గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి సోమవారం సందర్భంగా భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్, గణపురం ఎస్ఐ రేఖ అశోక్, మమత దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి నందీశ్వరుని పూజతో అర్చకులు జూలపల్లి నాగరాజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రుద్రాభిషేకం లో సిఐ నరేష్ కుమార్ గౌడ్, ఎస్ ఐ రేఖ అశోక్ మమత దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు నాగరాజు కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సంక్రాంతి భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి క్యూలైన్ లో స్వామివారిని దర్శించుకున్నారుపూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు.