ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద,డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.పోలీసుల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించిన క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ ని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని,ఇట్టి క్యూఆర్‌ కోడ్ ని స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్‌ఐఆర్, ఇ-చలాన్ మరియు పాస్‌పోర్ట్ ధృవీకరణ మరియు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసు అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన మరియు ప్రవర్తనపై ప్రజలు,బాదితులు సద్వినియోగం చేసుకోని పోలీస్ సేవలపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు.

భూపాలపల్లి నేటిధాత్రి

యాదగిరిగుట్ట
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేదాశీర్వచన మండపంలో ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

నేడు మంద కృష్ణ మాదిగ జిల్లా పర్యటన

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భూపాలపల్లి జిల్లా వస్తున్నారని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా ఇంచార్జి అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించ వేల గొంతులు లక్ష డప్పుల సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేడు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ జిల్లా పర్య టన స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పర్య టన ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1 గంటల సమయానికి మంద కృష్ణ మాదిగ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారని, పత్రికా, మీడియా మిత్రులు గమనించగలరని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎమ్మెస్ ఎఫ్, ఎంజెఎఫ్ అన్ని అనుబంధ సంఘాల జిల్లా నాయకులు మండలాల స్థాయి నాయ కులు గ్రామాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి కోరారు.

మహబూబ్ నగర్ లో నీటి ఎద్దడి నివారణకు.. ముందస్తు చర్యలు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.

రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పట్టణంలో నీటి సరఫరా చేయడానికి నూతనంగా 5 ట్రాక్టర్ వాటర్ ట్యాంకులను శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పట్టణంలో ఎక్కడ కూడా నీటి కష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు తాళం చెవిలను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కౌన్సిలర్లు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

8వ రోజు కొనసాగుతున్న లారీ ఓనర్స్ సమ్మె

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో భూపాలపల్లి,గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు సమ్మె కొనసాగుతుంది.డీజిల్,మెంటనేన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లారీల నిర్వహణ భారం పెరగడం, కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో పలువు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.పెరిగిన ఖర్చులు దృష్టిలో పెట్టుకొని కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు టన్ను బొగ్గు కు రు.300,బ్రిక్స్ కు రు.400 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంచేవరకు సమ్మె విరమించేది లేదని,ఆందోళన ఉదృతం చేసి సింగరేణి జిఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.సమ్మె కారణంగా ఒక వేయి లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు రవాణా ఆగిపోయింది


ఈ కార్యక్రమంలో
భూపాలపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య.
ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా.గణపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గారావు.గౌరవాధ్యక్షులు శ్రీరాములు.
టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి. , కావటం సురేందర్, ఎనగంటి రమేష్, తిరుపతిరావు, రొడ్డ రవి, బాల్ చందు నాయక్.

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు ఇంటింటా సర్వే

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం .4.ఫ్లాగ్.షిప్ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లపై దరఖాస్తులను ఇంటింటా సర్వే ఫీల్డ్ లో భాగంగా బి శేషాద్రి మండల్ నోడల్ఆఫీసర్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పాపాయిపల్లి గ్రామంలో వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించడం జరిగిందనిఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మండలంలో పలు గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో దరఖాస్తులను పరిశీలించి విరాలను నమోదు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు

చీర్లవంచ గ్రామంలో సిసి రోడ్డుకు భూమి పూజ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీర్లవంచ గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ విధుల నుండి మంజూరైన పది లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మించుతూ గ్రామ అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఇకముందు కూడా గ్రామాలలో అభివృద్ధి చేయడానికి మరిన్ని నిధులు రావడానికి కృషి చేస్తామని తెలియజేశారు నిధులు మంజూరు చేయడానికి కృషిచేసిన వేములవాడ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు గంగుకొండయ్య గ్రామ శాఖ అధ్యక్షులు గంగు మహేష్ నాయకులు నలువాల జలంధర్ రెడ్డి గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఏఐవైఎఫ్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

భూపాలపల్లి నేటిధాత్రి

అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కేంద్రంలో రావి నారాయణ రెడ్డి భవన్ లో ఆవిష్కరించడం జరిగింది…
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ యువజనుల హక్కులకై ఏఐవైఎఫ్ ఉద్యమిస్తుందని అన్నారు…. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు …గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని అన్నారు.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కానీ ఉద్యోగాల భర్తీ లో జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు…. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగాలన్నీ భర్తీ చేసి యువతి యువకులను ఆదుకోవాలని అన్నారు…
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాజీ ఏఐవైఎఫ్ నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసఫ్, కూనూరి భగత్, పంగ మహేందర్, జోగేష్,సింహాద్రి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో

హన్మకొండ,వరంగల్(మెడికల్), నేటిధాత్రి:

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య గారు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ ని తన బృందంతో కలిసి తనిఖీ చేయడం జరిగింది .ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా సంస్థను నడిపిస్తున్నాడని ,అదేవిధంగా ఆల్కహాల్ బాధితులకు తగినట్టుగా వసతులు కల్పించలేదని ,మరియు రిజిస్ట్రేషన్ లో చూపించిన విధంగా రెసిడెంట్ డాక్టర్ అందుబాటులో లేకపోవడం లాంటి ఉల్లంఘనలను గమనించి శోకాజ్ నోటీస్ ఇచ్చి మూడు రోజులలో అన్ని సంబంధిత ధ్రువపత్రాలతో సమాధానం అందించాలని, నిబంధనలను సరిగా పాటించాలని ఆదేశించడం జరిగింది. సైక్రియా ట్రిస్టుతో సేవలు అందించాలని సూచించడమైనది. ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అలాగే జిల్లాలోని మిగతా డి అడిక్షన్ సెంటర్స్ ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని డాక్టర్ అప్పయ్య గారు తెలియజేశారు. డిఎంహెచ్వో గారితో పాటు ,జి ప్రసన్నకుమార్ ,విప్లవ కుమార్ పాల్గొన్నారు.

వికలాంగ విద్యార్థికి దొంతి అవియుక్త్ రెడ్డి ఆర్థిక సహాయం.

నర్సంపేట,నేటిధాత్రి:

ఉన్నత చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగ విద్యార్థికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తనయుడు,కాంగ్రెస్ పార్టీ యున నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేసి మనోధైర్యాన్ని కల్పించాడు.వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణానికి చెందిన రాజేందర్ అనే వికలాంగ యువ విద్యార్థి యూనివర్సిటీ కళాశాలలో పీజీ విద్యాబ్యాసం చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నాడు. వికలాంగుడు రాజేందర్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి తన గోడును వెళ్ళబోసుకోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మనోధైర్యాన్ని కల్పించారు.తన కుమారుడు దొంతి అవియుక్త్ రెడ్డితో రూ.12 వేల ఆర్థిక సాయం అందచేశారు.

డ్రగ్స్, గంజాయి, రోడ్డు ప్రమాదాలపై కళాజాత

• గంజాయి మత్తులో యువత
• అవగాహన కల్పించిన కళాజాత

నిజాంపేట: నేటి ధాత్రి

నేటి కాలంలో యువత గంజాయి, డ్రగ్స్ మత్తులో చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని యువతరం మారాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో సారధి కళాకారులచే పాటలు పాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు రోడ్డు భద్రత, గంజాయి వ్యసనం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఎల్ల సిద్దులు, ఆస రామారావు, కారంగుల మాధవి, శివోల్ల కృష్ణ, బీట్ల ఎల్లయ్య, సందుర్గ శేఖర్, తుమ్మల ఎల్లయ్యలు పాల్గొన్నారు.

పార్టీల తలరాతను మారుస్తున్న మహిళలు

 

`పదవిలో కూర్చోబెట్టేది మహిళలే

`పురుషులకంటే పెరుగుతున్న మహిళా ఓటర్లు

`విస్తరిస్తున్న మహిళల ప్రభావ నియోజకవర్గాలు

`మహిళా సంక్షేమం అమలు చేయకపోతే పార్టీలకు కష్టాలు తప్పవు

`మహిళల ఓటింగ్‌లో వృద్ధి

`మహిళా చైతన్యానికి నిదర్శనం

`మహిళలను విస్మరిస్తే మట్టికరవక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీని గెలిపించాలన్నా లేక గద్దె దించాలన్నా మహిళా ఓటర్ల పాత్ర అ త్యంత కీలకమని ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా 2019నుంచి ఎన్నికల్లో ఓటింగ్‌ సరళిని పరిశీలించినప్పుడు వెల్లడైన నిష్టుర సత్యం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను దాటిపోవడం తాజా పరిణామం. తాజా గణాంకాల ప్రకారం 732415 మంది మహిళా ఓటర్లు ఎక్కువ వుండటంతో అధికార, విపక్ష పార్టీలు ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎ న్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఇచ్చిన ఆరు హామీల్లో అత్యధికం మహిళలకు సంబంధించినవే కావడంతో ఇప్పుడు మహిళా ఓటర్ల ప్రాధ్యాన్యం ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఏపీ మంత్రి, చంద్రబాబునాయుడు తనయుడు ఇటీవల ఉండి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మహిళలు తమకు ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. మొగ్గలోనే ఈ పరిస్థితిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మున్ముందు మరిన్ని గడ్డుపరిస్థితులు ఎదురుకావచ్చు. జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ నాయ కులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టుంది. ఈ హామీల అమలుపై ప్రభుత్వంపై ఎ ప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది ఈ నేపథ్యంలోనే అనుకోవాలా? కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో ఉచితబస్సు సదుపాయం ఇంకా అమలు కాలేదు. ఇది తక్షణ ప్రభావం చూపే హామీ. తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట అమలుచేసింది ఈ హామీనే! ఇది జనాల్లోకి బాగా వెళ్లింది! రేవంత్‌ కూడా ఆంధ్రలో మాదిరిగానే ఆరు హామీలతో ముందుకెళ్లి అధికారాన్ని చేపట్టారు. ఏదోవిధంగా వాటిని అమలు చేసే ఉద్దేశంతోనే ముందుకెళుతున్నారు. వీటిల్లో రైతుభరోసా విషయంలో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకొని విపక్షాల విమర్శలకు అడ్డుకట్ట వేసింది. మరి ఆంధ్రలో కూడా రైతుభరోసాకు హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా 19`59 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలకు నెలకు రూ.1500, తల్లికివందనం వంటి పథకాలపై చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు మౌనం గానే వుంటోంది.
నిజం చెప్పాలంటే ఏపీలో జరిగిన గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 140సీట్లలో, 25 లోక్‌సభ సీట్లలో 21 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓ టింగ్‌లో పాల్గన్నట్టు తేలింది. అంటే జగన్‌ ఓటమికి మహిళా ఓటర్లే కీలకపాత్ర పోషించారని చెప్పక తప్పదు. దేశంలో మహిళా ఓటర్లు అధికంగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటిరాష్ట్రంలో మొత్తం 4.14 కోట్లమంది ఓటర్లుంటే వీరిలో 2.1కోట్లు మహిళా ఓటర్లే.గత ఏడాది మే 13న జరిగిన ఓటింగ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోగా, పురుషులు 1.64కోట్లు మాత్రమే! ఇదిలావుండగా ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారంరాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 20385851 కాగా పురుష ఓటర్లు 19831791. అంటే ఓ టింగ్‌లో ముఖ్యపాత్ర పోషించేది మహిళలే. రాష్ట్రంలో 10.98లక్షల స్వయం సహాయక బృందా లు పనిచేస్తుండగా వీటిలో 1.15కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. అంటే మొత్తం స్త్రీ ఓటర్ల లో వీరు 60%!
మహిళా ఓటర్లు అధికంగా ఓటింగ్‌లో పాల్గన్న నియోజకవర్గాల్లో కేవలం 10 అసెంబ్లీ స్థానాలు,4లోక్‌సభ స్థానాల్లో మాత్రమే వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. నిజానికి మహిళలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నందున తనకు ఢోకాలేదని ధైర్యంగా ఉన్న జగన్‌కు మహిళలు రaళక్‌ ఇచ్చారనే చెప్పాలి. ఈవిధంగా పెద్దమొత్తంలో మహిళా ఓటర్లు కూటమి వైపున కు మొగ్గు చూపడం వల్లనే అది అధికారంలోకి రాగలిగిందనేది తిరుగులేని సత్యం. ఈ మహిళా ఓటర్ల ఓట్ల బదిలీకి ప్రధాన కారణం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఎక్కువశా తం మంది స్త్రీలు సంతృప్తిగా లేరనేది స్పష్టమైంది. ఫలితంగా అనుకున్నదానికంటే పెద్ద మొత్తంలో ఓట్ల బదిలీ జరిగి వైఎస్సార్సీపీ పడవ మునిగిపోయింది.
గత ఆరున్నర దశాబ్దాల పోలింగ్‌ని సరళిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఓటర్లలో చైత న్యం పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు 1967లో మొత్తం మహిళా ఓటర్లలో 65.6% మంది ఓటింగ్‌లో పాల్గంటే పురుషులు 72.8% ఓటుహక్కు వినియోగించుకున్నారు.1983 నాటికి స్త్రీపురుషుల ఓటింగ్‌ వ్యత్యాసం 3.7%కు పడిపోగా 2014 నాటికి ఏకంగా 0.1కి తగ్గిపోయింది. 2019లో పురుష ఓటర్లతో పోలిస్తే 11.2లక్షలు అధిక మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా, 2024 ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే 8.85లక్షలు అధికంగా ఓటింగ్‌లో పాల్గన్నారు.

దేశవ్యాప్తంగా మహిళల ప్రభావం

గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 17 స్థానాల్లో, పశ్చిమబెంగాల్‌లో 15లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గన్నట్టు తేలింది. అదేవిధంగా ఒడిషాలో 75% మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గంటే, 73% మంది పురుషులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ గెలుచుకున్న లోక్‌సభ సీట్లలో 15 సీట్లలో గెలవడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లే! అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో మహిళలకోసం ప్రకటించిన ప్ర త్యేక పథకాలు ఆయా పార్టీలను అధికారంలో కూర్చోబెట్టాయి. ఉదాహరణకు 2023 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఆ పార్టీ ప్రకటించిన ‘లడ్లీ బెహనా’ పథకం. 23`60 సంవత్సరాల మధ్య వయస్కులైన అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక స హాయం అందించే పథకం ఇది. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణం ‘గృహలక్ష్మి’ పథకం. దీనికింద మహిళలకు రూ.2వేలు చెల్లింపు, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు రూ.10వేలు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని ‘గృహలక్ష్మి’ పథకం కింద అందజేస్తామని వాగ్దానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం రూ.2.5లక్షలకంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1000 చొప్పున ‘కలైంగార్‌ మగలిర్‌ ఉరిమై’ పథకం కింద చెల్లిస్తోంది.

నిశ్శబ్ద మహిళా విప్లవం

నిజం చెప్పాలంటే 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి మహిళల ఓటింగ్‌ పురుషులను దాటిపో యింది. పురుష ఓటర్లతో పోలిస్తే 0.16% పాయింట్లు మాత్రమే ఎక్కువైనప్పటికీ దీని ప్రభావం మాత్రం అపారం. అప్పటి ఎన్నికల్లో మొత్తం మహిళా ఓటర్లలో 67.18% మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 67.02శాతం ఓటింగ్‌లో పాల్గన్నారు. అంతేకాదు క్రమంగా ఓటర్లుగా నమోదవుతున్న మహిళల సంఖ్య పెరగడం వారిలో చైతన్య విస్తృతికి సంకేతం. ఉదాహరణకు 2019లో 438 మిలియన్ల మంది మహిళలు ఓటర్లుగా నమోదు కాగా 2024 నాటికి వీరి సంఖ్య 471 మిలియన్లకు పెరిగింది. వీరిలో 8.5మిలియన్ల మంది మొట్టమొదటిసారి ఓటర్లుగా రిజిస్లరయిన వారు. అంటే ఈ పెరుగుదల 7.5%. అదే పురుషుల్లో ఈ వృద్ధి కేవలం 5%కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. 2019లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 926 మంది స్త్రీలు నమోదు కాగా 2024నాటికి వీరి నిష్పత్తి 948కి పెరిగింది. క్రమంగా ప్రజల్లో మహిళలపట్ల సరైన అవగాహన పెరగడం ఈ పెరుగుదలకు కారణం. అంతేకాదు 2019లో మహిళా ఓటర్ల ప్రభావం 8 రాష్ట్రాల్లో కనిపిస్తే, 2024కు ఇది 12 రాష్ట్రాలకు పెరగడం మహిళలో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనం. ఆవిధంగా దేశవ్యాప్తంగా మహిళా విప్లవం నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. 2014 మరియు 2019 సంవత్సరాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులు మహిళా ఓటర్లే! ఒక సర్వే ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 46% మంది మహిళలు భాజపాకు ఓటు వేస్తే, 44% పురుషులు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.

మహిళా సంక్షేమానికే పెద్దపీట

మహిళల ఓట్లు ఇంత ప్రభావశీలకంగా మారడమే జాతీయ, ప్రాంతీయ పార్టీలు మహిళా సంక్షేమానికి, పెద్దపీట వేయడానికి ప్రధాన కారణం. 2023 సెప్టెంబర్‌ నెలలో నరేంద్రమోదీ ప్రభు త్వం, లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో 1/3వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తూ 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందంటే మహిళల ప్రభావాన్ని గుర్తించడం వల్ల మాత్రమే! ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మహిళలు గుర్తించదగిన వాటాను కలిగివున్నారు. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకంలో 27%, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకంలో 37%, అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో 44%, ముద్రా రుణాల్లో 68%, స్టాండప్‌ ఇండియా పథకంలో 81శాతం మహిళలు ప్రయోజనం పొందుతున్నారు.
ఇక రాజకీయాల్లో మహిళల ప్రవేశం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇది ఇంకా గణనీయమైన స్థాయిలో లేకపోయినా, అభివృద్ధి మాత్రం ఆశాజనకంగా సాగుతోంది. అందువల్ల రా నున్న కాలంలో ఏ పార్టీ కూడా మహిళలను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఒకవేళ పురు షాధిక్యత ప్రదర్శిస్తే, పార్టీలు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్టే!!

