తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.
ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్
విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్ ను అదను చూసి సాగనంపుడే?
`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?
హైదరబాద్,నేటిధాత్రి:
కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది.
షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు.
కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్ వినలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్ పుల్ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది.
తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాదితులు, డయాలసిస్ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.
ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.
ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.
రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.
ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు
కబ్జా చేయడం తనకు జాగీరైనట్లు, అది తప్పే కానట్లు, చేసింది గొప్ప పని అన్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పిన సుద్దులు ఆశ్చర్యకరంగా వుంది. దానికి తోడు నవ్వేమైనా తక్కువా…నువ్వు కబ్జాలు చేయలేదా? అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గురించి ముత్తిరెడ్డి వ్యాఖ్యానించ ఇద్దరం…దొందేలే అని చెప్పినట్లుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకైనా అర్థమౌతుందా? అనే దాక వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడో…అప్పటి నుంచి వివాదాలే! వివాదాలు!! అయినా కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం, పాలన కోసం ప్రజలు ముత్తిరెడ్డి ని భరిస్తున్నారు. ఇదే వాస్తవమని బిఆర్‌ఎస్ నాయకులే అంటున్నారు. ముత్తిరెడ్డి విషయంలో వివాదం లేని సమయం లేదు…సందర్భం లేదు. గతంలో కొంత గంభీరంగా మాట్లాడే వారు. కోపంతో ఊగిపోయేవారు. ఇప్పుడు అదును చూసి అప్పుడప్పుడు ఏడుస్తూవున్నాడు. సమావేశాల్లో కొన్ని సార్లు ఆయనే నిరసన తెలుపుతున్నారు. సభల్లో నేల మీద పడుకొని నిరసనలు తెలియజేస్తాడు. అప్పడే రైతులను బెదిరిస్తాడు. ఏక కాలంలో అనేక డైమన్షన్లు చూపిస్తుంటాడు. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వింతగా వున్నాయి. అంతే కాదు…నేనింతే! అన్నట్లు వున్నాయి. కబ్జాల విషయంలో తాను బాజాప్త చేశానని ఆయనే ఒప్పుకున్నాడు. పైగా కబ్జా చేసిన స్థలాన్ని జనానికి దానం చేసినంత దాన కర్ణుడిలాగా మాట్లాడుతుంటాడు. ప్రజల భూమిని కబ్జా చేయడమే నేరం. దాన్ని సమర్థించుకోవడం అంతకన్నా నేరం. తన కూతురు అమాయకురాలు కాబట్టి భూమి వదిలేసుకున్నది అని తనే అంటాడు. అలా తన కూతురు చేర్యాల చెరువు భూమి ప్రజలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని అంటాడు. అంటే తన కూతురు అలా భూమి ఇవ్వడం ఇష్టం లేదని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే గా వున్న సమయంలో అనేక అక్రమాలు చేసినట్లు ముత్తిరెడ్డి ప్రకటించారు. వెంచర్ చేసి, ప్రజలకు, ప్రభుత్వానికి అందించాల్సిన స్థలం కూడా కొమ్మూరి ఇవ్వలేదని ముత్తిరెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా వుండి ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నాడా? ఎవరికి చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలు అని జనం ఈసడిరచుకున్నారు. కూతురు ను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలలో గెలవాలని సరికొత్త నాటకానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెరతీసినట్లు జనం చెప్పుకుంటున్నారు. చివరగా అసలు విషయం చెప్పుకోవాలి. ఇటీవల ముత్తిరెడ్డి కూతురు తన తండ్రికి వెయ్యి కోట్ల ఆస్థి వుంది. నెలకు కోటిన్నర రెంట్లే వస్తాయి అని చెప్పింది. మళ్ళీ ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి మా నాన్న ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పింది. ప్రజలు ఒక వేళ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే సంపాదించాడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముందని గ్రహించి సరిదిద్దే ప్రయత్నం చేసింది. అంటే తండ్రి, కూతురు చాలా చక్కని స్క్రీన్ ప్లే రచించారు. ఇదిలా ఉంటే జనగామ రాజకీయాలు గుత్తకు తీసుకున్నట్లు, కబ్జాలు వాళ్ల హక్కు అన్నట్లు ఇద్దరు నేతలు ముత్తిరెడ్డి, కొమ్మూరి ల మధ్య సంవాదం చాలా విచిత్రంగా ఉంది. నా బాగోతం నాకు తెలుసు, నీ బాగోతం నాకు తెలుసు అని చెప్పుకుంటూ భలే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల ముందుకు వచ్చేది, ఎన్నికలలో నిలబడేది, రాజకీయాలు చేసేది ఇందుకేనా? ప్రజలకు సేవ చేయడం అన్నది అటు ముత్తిరెడ్డి, ఇటు కొమ్మూరి మర్చిపోయారా? ఇక ముత్తిరెడ్డి చెప్పే విషయాలు కొన్ని అటు పార్టీని, ఇటు ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇరుకున పట్టేలా? వున్నాయి. నేనేంటో, నేను చేసేవేమిటో అన్నీ సిఎం. కేసిఆర్ కు తెలుసు అని చెప్పడంలో ముత్తిరెడ్డి ఆంతర్యమేమిటన్న దానిపై చర్చ మొదలైంది. అసలు ముఖ్యమంత్రి కేసిఆర్ ఇలాంటి వాటిని సమర్థిస్తారా? ఇంకా ఇలాంటి నాయకులను ఉపేక్షిస్తూ పోతే రాజకీయాలంటేనే ప్రజలు విసుగెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ముత్తిరెడ్డి, కొమ్మూరి లాంటి నాయకులను రాజకీయాలు చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరు.
`ఖమ్మం సభతో కాంగ్రెస్ కథ కంచికే అంటున్న ‘‘మునుగోడు’’ సీనియర్ ‘‘బిఆర్‌ఎస్’’ నాయకుడు ‘‘నారబోయిన రవి ముదిరాజ్’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో మాట్లాడుతూ నమ్మితే గతం దరిద్రమంతా ముందుకు తెస్తారని నాటి అనుభవాలు ఆయన మాటల్లోనే..
చెల్లని కాసుకు గీతలెక్కువే..కాంగ్రెస్‌కు చెప్పుకునే గొప్పలు ఉట్టివే..!అయినా ఒక్క సభకే ఎగిరెగిరి పడితే…ఉద్యమ కాలం నుంచి మొదలు బిఆర్‌ఎస్ సభలేమిటో తెలిసి, కూడా ప్లూటు సింహం లాంటి బిఆర్‌ఎసూ ముందు కాంగ్రెస్ జింక ప్లూటు ఊదినట్లుంది. ఒక్కరోజులో వచ్చేది బలుపు కాదు..వాపు..అది రోగంతో సమానం. నిన్నటిదాకా రెండో స్ధానమే దక్కుతుందో లేదో అంటూ మధనపడిరది. మనుగడ కోసం ఆరాటపడిరది. కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఇక్కడ జబ్బలు చర్చుకుంటోంది. ముందే మురవడం మొదలు పెట్టింది. కనీసం అలాగైనా కాంగ్రెస్ సంబరపడడం చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అన్నది ఏనాడో మరుగున పడిపోయింది. తెలంగాణకు అరవైఏండ్లు చేసిన నష్టం, పెట్టిన గోస చాలు అని ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడో బంగాళా ఖాతంలో కలిపేశారు. ఇంక దానికి మనుగడ అన్నది తెలంగాణలో లేదు. ఒక్క నాయకుడు చేరినందుకే కాంగ్రెస్‌లో జోష్ నిండితే ఇప్పుడు వున్న నాయకులంతా దద్దమ్మలమని ఒప్పుకున్నట్లేనా? బిఆర్‌ఎస్‌లో పనికి రాని నాయకుడు కాంగ్రెస్‌లో కళ్లకద్దుకోవడం అంటే ఆ పార్టీ ఎంత దీనావస్ధలో వుందో అర్దం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బిఆర్‌ఎస్‌లో పని చేయలేని నేతలు, బిఆర్‌ఎస్ నుంచి పంపించిన నేతలతో నింపుకున్న పార్టీలు మాతో పోటీ పడడడం అరువు నేతలే దిక్కుగా బతకడమే! అంతటి దురవస్ధను ఎదుర్కొంటూ కాంగ్రెస్ మేమే వస్తాం..అని చెప్పుకోవడం విడ్డూరం. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయ్యాలో ఒక్క మాట చెప్పగలిగే స్దితి, స్దాయి వారికి లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్‌కు మిగిలేవి కలలే…అంటున్న మునుగోడు బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్ కాంగ్రెస్‌ను తూర్పారపడుతూ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు.. పాఠకుల కోసం! ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ పెట్టిన గోసలు అన్నీ ఇన్నీ కావు.
