతులయ్యేందుకు పదవులు ఉపయోగపడతాయే గాని, ఆ పదవి పొందిన నాయకుడితో ప్రజలకు జరిగే న్యాయం ఏమీ వుండదు. సహజంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధులు విద్యార్ధి దశ నుంచి అటు విద్యారంగ సమస్యలు, ఇటు నిరుద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన వున్న విద్యార్ధి నాయకులుగా పనిచేసిన అనుభవం వున్న నాయకులై వుండాలి. అలాంటి వారిని మాత్రమే పార్టీలు ఎంపిక చేయాలి. అప్పుడే వారు జనంలోకి వెళ్లగలరు. విసృతంగా ప్రచారం చేయగలరు. గెలిచిన తర్వాత నిరుద్యోగుల తరుపున నిరంతరం పోరాటం చేస్తారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేస్తారు. విద్యార్ధి, యువజన, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులు ఏర్పాటు చేస్తారు. వారిని చైతన్యం చేస్తారు. ప్రభుత్వాలతో కొట్లాడతారు. వారికి అవసరమైన ఉపాది మార్గాలను కూడా ఆ ఎమ్మెల్సీలు అన్వేశిస్తారు. మండలిలో అవకాశం వచ్చిన ప్రతీసారి యువత, నిరుద్యోగుల పక్షాన చర్చలు లేవనెత్తుతారు. ప్రభుత్వాలను నిలదీస్తారు. ప్రభుత్వాలు మొండి వైఖరి అనుసరిస్తే ప్రజా క్షేత్రంలో నిరుద్యోగుల పక్షాన గొంతెత్తుతారు. పాలకులకు ఊపిరి సలపకుండా ఉక్కిరి బిక్కిరిచేస్తారు. అదేపారిశ్రామిక వేత్తలకు పట్టభద్రుల ఎన్నికల సమయంల నిరుద్యోగులను వంచించే నాలుగు మాటలు చెప్పి , గెలిస్తే నిరుద్యోగులకు ముఖం చాటేస్తారు? ఓడితే పార్టీని కూడా పట్టించుకోరు. అందువల్ల ఇప్పటికైనా మార్చుకునే అవకాశం వుంది. బిజేపికి మంచి అవకాశం వుంది. యువత బిజేపి వైపు నిలిచేందుకు ఇష్టపడుతున్నారు. అంజిరెడ్డిని మార్చితే గెలిపించేందుకు సిద్దంగా వున్నామంటున్నారు. పార్టీ అంజిరెడ్డి విషయంలో పునపరిశీలన చేయాలని కోరుతున్నారు.
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి సోమవారం సందర్భంగా భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్, మమత దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి నందీశ్వరుని పూజతో అర్చకులు జూలపల్లి నాగరాజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రుద్రాభిషేకం లో సిఐ నరేష్ కుమార్ గౌడ్, ఎస్ ఐ రేఖ అశోక్ మమత దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు నాగరాజు కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సంక్రాంతి భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి క్యూలైన్ లో స్వామివారిని దర్శించుకున్నారుపూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు.
వనపర్తి కొత్తకోట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని సోమవారం కోట్ల రామలింగేశ్వరునికి మహా రుద్రాభిషేకం 10వేల బిల్వ పుష్పార్చన కార్యక్రమం మహా మండల శివ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంక్రాంతి భోగి పండగ భాగంగా సోమవారం ఆరుద్ర నక్షత్రంలో శివ స్వాముల శివనామ స్మరణతో కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో మహా రుద్రాభిషేకం బిల్వ పుష్పార్చన కార్యక్రమంలో భక్తి పరవశంతో పునీతులయ్యారు. అభిషేక బిల్వార్చన అనంతరం స్వామివారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహా మండల శివస్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో భూక్య హరిలాల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ వ్యవహరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం మండలం బిజెపి అధ్యక్షుడు ఊర నవీన్ రావు ముఖ్య అతిథి విచ్చేసిన వారి వెంట ఎర్రబెల్లి భాస్కరరావు పొనగంటి శ్రీధర్ రావు వడ్డం రాజశేఖర్ డాకూరి కృష్ణారెడ్డి మామిడిపల్లి రాజయ్య ఇనుగాల మొగిలి చందు బుర్రి నరేష్ గొర్రె రవి మహిళ విభాగం నుండి బొల్లం అరుణ సీనియర్ నాయకులు చింతరెడ్డి పాపిరెడ్డి ఈ కార్యక్రమం కార్యక్రమంలో నగరంపల్లి మహిళ విభాగం ముగ్గుల పోటీలో 30 మంది పాల్గొనడం జరిగింది ఇందులో మొదటి బహుమతి మదటి రమ్య బల్లు మన్మిత రెండవ బహుమతి భూక్యా సిరి భానోత్ రచన లకు బహుమతులు ఇవ్వడం జరిగింది
వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి శ్రీమతి సింగిరెడ్డి వాసంతి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీదర్ పాల్గొన్నారని ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ విలేకరులకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గోదాదేవి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు .ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఉపాధ్యక్షులు పాపిశెట్టి శ్రీనివాసులు కొంపల బాలచద్రుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ నేతలు డానియల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న దానంఏర్పాటు చేశామని బండారు కృష్ణ తెలిపారు
మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ జన్ను ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ములుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్ మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మృతిని కుటుంబ సభ్యులను ఆత్మీయ బహుజన పలకరింపు చేసి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదని ప్రతి కుటుంబంలో ఈ విషాద సంఘటనలు ఉంటాయని అలాంటి సందర్భంలో కుటుంబ సభ్యులను ఓదార్చే క్రమంలో కడుపు చల్ల పేరుతో మద్యాన్ని, మాంసాన్ని ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం తో పాటు అనారోగ్య నష్టం కూడా వాటిల్లుతుందని వాటికి బదులు పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ లాంటి శాస్త్రీయ ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రతి ఒక్కరు అమలు చేసే దిశగా కడుపు చల్ల కార్యక్రమం నిర్వహించాలని అన్నారు కార్యక్రమంలో గాదె ఇసాక్ స్పేరో లెక్చరర్, సోషల్ థింకర్స్ ఫోరం బాధ్యుడు రఘుపతి, కోర్ర రమేష్, వినయ్ స్వేరో, మాజీ ఎంపిటిసి జన్ను జయరాజు, పరికి రత్నం, కొండి అశోక్, రఘువరన్, తదితరులు ఉన్నారు.
కథలాపూర్ మండల కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ భూనీల గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకటాచార్యులు అమ్మవారి వైభవాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించారు గోదాదేవి ఎవరో కాదు వైకుంఠం నుంచి దిగివచ్చిన ఆ లక్ష్మీదేవి అని ఈ సందర్భంగా తెలిపారు ధనుర్మాస ఉత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఈ ధనుర్మాస వ్రతం మానవాళికి ఎంతో శ్రేయస్కారమని తెలిపారు కార్యక్రమం భక్తుల గోవింద నామస్మరణతో మారు మోగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసి ఎల్) 2X600 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) 2025 సంవత్సరానికి గాను“సేఫ్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను అందుకుంది.అలాగే ఎస్ సిసిఎల్ కొత్తగూడెం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కి“బెస్ట్ సేఫ్టీ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ-రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను గెలుచుకుంది.ఈ పురస్కారాలను 2025 జనవరి 11న న్యూఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య ఆతిథి వివేక్ శ్రీ వాస్తవ, ఐపీఎస్,ఫైర్ సర్వీస్,సివిల్ డిఫెన్స్&హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్ (గృహ మంత్రిత్వ శాఖ)చేతుల మీదుగా దరవత్ పంతులా,డిప్యూటీ జనరల్ మేనేజర్(ఈ&ఎం)ఎస్టిపిపి మరియు అవినాష్ దుబే డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈ&ఎం)ఆఫీస్ ఆఫ్ న్యూఢిల్లీ,పులి సురేష్,ఎస్ఈ(సేఫ్టీ),ఎస్టిపిపి ఈ పురస్కారాలను స్వీకరించారు.ఈ విజయాలను ఎస్ సిసి ఎల్ సీఎండీ బలరాం మరియు డైరెక్టర్ (ఈ&ఎం),డైరెక్టర్(ఆపరేషన్స్) సత్యనారాయణరావు ప్రశంసించారు.జి ఎస్ జానకిరామ్ జీఎం సోలార్ ఎనర్జీ మరియు ఎన్ వి రాజశేఖర్ ఈడి మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ సౌర విద్యుత్ బృందం చేసిన వినూత్న ఆలోచనలు,సురక్షిత పనితీరును కొనియాడారు.అలాగే ఈ అవార్డులు ఎస్సిసిఎల్ పవర్ విభాగంలో జీరో యాక్సిడెంట్స్ కి మరియు సురక్షిత ప్రణాళికలు,ఆధునిక సాంకేతికత వినియోగం,పరిసరాల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా దక్కాయని,సింగరేణి సంస్థ సురక్షిత,నూతన ఆవిష్కరణలతో శక్తి ఉత్పత్తి రంగంలో ముందంజలో కొనసాగుతుందని ఈ పురస్కారాలు చాటిచెప్పాయనీ తెలిపారు.
తెలంగాణలో “పీ.వి. మదన్ మోహన్” సూచించిన క్యాప్షన్ ఎంపిక.
కస్టమర్లకు “లక్కీ డ్రా” ద్వారా “వెండి కాయిన్స్” బహుమతి
“నేటిధాత్రి”,హుజూరాబాద్ ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ ఇండేన్ కస్టమర్లను ప్రోత్సహించడం కోసం తలపెట్టిన 25 గ్రాముల సిల్వర్ కాయిన్ డ్రా కార్యక్రమాన్ని ఐఓసియల్ కేంద్ర కార్యలయంలో ఐఓసియల్ టాప్సో (తెలంగాణా ఆంధ్ర)జియం యోగా రాణి సురేశ్ డీలర్ల సమక్షంలో ఈ ఉదయం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ ఆధీక్రుత ఇండేన్ డీలర్ల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లను ప్రోత్సహించేందుకు 25గ్రాముల వెండి నాణెం అందించే సంకల్పంతో దీపావళి,క్రిస్మస్,సంక్రాంతి సందర్భంగా బంపర్ డ్రా నిర్వహించి ఎంపికైన వారికి వెండి నాణెం అందించే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్ఛినట్లు తెలిపారు.సోమవారంనాడు సనత్ నగర్ ఇండియన్ ఆయిల్ భవన్ లో సంక్రాంతి సంధర్భంగా చివరి డ్రా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆయిల్ కంపనీలు తాము ఆమోదించిన వెండర్ల ద్వార గ్యాస్ డీలర్లకు ఉపకరణాలు అందిస్తున్నామని వివరించారు..నాణ్యత కాలపరిమితి ఎక్కువగా వుండే అవకాశాలు వుంటయాని కాబట్టి కంపనీ ఆమోదించిన స్టౌ,రబ్బరు ట్యూబ్, ఇతర ఉపకరణాలు వాడాలని కోరారు తెలంగాణ వ్యాప్తంగా రెండువందల ఇండేన్ డీలర్ల జూమ్ పద్దతిన డ్రా నిర్వహించి ఎంపికైన వారికి 25గ్రాముల వెండి నాణెలను సంక్రాంతి కానుకగా అందించినట్లు ఆమె తెలిపారు.
ఐఓసియల్ సికింద్రాబాద్ డివిజనల్ హెడ్ సీతేష్ కిషన్ మాట్లాడుతూ “ఇండేన్ ఇస్తుంది సురక్షితమైన వంట” ఈ సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట” అనే నినాదంపై నిర్వహించిన సంక్రాంతి బంపర్ డ్రాకు మంచి స్పందన వచ్చిందని చాలామంది ఐఓసియల్ గుర్తించిన వంటగ్యాస్ ఉపకరణాలు కొనేందుకు ఆసక్తిని చూపారని తెలిపారు. ఎల్లప్పుడూ హెటిఈ హై థర్మల్ ఎఫీషియన్సీ స్టౌ,సురక్ష రబ్బరు ట్యూబులు వాడాలని కోరారు. ఐఓసియల్ సికింద్రాబాద్ డివిజన్ సికింద్రాబాద్ ముఖ్య అధికారి సుబ్బారావు మాట్లాడుతూ బేసిక్ సేప్టీ చెక్స్ (ప్రాథమిక భద్రతా ) కార్యక్రమాలను గ్యాస్ డీలర్లు తమ డెలివరీ బాయ్స్ ద్వారా నిర్వహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి క్రుషిచేయడం పట్ల అభినందనలు తెలిపారు.ఇంకా చాలామంది మన్డేటరీ డ్యూ కాలపరిమితి దాటిన సురక్ష రబ్బరు ట్యూబ్ వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా వుందని వాటిని మార్చాలని కోరారు. *హుజూరాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీలో జరిగిన డ్రా కార్యక్రమంలో కరీంనగర్ సేల్స్ ఏరియా మేనేజర మిట్ట మహేష్ పాల్గొన్నారు… జూమ్ ద్వారా నిర్వహించిన ఈ డ్రా ద్వారా ఈ ఏరియాలో ఇరవై ఐదు మంది కస్టమర్లను ఎంపిక చేశామని మహేశ్ తెలిపారు.
అదేవిధంగా ఏజన్సీ అధినేత పి.వి.మదన్ మోహన్ సూచించిన “ఇండేన్ ఇస్తుంది సురక్షితమైన వంట” “సంక్రాంతి ఇస్తుంది బహుమతుల పంట” క్యాప్షన్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపికవాడం పట్ల అభినందనలు తెలిపారు. వంటింటి ప్రమాదాలు జరుగకుండా ప్రతి కస్టమర్ గ్యాస్ బాల్ కలిగి వుండాలని దాని ధర అత్యల్పంగా వుంటుందని ఆయన సూచించారు.. ప్రభుత్వం ద్వారా వెసులుబాట్లు పొందేందుకు వీలుగా ఈకేవైసి విధిగా చేసుకోవడానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు కీర్తి, దిలీప్ నాయక్, శాంతి స్వరూప్, నబిలా రహమ్మాన్ ,అంకూర్ ,సీనియర్ డీలర్లు పి.వి.మదన్ మోహన్,సుభాష్ రావు,ఉప్పల్ రమేశ్,అయిలారెడ్డి,వామన్ రావు, దేవేందర్ రెడ్డి,రాజ్ మోహన్ ,రాం రెడ్డి,రాధక్రిష్ష,వెంగళరావు,కోహెడ రవీందర్,సత్యనారాయణ, వీరన్న, శ్రీచరణ్ ,వెంకటేశ్వర రావు, ప్రవీణ్,భాస్కర్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం చెరుకులోని తియ్యదనం పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయో భిలాషులకు పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన మద్నూర్ మండల సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలిపారు. వారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.భోగి భోగ భాగ్యాలతో సంక్రాంతి సిరి సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని ప్రజలందరూ శుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తునట్లు మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ తెలియజేశారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయితీ లో పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణలో నిర్లక్ష్యం తాండవిస్తోంది.డంపింగ్ యార్డ్ ని నిరుపయోగంగా మార్చి చెత్తను తీసుకువెళ్లి వాగులో చెరువులో పార వేయడం జరుగుతుంది.ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి ఆ చెత్తను వర్గీకరించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా డంపింగ్ యార్డ్ లో నిల్వచేసి సేంద్రియ ఎరువుగా మార్చి పల్లె ప్రగతి ఉద్యానవనానికి ఉపయోగించాల్సిందిపోయి వారంలో నచ్చిన రోజున చెత్తను సేకరిస్తూ తీసుకువెళ్లి నచ్చిన చోట పారవేస్తున్న వ్యవస్థ ముదిగుంట గ్రామపంచాయతీలో చోటు చేసుకుంది.గ్రామంలోని ప్రజలు మాట్లాడుతూ చెత్త సేకరణలో నిర్లక్ష్యం వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయని,మంచినీటి వనరులు కలుషితం అవుతున్నాయని,గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని,చెత్త సేకరణలో నిర్లక్ష్యానికి నివారించడానికి గ్రామపంచాయతీ వ్యవస్థ నిర్దిష్ట సమయంలో చెత్త సేకరణ నిర్వహించాలనీ,గ్రామ పర్యావరణం పై ప్రతికూల ప్రభావం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,వృద్ధుల,పిల్లల ఆరోగ్యం పై అనేక రకాల వ్యాధుల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపయోగంగా వదిలేయడానికి డంపింగ్ యార్డ్ ను కట్టించారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రతిరోజు చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డు లో ప్రణాళిక బద్ధంగా ప్రోసెసింగ్ చేయాలని,అధికారులు నిర్లక్ష్య ధోరణినీ వదిలేసి గ్రామాలను కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
వైరా నియోజకవర్గం శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్.సింగరేణి వైరా జూలూరుపాడు కోనిజేర్ల ఏన్కూర్ మండలాల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతీ ఇంటిలో పండుగ సంబరాలు నింపే సంక్రాంతి పర్వదినం సందర్భంగా వైరా నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతు. ప్రతి ఇంటా పచ్చని తోరణాలు రంగవల్లులు అలంకరించుకుని ప్రజలంతా సంతోషాలు పంచుకోవా లని ఆకాంక్షించారు. పాడిపంటలతో రైతులు ఉల్లాసంగా ఉండాలని కార్మికులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను సుఖసంతోషాలతో జరుపుకుని భోగభాగ్యాలు సంపాదించాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ పూజలతో కుటుంబ సమేతంగా పండుగ వేడుకలు జరుపుకుని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.
మల్లాపూర్ జిహెచ్ఎంసి గ్రౌండ్లో భోగి పండుగను పురస్కరించుకునీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాసులతో కలిసి గాలిపటాలు ఎగరవేశారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, పతంగులను ఎగిరే వేసేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
– రికార్డుల్లో చనిపోయినట్టుగా తప్పుడు దృవీకరణ – ఎన్ని కార్యాలయాలు చుట్టు తిరిగిన ఫలితం లేదు
సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం 17వ వార్డుకు చెందిన భీమనాతిని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడుకు 2014లో చేనేత ఫించన్ మంజూరైంది. 2024 జులై వరకు ప్రతినెల రూ. 2016/- తన ఖాతాలో జమ అయ్యేవి. తరువాత ఏమయిందో ఏమో తెలియదు కానీ కొంత కాలంగా ఫించన్ రావడం ఆగిపోయింది. లక్ష్మీనారాయణ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా ఆయన రికార్డుల్లో తాను చనిపోయినట్లు రికార్డు అయ్యిందని, అందుకే ఫించన్ రావడం లేదని సంబంధిత అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తు చేస్తే పింఛన్ వచ్చేటట్లు చేస్తామని వారు సూచించారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణకు ఇంతవరకు ఫించన్ మాత్రం రావడం లేదు. తనకు కిరాయి కట్టడం చాలా కష్టంగా ఉందని అన్నారు. అంతేకాకుండా గత ఆరు నెలలుగా మున్సిపల్, డీఆర్డీఓ, కలెక్టర్ ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు ఫించన్ వచ్చేలా చూసి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని లక్ష్మీనారాయణ వేడుకుంటున్నాడు.