సందిగ్ధంలో టీడీపీ రాజకీయ ప్రస్థానం

టీటీడీ సంఘటనలో మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ట

వరుస సంఘటనలతో భక్తుల్లో పెరుగుతున్న భయం

కంట్లో నలుసులా మారిన పవన్‌ కళ్యాణ్‌

టీడీపీలో క్రమంగా తెరమరుగుకు సీనియర్‌ నేతలు

లోకేష్‌ నేతృత్వంలో కొత్త తరం నాయకులు

లోకేష్‌ నాయకత్వాన్ని ‘మిత్రులు’ ఆమోదించడం కష్టమే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఈసారి వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారు భక్తులకు పరీక్షలు పెడుతున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీచేసే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, లడ్డూ కేంద్రంలోని 47వ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, తిరు మల ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకోవడం వంటి సంఘటనలు వరుసగా జరుగు తుండటంతో సహజంగా భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ‘పెద్దాయన’ (శ్రీబాలాజీ)కి కోపానికి ఇవన్నీ సంకేతమని కొందరు ‘సెంటిమెంట్‌’ పరంగా ఆలోచించేవారు భావిస్తే, సాధారణంగా పరిశీలించేవారికి ఒక్కోసమయంలో ఇట్లాగే వరుస సంఘటనలు జరిగి తర్వాత సమసిపోతాయన్న అభిప్రాయం వుండవచ్చు. విచిత్రమేమంటే ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌గా బి.ఆర్‌. నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన త తర్వాత వెంటవెంటనే చోటుచేసుకోవడం స్వామిపట్ల భయభక్తులు ప్రదర్శించేవారిలో ఆందోళన వ్యక్తం కావడం అసహజమేంకాదు. తొక్కిసలాట బాధితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నామనుకుంటే ఒకదానివెంట మరో సంఘటన జరుగుతుండటంతో ఇకముందు మరెన్ని సంఘటనలు జరుగుతాయోనని బిక్కు బిక్కుమనడం భక్తుల వంతైంది. ఎందుకంటే ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ఇచ్చిన సమయం నుంచి ఇవి చోటుచేసుకోవడం గమనార్హం.
వరుస సంఘటనలు ఈవిధంగా వుంటే, ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, ఇ.వొ.శ్యామలరావు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి వున్నదని మీడియాలో విపరీతంగా ప్రచారమైన నేపథ్యంలో, వీరు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తాము తిట్టుకోలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతటి ఉన్నతస్థానాల్లో ఉ న్నవారు, నిత్యకళ్యాణం,పచ్చతోరణంగా వుండే తిరుమలలో అనుక్షణం అప్రమత్తంగా వుంటూ భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు అందించడంలో, పాలనా వ్యవహారాల్లో తలమునకలుగా వుండాల్సింది పోయి విభేదాలు…పరిష్కారాలు చివరకు అసలు మామధ్య విభేదాలే లేవని మరీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే, ఇందుకు వారే బాధ్యత వహించాలి. తొక్కిసలాటకు ఉన్నతస్థాయిలో సరైన సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమన్న సత్యాన్ని విస్మరించడానికి వీల్లే దు. అసలు ఏమీ లేకుండా మీడియాలో ఏవిధమైన వార్తలు రావు. కాకపోతే కొద్దిగా ‘పొగ’ కనిపిస్తే ‘తగులబడిపోతున్నది’ అనేస్థాయిలో ప్రచారం జరగవచ్చు.

సరిగ్గా ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ రంగంలోకి దిగి ప్రభుత్వంలోతాను కూడా భాగస్వామినే కనుక, జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతూ, టీటీడీ ఛైర్మన్‌, ఈఓ, అసోసియేట్‌ ఈవోలు కూడా క్షమాపణలు చెప్పాల్సిందేనని గట్టిగా కోరడం, బి.ఆర్‌.నాయుడు అందుకు తిరస్కరించడం వరుసగా జరిగిన పరిణామాలు. నిజం చెప్పాలంటే పవన్‌ కళ్యాణ్‌ వ్య వహారశైలి తెలిసిన వారెవరైనా ఆయన ఇంకా ముందుకు దూకుడుగా వెళతారనే భావిస్తారు. కానీ మిత్రధర్మం, రాజకీయ పరిమితి నేపథ్యంలో అంతకుమించి ముందుకెళ్లలేదు. కానీ ఆయన క్షమాపణ చెప్పడంతో తనపట్ల ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకున్నారనే చెప్పాలి. దీని తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగి నష్టపరిహారం చెల్లింపు ప్రకటనతో ‘‘మమ’’ అనిపించినా టీటీడీ ఛైర్మన్‌ ‘క్షమాపణ’ చెప్పకపోవడం, యాదృచ్ఛికంగా తర్వాత జరిగిన సంఘటనలు టీడీపీ పట్ల ప్రజల్లో విశ్వాసం సడలే పరిస్థితి ఏర్పడిరది. దేవుడి దగ్గరకూడా రాజకీయమేంటన్న ప్రశ్న లు ఉత్పన్నమవడానికి కారణమయ్యాయి. దీనికి తగ్గట్టే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నఅంశం దగ్గరినుంచి తిరుపతి సంఘటన వరకు ‘మిత్రధర్మం’ పాటిస్తూనే పాలనలో జరుగుతున్నతప్పిదాలను ఎత్తిచూపుతూ పవన్‌కళ్యాణ్‌ ముందుకెళ్లడం టీడీపీకి గొంతులో పచ్చివెలక్కాయపడిన చందంగా మారింది. ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్లకు తనకు సంబంధం ‘లేదన్న’ రీతిలో పవన్‌ కళ్యాణ్‌ వ్యవహారశైలి వుంటోదనేది టీడీపీ పెద్దల ఆందోళన. నిజం చెప్పాలంటే ప్రత్యర్థి జగన్‌ను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నప్పటికీ, పవన్‌ కళ్యాణ్‌ విషయంలో ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అయితే పవన్‌కళ్యాణ్‌ వెనుక బీజేపీ వున్నదన్న సత్యం టీడీపీ నాయకులకు బాగా తెలుసు. రాష్ట్రానికి ఏమన్నా కావాలన్నా, చెయ్యాలన్నా చంద్రబాబు కంటే, పవన్‌కళ్యాణ్‌కే బీజేపీ పెద్దలు ప్రాధాన్యతనిస్తారనేది నిష్టుర సత్యం. మొన్న నరేంద్రమోదీ విశాఖకు వచ్చి రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారంటే, పవన్‌ కళ్యాణ్‌ పాత్రను మరువడానికి వీల్లేదు. ఇందుకు బీజేపీ ఆలోచనలు, వ్యూహాలు భిన్నంగా వుండవచ్చు.

ఇప్పుడు చంద్రబాబు వయస్సు రీత్యా పెద్దవారయ్యారు. 2029నాటికి ఆయన 80వ పడిలో పడతారు. అప్పటికి ఆయనకు ఇంతటి ఓపిక వుంటుందనుకోవడం భ్రమే! ఈ నేపథ్యంలో చిన్నగా లోకేష్‌ను వెలుగులోకి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహింపజేయాలన్న పుత్రవాత్సల్యంచంద్రబాబులో వుండవచ్చు కానీ, దీన్ని జనసేన, భాజపాలు ఎంతమేర అంగీకరిస్తాయన్నది ప్ర ధాన ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నంతవరకు వాటికి అభ్యంతరం వుండదు. కానీ లోకేష్‌కు ఆ స్థానం ఇవ్వడం వాటికి సుతరామూ ఇష్టం కానిది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం లోకేష్‌ విషయంలో మీడియాకు చిన్నగా లీకులిస్తూ కూటమి పార్టీల అభిప్రాయం తెలు సుకోవాలని యత్నిస్తోంది. అదీకాకుండా పార్టీలో అంతర్గతంగా చంద్రబాబు నాయుడు సమకాలీనులైన సీనియర్‌ నాయకులను క్రమంగా పక్కకు తప్పించే యత్నాలు కూడా మొదలయ్యాయం టున్నారు. ముఖ్యంగా లోకేష్‌ సన్నిహితులు, ఆయన తరం నాయకులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుండటం ఈ అనుమాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు టీడీపీ సీనియర్‌ నేత అఅచ్చం నాయుడినే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయనకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గి పోతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ హయాంలో అచ్చన్నాయుడు జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అభిమానం చంద్రబాబు నాయుడికి వుండటంలో తప్పులేదు. కాకపోతే వచ్చిన చిక్కల్లా, అచ్చన్నాయుడికి, లోకేష్‌పై పెద్దగా మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. మరి లోకేష్‌ ప్రభావాన్ని పెంచాలని చంద్రబాబు యత్నిస్తున్న నేపథ్యంలో, ఇక అచ్చన్నాయుడి పాత్రను ఒక స్థాయికి పరిమితం చేసి క్రమంగా తెరమరుగు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ ఉద్దేశాన్ని గుర్తించిన కొందరు తెలివైన సీనియర్‌ నేతలు తమ వారసులను రంగంలో కి దించి, లోకేష్‌ ప్రాపకం కోసం ప్రయత్నిస్తుండం కూడా టిడిపిలో జరుగుతున్న పరిణామం.

ఇవన్నీ ఈవిధంగా వుండగా సోమవారం ఇందిరాగాంధీ పంచాయతీరాజ్‌ భవనంలో కాంగ్రెస్‌ నేత సచిన్‌పైలెట్‌ మాట్లాడుతూ, చంద్రబాబు, నితిష్‌లు కేంద్రంలో చక్రంతిప్పే పరిస్థితి లేదని, త మ రాష్ట్రాలకు కావలసిన వాటిని సాధించుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పడమే కాదు, వీరిద్దరూ ఎప్పుడు హ్యాండిస్తారో తెలిదని కూడా వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. చంద్రబా బు, నితిష్‌లు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదని, ప్రజాస్వామ్యంతో మిత్రత్వం శాశ్వ తం కాదన్న సత్యాన్ని గుర్తించాలని ఆయన అనడం, తెరవెనుక ఏం జరుగుతున్నదనే అనుమానా లు లేవనెత్తడం సహజం. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రం చేత ఎన్‌డీఏ ప్రభుత్వం పడిపోదు, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా సచిన్‌ పైలెట్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చేశారంటే ఇందులో ఏదో మతలబు వున్నదనే భావించాల్సి వుంటుంది. ఆయన అభిప్రాయం ఎట్లా వున్నా, ఆంధ్ర రాజకీయాలకు వస్తే, చంద్రబాబు ప్రస్తు తం అందటి దుస్సాహసం చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తే ఆయన కే నష్టం. లోకేష్‌ ఇంకా పూర్తిస్థాయి నాయకుడు కాలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానానికి చం ద్రబాబు తర్వాత పవన్‌కళ్యాణ్‌కే ఛాన్స్‌ ఇవ్వాలన్నది జనసేన, భాజపాల ఉద్దేశం! ఒకవేళ టీడీపీ కూటమినుంచి బయటకు వస్తే పార్టీ భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ప్రభుత్వ వరుస తప్పిదాలను, తిరుమల సంఘటనలను జగన్‌ పార్టీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకోవడం మొదలుపెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలు నైరాశ్యంగా వున్న జగన్‌ పార్టీలో జోష్‌ నింపుతున్నాయి. గతంలో అన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా రోడ్లను పట్టించుకోకపోవడంతో, జగన్‌ను జనం పట్టించుకోలేదు. ఇప్పుడు బహు బాగా రోడ్లు వేశామంటూ ఎంత ప్రచారం చేసుకున్నా, మిగిలిన పాలన సజావుగా లేకపోతే ప్రజలు టీడీపీనీ పట్టించుకోరు. ఆంధ్ర ప్రజల రాజకీయ చైతన్యం వేరు. వారు ఎప్పటికప్పుడు చాలా తెలివి గా వ్యవహరిస్తారు. బహుశా ప్రజలకు సంక్షేమాలు సక్రమంగా అమలు జరకపోవడం వల్ల కలుగుతున్న కష్టం, నష్టం ప్రజలకు తెలిసొస్తుండవచ్చు. ఇది పెరుగుతూ పోతే పార్టీ పుట్టి మునగడం ఖాయం.తెలంగాణతో పోలిస్తే, ఆంధ్ర రాజకీయం భిన్నం. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే తెలియకుండానే మునిగిపోవడం తథ్యం.

ఆంధ్ర రాజకీయాలను పరిశీలస్తున్న వారికెవరికైనా ఒక్క విషయం బోధపడివుంటుంది. లోకేష్‌ను ప్రొజెక్ట్‌ చేయడం జనసేన, బీజేపీకి సుతరాము ఇష్టం వుండదు. ఈ రెండు పార్టీలను వదిలేసి ఒంటరిగా టీడీపీ గెలవడం అసాధ్యం. టీడీపీ సహాయం లేకుండా వాటికీ మనుగడ లేదు. చం ద్రబాబు పెద్దవారైపోతున్నారు కనుక లోకేష్‌కు పగ్గాలు అప్పగించక తప్పదు. లోకేష్‌కు పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చే సత్తా లేదు. పార్టీలో సీనియర్లు కనుమరుగవుతూ, రంగంలోకి వస్తున్న కొత్త నాయకత్వం రెక్కలు విప్పే సరికి కొంత సమయం పడుతుంది. మరి ఈలోపు జన సేన, బీజేపీలు చేతులు ముడుచుకొని కూర్చోవు. వాటి రాజకీయం అవి చేస్తాయి. ఇక దెబ్బతి న్న దిగ్గజం వై.ఎస్‌. జగన్‌ ఎట్లాగూ ప్రత్యామ్నాయంగా వున్నారు. లోకేష్‌ ‘కలువ’ వికసించాలంటే, నాయకత్వ ఉషోదయానికి అడ్డుగా వున్న ఇన్ని మబ్బులు తొలగక తప్పదు! మరిది ఇప్పట్లో సాధ్యమా?

