బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
భీమినీ మాజీ ఎంపీపీ శ్రీమతి,పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు అమ్మాయిలు చాలా ఉత్సాహంగా పాల్గొని, ముగ్గులు వేయడం జరిగినది. ముఖ్య అతిథిగా భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా భీమిని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ లో మహేశ్వరి, దీపిక బొలిశెట్టి సౌందర్య మౌనిక పాల్గొని విజేతలను సెలెక్ట్ చేశారు.మొదటి బహుమతి సెల్వట్ కార్ ప్రమీల, రెండవ బహుమతి పెరుగు నిరోష, మూడవ బహుమతి వేల్పుల మౌనిక, కే.నేహ లకు పోటీలలో పాల్గొన్న వారందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులను భీమిని మాజీ ఎంపీపీ శ్రీమతి, పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్, ఎస్ఐ విజయ్ కుమార్, పోతురాజుల రాజయ్య, శ్రీరామ సేవా సమితి అధ్యక్షులు పోతురాజుల లక్ష్మణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దోరిశెట్టి బానేష్, కోండ్ర సాయి, గంగారాం, మహబూబ్, పెంటు, మల్లయ్య, రడం శ్రీనివాస్, పెరుగు సంతోష్, నవీన్, బెస్త సంతోష్, కైర్, నందకిషోర్, శ్రీనివాస్, షరీఫ్, సోమయ్య, రాజయ్య, శంకర్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.