తెలంగాణను నీటి చుక్క ఇవ్వమంటే నలభైఐదేండ్లు గోస పెట్టింది. ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. సాగు ముందుట పడనీయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వికాసాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సిగ్గు పడాలి. కేవలం రాజకీయ స్వార్ధం కోసం తప్ప, తెలంగాణకోసం ఏనాడు ఆలోచించనందుకు కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్మడిరాష్ట్రంలో చెరువులు బాగు చేస్తే తెలంగాణ ఉద్యమం వుండేదా? ప్రాజెక్టులు కట్టాలన్న సోయి వుండేదా? తెలంగాణపై కక్ష్యపెంచుకున్నట్లు ఉమ్మడి పాలకులు ప్రవర్తిస్తుంటే ఎవరైనా ప్రశ్నించారా? మా తెలంగాణ నిధులు మాకు ఖర్చు చేయాలే అని నిలదీశారా? తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు కట్టరని ఎదురుతిరిగారా? ఆంధ్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతుంటే కళ్లప్పగించి చూశారు. తెలంగాణకు నీళ్లియమని మొహం మీద చెబితే పదవుల కోసం ఆశపడ్డరు. ఆఖరకు పోతిరెడ్డి పాడుకు నుంచి కూడా నీళ్లు తీసుకుపోతుంటే అడగలేదు. సీలేరు నుంచి కరంటు ఎందుకియ్యరు? అనలేదు. తెలంగాణ చీకట్లు చూసింది. విలవిలలాడిపోయింది. అలాంటి కాంగ్రెస్ నేతలా రేపు తెలంగాణకు ఉపయోపడేది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ పదేళ్లలో చేసి చూపించాడు. తెలంగాణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ది చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని ప్రయోజనాలు తెలంగాణ ప్రజలు అందుకుంటున్నారు. తెలంగాణ సాగులో విప్లవం తెచ్చాడు. నీటి చుక్క కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నేలతల్లి దాహం తీర్చిన కొడుకు కేసిఆర్. సాగుకు తెలంగాణలోని ప్రతి మూలను సిద్దం చేసిన నాయకుడు కేసిఆర్. ప్రతి ఎకరాకు నీళ్లుందిస్తున్న పాలకుడు కేసిఆర్. ప్రతి చోట పచ్చదనం వెల్లివిరిసేలా చేసిన పాలనాదక్షుడు కేసిఆర్. దేశంలోనే కేసిఆర్ లాంటి నాయకుడు లేడు. పాలకుడు లేడు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కలలు కనడం అంటే పగటి కలలే…అర్ధరాత్రి కలత నిద్రలే..
ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన మాట ఇప్పటికీ తెలంగాణ సమాజానికి గుర్తే వుంది.
కాని కాంగ్రెస్ నేతలకే ఆనాడు వినిపించలేదు. ఇప్పుడు గుర్తుకు లేదు. నవ్వేవారి ముందు జారిపడ్డట్టు తెలంగాణ సమాజం ఇక ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెప్పేవారు. అది ఉద్యమమైనా, ఉద్యమ స్పూర్తితోసాగే పాలనైనా అని తెలంగాణ ప్రజలు ఆనాడు, నేడు ఆచరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన మాత్రమే కావాలనికోరుకుంటున్నారు. మెరిసే బంగారమంత గొప్పగా తీర్చిదిద్దబడిన తెలంగాణను ఆదమర్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఆశలు నెరవేర్చాలనే జాలి పడితే మళ్లీ తెలంగాణ వందేళ్లు వెనక్కిపోతుంది. ఖమ్మం సభలో కాంగ్రెస్‌నాయకుల తీరు అందరూ చూశారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఒకరినొకరు ఎలా తోసుకున్నారో…చూశాం. రేపు పాలన కూడా అంతే…పదవులు కోసం కాంగ్రెస్ నాయకులు పడే తపనతో పాలన గాలికొదిలేస్తారు…తెలంగాణను ఆగం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందుకు ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చుతూ, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. పైగా ఏ పాలకుడు వచ్చినా సీమాంధ్ర ప్రగతిని కోరుకుంటే తెలంగాణ నాయకులు నోరు మెదపలేదు. తెలంగాణ వచ్చినా ఇంకా సీమాంధ్ర నేతలు కబంద హస్తాల చేతుల్లోనే వుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఉమ్మడి రాజధాని పేరుతో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల సమయంలో వస్తూ వెళ్తూ వుంటారు. ఒక్కసారి ప్రజలు కాంగ్రెస్ మీద జాలి పడితే, పీల్చుకుతింటారు. తెలంగాణను పిప్పి చేస్తారు..కేవిపి లాంటి వారి చేతిలో తెలంగాణ భవిష్యతును పెడతారు? ఇది సామాన్యులకు తెలియని విషయం.