‘‘కూడిక’’,’’తీసివేత’’లు లేవు!

`విస్తరణ మరో ఆరు నెలల దాక అవకాశం లేదు.

`విస్తరణ పై ఎలాంటి కదలికలైనా ‘‘జూన్‌’’ తర్వాతే.

`ఉద్వాసన ఆలోచన అసలే లేదు.

`‘‘ఎమ్మెల్సీ’’ ఎన్నికలన్నీ పూర్తయ్యేదాకా ఎలాంటి కదలికలు వుండవు.

`‘‘ఎమ్మెల్సీ’’ లలో ఇద్దరికీ క్యాబినెట్లో చోటు.

`అధిష్టానం కూడా ‘‘సీఎం రేవంత్‌’’ నిర్ణయాలకే పూర్తి మద్దతు.

`ఈ ఏడాదిలో అనేక ఎన్నికలు.

`ప్రత్యర్థి రాజకీయాలకే సమయం కేటాయింపు.

`అన్ని ఎన్నికలలో మెజారిటీ స్థానాలపైనే గురి.

`పార్టీలో లుకలుకలు ఏమీ లేవు.

`లేని తేనె తుట్టెను కదపాలనుకోవడం లేదు.

`రాష్ట్ర పార్టీలో అసమ్మతి తెచ్చుకోవడం సుతారం ఇష్టం లేదు.

`అంతా సవ్యంగా సాగుతోంది.

`సిఎం రేవంత్‌ రెడ్డి బ్రాండ్‌ ముద్ర బలంగా పడుతోంది.

`ఈ ఏడాది అభివృద్ధి, ఎన్నికల మీదనే ప్రధాన దృష్టి.

`ఎలాంటి నిర్ణయాలైనా అప్పటి వరకు ఆగాల్సిందే.

`మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

`కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలలో కదలికల కోసం ‘‘ఓ సెక్షన్‌ మీడియా’’ పన్నాగం.

`అధిష్టానం ఎలాంటి మార్పులు, కూర్పులకు ఆదేశం ఇవ్వలేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాష్ట్రంలో మంత్రి వర్గ కూర్పు ఇప్పట్లో లేదు. మంత్రుల ఉద్వాసన అన్న దానికి ఆస్కారమే లేదు. కాని ఈ మధ్య ఈ రకమైన ప్రచారం విసృతంగా జరుగుతోంది. మీడియా వర్గాలు ఊహాగానాలు తప్ప, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వస్తున్న లీకులు కూడా కాదు. ఎందుకంటే ఏ లీకులైనా సరే కొంత కాలమే పనిచేస్తాయి. కాని ఎల్ల కాలం పని చేయవు. అవే నిజమైతే ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి వుంది. గత ఆగష్టులోనే మంత్రి వర్గ విస్తరణ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అధిష్టానం సూచనలు కూడా పూర్తయ్యాయన్నారు. కాని ఏం జరిగింది. ఎలాంటి కదలిక లేదు. కారణం అవన్నీ మీడియా సృష్టించిన వార్తలు. అందుకే వాటిలో నిజం లేకుండాపోయింది. గత కొంత కాలంగా కూడా ఇదే రకమైన వార్తలు వండి వారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మంత్రి వర్గ విస్తరణతోపాటు, కొంత మంది మంత్రులు ఉద్వాసన అంటూ కొత్త కథలు అల్లుతున్నారు. అసలు మంత్రి వర్గం నుంచి ఒక మంత్రిని తప్పించాలంటే ఎలాంటి కారణాలు వుండాలో తెలియనంత అమాయకంగా వార్తలు రాస్తున్నారు. ఉన్న ఫలంగా ఏ మంత్రినైనా తొలగించే అధికారం ముఖ్యమంత్రికి వున్నప్పటికీ అలాంటి సందర్బాలు చాల తక్కువ. పని తీరు బాగా లేదనో , మరో కారణం చేత మంత్రులను మార్చడం అన్నది గతంలో ఎప్పుడూ జరలేదు. కాకపోతే సంబందిత మంత్రి మీద విపరీతమైన ఆరోపణలు ముసురుకున్నప్పుడు తప్ప మంత్రులను తప్పించే పరిస్దితి ఎప్పుడూ వుండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటి మంత్రులు ఎవరూ లేరు. కాని ఓ సెక్షన్‌ఆఫ్‌ మీడియా పని గట్టుకొని కొంత మంది మంత్రులకు ఉద్వాసన అంటూ లేని లెక్కలు చెబుతున్నారు. లేని కారణాలు చూపిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు మీడియా వార్తలను పట్టుకొని రాజకీయం చేయడు. ఇది ఇప్పుడు కాదు..అనాదిగా వస్తున్నదే! అలా అనుకుంటే ఏ మంత్రి వర్గంలోనూ ఏ ఒక్క మంత్రి పూర్తి కాలం పదివిలో వుండరు. ఇక ఇదిలా వుంటే మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడప్పుడే వుండే అవకాశం ఎట్టిపరిస్ధితుల్లో లేదు. ప్రస్తుతం మంత్రి వర్గ కూర్పు ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మదిలో లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద చేస్తున్న ఒత్తిడి లేదు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అధిష్టానం జోక్యం చేసుకుంటుంది. అధిష్టానం సూచనలను అప్పుడు పాటించాల్సి వుంటుంది. అందులోనూ మంత్రుల ఎంపిక బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి సమ్మతంతోనే జరగుతుంది. అంతేకాని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వున్న వాళ్లను ఎప్పుడూ అధిష్టానం సూచనలు చేయదు. ఒత్తిడి అసలే చేయదు. అదే జరిగితే ఆ మంత్రులు ముఖ్యమంత్రి మాట వినే అవకాశాలు తక్కువగా వుంటాయి. అప్పుడు ప్రభుత్వం అబాసుపాలౌతుంది. మొదటికే మోసం వస్తుంది. గతంలో ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో అధిష్టానం సూచనల మేరకు జేసి దివాకర్‌రెడ్డిని మంత్రి వర్గలోకి వైఎస్‌ తీసుకున్నారు. అది వైఎస్‌కు ఇష్టం లేదు. కాకపోతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద క్యాబినేట్‌. అందువల్ల ఒకరో, ఇద్దరో ముఖ్యమంత్రికి వ్యతిరేకత వున్న మంత్రులు వున్నా వారిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరం వుండేది కాదు. రెండోసారి వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత జేసి దివాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్చ ఎంతగా వుంటుందో ఈ ఒక్క సందర్భాన్ని గుర్తుచేసుకోవచ్చు. అందవల్ల అధిష్టానం ఎప్పుడూ ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురి చేసే పరిస్దితి వుండదు. రాదు. గతంలో ఇలాంటి పరిస్దితి కనిపించేదని అంటారే గాని, అది కూడా నిజం కాదు. పైగా సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రులను మార్చడం, రాష్ట్ర పార్టీలో కల్లోలాలు సృష్టించడం అన్నది ఎప్పుడూ లేదు. అలాంటి రాజకీయాలను సోనియాగాందీ ఆహ్వానించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికే అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నాయి. లేకుంటే కొంత మంది సీనియర్‌ నాయకులు తమ గళం ఎప్పుడో విప్పేవారు. ఇక మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముకంగా లేరు. ఈఏడాది ఎలాగైనా తన మార్కు పాలన చూపించాలన్న పట్టుదలతో వున్నారు. రాజకీయాల్లో ఆయనకు వున్న బ్రాండ్‌ను పాలనలో కూడ చూపించాలన్న తపనలో వున్నారు. అందువల్ల ఆయన లేని పోని తలనొప్పులు పెట్టుకోవాలనుకోవడంలేదు. లేని సమస్యలు రద్దుకోవాలన్న ఆలోచన అసలే లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వుండేంత దూరాలోచన ఎవరికీ వుండదు. ఆయన వచ్చే ఐదేళ్ల కాలంలో ఏం చేయాలో ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కలను సరిచేసుకుంటూనే రాజకీయం చేస్తారు. అంతే గాని ఎదురయ్యే సమస్యలకు బెదిరిపోయే వ్యక్తిత్వం కాదు. ఏదైనా తన దగ్గరకు రావాల్సిందే. తాను చేయాలనుకున్న రాజకీయం చేయాల్సిందే. అదే ఆయన ఎదుగుదలకు దోహదపడిరది. ఆ దారిని ఆయన మార్చుకోరు. అందుకే ఆ మధ్య డిల్లీలో జరిగిన మీడియా సమావేశంలోనే మంత్రి వర్గ కూర్పుపై స్పష్టమైన సంకేతాలు ఎప్పుడో ఇచ్చారు. అందుకే పదే పదే మీడియా ఊహలకు సమాధానం ఎవరూ చెప్పరు. కాని రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాదానంతో సంతృప్తి చెందని మీడియా తనదైన శైలిలో ఈ విషయాన్ని తెరమీదకు తెస్తూనేవుంది. కాని ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలున్నాయి. త్వరలో మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్‌లో మరో ఆరు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగాల్సి వుంది. ఇంతలో కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగాల్సిన అసవరం వుంది. జిహెచ్‌ఎంసి లాంటి ఎన్నికలున్నాయి. అసలే హైదరాబాద్‌లో మంత్రి లేడు. ఇవన్నీ దృష్టిలో వుంచుకొని మంత్రి వర్గ కూర్పు చేయాల్సి వుంది. ఆగమేఘాల మీద మీడియా ఉత్సాహం కోసం మంత్రి వర్గ విస్తరణ జరిగేది కాదు. ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి మాత్రమే మంత్రులను తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్సీలకు కూడా ఓ ఇద్దరికి అవకాశం ఇవ్వాల్సి వుంది. కాంగ్రెస్‌ పార్టీకి మండలిలో కూడా కొంత మెజార్టీ రావాలంటే జూన్‌ వరకు ఆగాల్సివుంటుంది. అప్పుడు ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా వున్న ఓ నాయకుడికి హమీ వుంది. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆయన ఎమ్మెల్సీ కావాల్సి వుంది. ఆ పై మంత్రి కూడా అయ్యేందుకు అవకాశాలున్నాయి. ఆయనకు ఎప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం అందుతుందో ఆ తర్వాతే మంత్రి వర్గ విస్తరణ వుంటుంది. అప్పటి వరకు ఎలాంటి విస్తరణ వుండే అవకాశాలు లేవు. పైగా త్వరలో బెడ్జెట్‌ సమావేశాలున్నాయి. కనీసం నెల రోజులైనా జరిగే అవసరం వుంది. లేని పక్షంలో రమారమి 20 రోజులైనా బడ్జెట్‌ సమావేశాల నిర్వహన జరుగుతుంది. ఈ సమయంలో మంత్రి వర్గంలో మార్పులు, కూర్పులు పెట్టుకొని అసెంబ్లీలో ప్రతిపక్షాలకు అవకాశం దక్కనిస్తారా? అధికార పక్ష సభ్యులు అసెంబ్లీలో మౌనం దాల్చే పరిసి ్ధతులు ఎవరైనా తెచ్చుకుంటారా? ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు విస్తరణపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సన్నిహితులతో చెబుతూనే వున్నారు. కాని ఇలాంటి వార్తలు వస్తూనే వుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా ఏదో ఒకరమైన లుకలుకలు తేవాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయి. వాటిని ఆసరగా చేసుకొని రాజకీయాలు చేయాలని ఆలోచిస్తున్నాయి. వాటి బుట్టలో పడడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకే నష్టమౌతుంది. అందువల్ల ఎవరూ స్పందించొద్దని కూడా అధిష్టానం ఇతర నాయకులను హెచ్చరించింది. ముఖ్యమంత్రి ఎంతో కష్టపడుతుంటే మిగతా మంత్రుల్లో కొందరు సరైన స్పందన చూపడం లేదన్న అభిప్రాయాన్ని అధిష్టానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకైనా క్యాబినేట్‌ సమిష్టి నిర్ణయాలతో మాత్రమే ముందకు సాగుతున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చనిచ్చారు. ఏ మంత్రి శాఖలోనూ ముఖ్యమంత్రి ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ప్రజా ప్రభుత్వం అంటే ఎలా వుంటుందో నిజంగా చూపిస్తున్నారు. అందుకే మంత్రుల్లో ఉద్వాసన ప్రశ్న ఉత్పన్నమేకాదు. కాని విస్తరణ ఇప్పటికైతే లేదనే సమాచారం అందుతోంది.