బెల్లంపల్లి నియోజకవర్గం భీమినీ మాజీ ఎంపీపీ శ్రీమతి,పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు అమ్మాయిలు చాలా ఉత్సాహంగా పాల్గొని, ముగ్గులు వేయడం జరిగినది. ముఖ్య అతిథిగా భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా భీమిని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ లో మహేశ్వరి, దీపిక బొలిశెట్టి సౌందర్య మౌనిక పాల్గొని విజేతలను సెలెక్ట్ చేశారు.మొదటి బహుమతి సెల్వట్ కార్ ప్రమీల, రెండవ బహుమతి పెరుగు నిరోష, మూడవ బహుమతి వేల్పుల మౌనిక, కే.నేహ లకు పోటీలలో పాల్గొన్న వారందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులను భీమిని మాజీ ఎంపీపీ శ్రీమతి, పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్, ఎస్ఐ విజయ్ కుమార్, పోతురాజుల రాజయ్య, శ్రీరామ సేవా సమితి అధ్యక్షులు పోతురాజుల లక్ష్మణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దోరిశెట్టి బానేష్, కోండ్ర సాయి, గంగారాం, మహబూబ్, పెంటు, మల్లయ్య, రడం శ్రీనివాస్, పెరుగు సంతోష్, నవీన్, బెస్త సంతోష్, కైర్, నందకిషోర్, శ్రీనివాస్, షరీఫ్, సోమయ్య, రాజయ్య, శంకర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మండలంలోని వర్ష కొండ గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోద రంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో అత్యధిక భక్తులు హాజరై శ్రీ రంగనాథ గోదాదేవి అమ్మవార్ల దివ్య ఆశీస్సులు అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అర్చకులు దయత్రి లక్ష్మి నరసింహ స్వామి చార్యులు, మరియు మధుర అన్వేచార్యులు, మరియు రామాచార్యులు, లక్ష్మణ చార్యులు, మరియు మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుకారాం. మరియు ఇబ్రహీంపట్నం ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు పోనుకంటి వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపల్లి లక్ష్మణ్, మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
కార్మికుల పరిష్కార వేదిక సిఐటియు అని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ముదాం శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం కారేపల్లి బాగం రామ నర్సయ్య భవన్ లో కేలోత్ రవి అధ్యక్షతన జరిగిన బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పెయింటింగ్ వర్కర్స్ సిఐటియులో చేరారు వారికి సంఘం సభ్యత్వాలు ఇచ్చి సిఐటియు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ 20 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కార్మికులకు బీమా సౌకర్యంను సాధించుకోగలిగామన్నారు. సిఐటియు మార్గదర్శకంలో కార్మికులు తమ హక్కుల కోసం చేసే పోరాటాలతో పాటు పని ప్రదేశంలో జరిగే సమస్యల పరిష్కారంకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. భవన నిర్మాణ రంగంలో 56 విభాగాలకు చెందిన కార్మికులు ఉన్నారని వారందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను లబ్ధి చేకూరాలని సిఐటియు ఆకాంక్ష అని అన్నారు. కేంద్రంలోని బిజెపి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని కార్మికుల హక్కుల కాలరాయటానికి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. సిఐటియులో చేరిన ప్రతి కార్మికుని కి అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దోనోజు లక్ష్మణాచారి మేడికొండ నాగేశ్వరరావు మండల అధ్యక్ష కార్యదర్శులు కే లోతు రవి శనగ రాంబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ కే నరేంద్ర నాయకులు ముక్కా సీతారాములు ఎస్ శివ తదితరులు పాల్గొన్నారు. పెయింటర్ మండల కమిటీ ఎన్నికల్లో పెయింటర్స్ యూనియన్ (సీఐటీయు) మండల అధ్యక్షులుగా ఎస్ శివ కార్యదర్శిగా ఎస్కే పాషా ఉపాధ్యక్షులుగా బీ సుమన్ సహాయ కార్యదర్శిగా సుదర్శన్ కోశాధికారిగా ఈ ప్రవీణ్ కుమార్ కమిటీ సభ్యులుగా పీ అనంత రాములు వై వీరేందర్ డేగల రాంబాబు వడ్లకొండ సాంబశివరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్లు బిల్డింగ్ వర్కర్లు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.