పాలకుల విధానాలే అతి పెద్ద శాపం : తాటి వెంకటేశ్వర్లు
దేశంలో, రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న దివాలాకోరు విధానాలు అన్ని వర్గాల ప్రజలకు అతి పెద్ద శాపంగా మారాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెయంయు) రాష్ట్ర కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా 2వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని తాటి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. దున్నేవాడికే భూమి…