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మెడికల్ ఆఫీసర్

*నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు*

*-మెడికల్ ఆఫీసర్ సారియా అంజు*

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

జ్వరం వచ్చిందని వీధి చివర ఉండే క్లినిక్ వెళ్తున్నారా?
తస్మాత్ జాగ్రత్త..
మీకు ఇంజక్షన్ చేసే డాక్టర్ అసలు డాక్టరేనా? అతను రాసే మందులు నిజంగా మన బాడీకి అవసరమైన అన్నది ఆలోచించండి. ఉన్న రోగం పోతుందో లేదో తెలియదు కానీ కొత్త రోగం రావడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.
రోగులకు చికిత్స చేయాలంటే ఉండాల్సింది ముందు సరైన అవగాహన.తగినంత నాలెడ్జ్.. అన్నింటికంటే కావాల్సింది అనుభవం.కానీ చాలామంది నకిలీ డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారికి ఇవేవీ ఉండవు. కానీ ట్రీట్మెంట్ చేసేస్తారు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తారు. నిజానికి రూల్స్‌‌‌‌ ప్రకారం ఆర్‌‌‌‌ఎంపీ, పీఎంపీలు ఫస్ట్‌‌‌‌ ఎయిడ్‌‌‌‌ చేసేందుకు మాత్రమే పరిమితం కావాలి. తమ సెంటర్‌‌‌‌కు ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు హేవీ డోస్‌‌‌‌ ఇంజక్షన్లు, పెయిన్‌‌‌‌ కిల్లర్స్‌‌‌‌, యాంటీ బయాటిక్స్‌‌‌‌, స్టెరాయిడ్స్‌‌‌‌ ఇచ్చేస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా ఫిట్స్‌‌‌‌ రావడం, బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పులు కొత్తగా తయారవుతున్నాయి. ఈ టైమ్‌లో సరైన ట్రీట్‌మెంట్ అందకపోతేమరణమే శరణమవుతుంది.
చాలా రోజులుగా ఆర్ఎంపి, పి.ఎం.పి లపై అధికారుల చూపు తగ్గడంతో ఇష్టాను రీతిలో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.

*మెడికల్ ఆఫీసర్ తనిఖీ లు…*

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ప్రథమ చికిత్స కేంద్రం మరియు గొల్లపెల్లి లోని అశ్విని ప్రథమ చికిత్స కేంద్రం మరియు మెడికల్ షాపు లో మెడికల్ ఆఫీసర్ తనఖీ నిర్వహించారు. తనిఖీలు ఆర్ఎంపీలు ఉపయోగించకూడనివి లిక్విడ్, సిరంజి లు లభ్యం కావడంతో మెడికల్ ఆఫీసర్ వాటిని సీజ్ చేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ లేని క్లినిక్ లు మరియు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లను నడిపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని క్లినిక్ పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం అందిస్తే వాటిని సీజ్ చేస్తామని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.

రైతుల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం

టెలికం బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్

నిజాంపేట: నేటి ధాత్రి

పసుపు బోర్డు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని టెలికం బోర్డ్ మెంబర్ ఆకుల రమేష్ అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డును నిజాంబాద్ జిల్లాకు తీసుకువస్తానని హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. దానికి అనుకూలంగా 2023 అక్టోబర్ 1 మహబూబ్ నగర్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిజాంబాద్ జిల్లా రైతుల చిర వాంఛ కోరిక పసుపు బోర్డు అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత రైతులకు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మాస్టర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, సీనియర్ నాయకులు వెలుముల సీద్ద రాములు, రమేష్ లు ఉన్నారు.

జైపాల్ రెడ్డికి ఘన నివాళి.

కల్వకుర్తి /నేటి ధాత్రి.

మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ స్ఫూర్తి స్థల్ జైపాల్ రెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాగంలో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర ప్రజలెప్పుడూ మరిచిపోలేరని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం నిశ్శబ్ద సైనికుడిలా జైపాల్ రెడ్డి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర ఏర్పాటులో.. మట్టి బిడ్డ అని కొనియాడారు. రాజకీయాల్లో నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.

తండ్రి జ్ఞాపకార్థం క్రికెట్ టీంకు టీ షర్ట్స్ బహూకరణ

బి ఆర్ ఎస్ జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటూ గౌడ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలానికి చెందిన గాజర్ల చింటూ గౌడ్ వారి తండ్రి కీ.శే గాజర్ల రఘుపతి గౌడ్ వారి జ్ఞాపకార్థం గణపురం క్రికెట్ ఆటగాళ్ళకు టీ-షర్ట్ లను బహుకరించిన తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటూ గౌడ
అనంతరం గణపురం క్రికెట్ టీం తరుపున వారికీ కృతజ్ఞతలు తెలియడం జరిగింది ఈ కార్యక్రమం లో క్రికెట్ టీం సభ్యులు నిమ్మ సురేందర్, తాళ్లపల్లి సాయి వర్ధన్, వాజిత్, .ముజ్జు,సోను, రోహన్, బబ్లు,తాళ్లపల్లి శివ, అఖిల్, వొంకుడోతూ గణేష్, కార్తీక్, రాపర్తి సాయిరాం, రాజు, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు..

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

వీణవంక,( కరీంనగర్ జిల్లా):

నేటిదాత్రి:వీణవంక మండల పరిధిలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గంగిపల్లి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుమారుడి స్నేహితులు అందరూ కలిసి ఆ కుటుంబానికి క్వింటల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిలువేరి రమేష్, రాధారపు తిరుపతి , తాళ్లపల్లి శ్రీనివాస్, పొన్నం రవీందర్, గాజుల రవీందర్, నీల కుమార్ తదితరులు అందజేశారు

జగత్ విఖ్యాత అవార్డు అందుకున్న హర్షిని

భూపాలపల్లి నేటిధాత్రి

భక్త రామదాసు ఆడిటోరియంలో ఖమ్మం లో జరిగిన సంక్రాంతి జాతీయ ఉత్సవాలలో స్వరమాధురి.కల్చరల్ అకాడమీ.ఖమ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు భూపాలపల్లి పట్టణానికి చెందిన దుప్పటి శోభన్ బాబు. నవ్య కుమార్తె దుప్పటి హర్షిని. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో జగత్ విఖ్యాత అవార్డు అందుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులు దుప్పటి హర్షిని అభినందించారు ఈ కార్యక్రమం నిర్వహించిన ఇసనపల్లి నగేష్ వేల్పుల వెంకటేష్ కి. అభినందనలు తెలియజేశారు. నృత్య గురువైన.నానీ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు..

error: Content is protected !!
Exit mobile version