అందుకే ఆనాటి గోసలు ఇక ఎప్పుడూ వద్దు. తెలంగాణలో కాంగ్రెస్ వద్దే వద్దు.
తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచేందుకు సాగుకు నీళ్లివ్వాలంటే ఎన్నో సాకులు చెప్పి, తప్పించుకున్న ఆనాటి పాలకులైన కాంగ్రెస్ నేతలుకు కాళేశ్వరం నీళ్లు కనిపించడం లేదా? కాళేశ్వరాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్‌నేతలు ఆనాడే ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? తెలంగాణ కోసం ఎందుకు ఆలోచించలేదు. ఆనాడే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఎందుకు దు:ఖపడేది. అసలు కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ సమాజం ముందు నిలబడే హక్కు అసలే లేదు. 2001లో తెలంగాణ డిక్లరేషన్ అంటూ ప్రకటించి, 2004 ఎన్నికల్లో ఆనాడు బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పదేళ్లు కాలయాపనచేసి, తెలంగాణను హరిగోస పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. ఆఖరకు తెలంగాణ ప్రకటన చేసి, వెనక్కి తీసుకొని తెలంగాణను అగ్ని గుండం చేసింది కాంగ్రెస్. ఇక తెలంగాణ ఇవ్వని పరిస్ధితి తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమాన్ని చూసి, తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సాధనలో తెలంగాణ కాంగ్రెస్‌నేతలు కృషి ఇసుమంతైనా లేదు. ఇక బిజేపి నాయకులు వంతు అసలే లేదు. కేసిఆర్ పండిరచిన పంట కుప్ప మీద పెత్తనం మాకు అన్నట్లు తెచ్చిన తెలంగాణలో పాలన కోసం రెండు పార్టీలు పగటి కలులు కంటున్నాయి. రెండు మూడు స్ధానాల కోసమే కొట్లాడుకుంటున్నాయి. ఆ స్దానాలు దాటి రాలేవు. బిఆర్‌ఎస్ ముందు ఆ రెండు పార్టీల కుప్పిగంతులు చెల్లవు.
తెలంగాణలో మోకాళ్ల యాత్ర చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాదు….
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి …
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జన గర్జన పేరుతో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి ఆయన పై నిప్పులు చెరిగారు.ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో మొదలుకొని 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక స్కాములకు కాంగ్రెస్ పార్టీ నిలయమని అది ముందు మీరు గుర్తుంచుకోవాలని సూచించారు. 2018 ఎలక్షన్లలో రైతులకు 2లక్షల రుణ మాపి అన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తామని హామీలు ఇచ్చిన అవి ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో ప్రజల చెంతకు పాలనను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగముందే దర్కాస్తు ఖాని , ధర్నా కానీ చెయ్యక ముందే దివ్యంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసే ప్రభుత్వము బిఆర్ఎస్. అసలు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోసపూరిత హామీలు ఇస్తున్న మీ మాటలు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తా అన్న తీరుగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకున్నా 200 నుండి 4000 వరకు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ ఆచరణకు నోచుకోేని మీ హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ సభలో మీరు మాట్లాడిన బిజెపికి బి టీమ్ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారని అసలు మీ చేతగానితనం వల్లనే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని,మొన్న నేషనల్ హేరాల్డ్ కేసులో ఐ.టి, ఈడి,సీబీఐ విచారణ ఎందుకు ఆగింది? జైల్లో ఉండాల్సిన మీకు మీ తల్లిగారికి బిజెపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, నరేంద్రమోదీ దయా దక్షిణ్యాల మీద మీరు దేశంలో పర్యటిస్తున్న విషయం ప్రజలకు తెలవదా, అసలు బిజెపికి ఏ టీం, బీ టీం రెండు కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో మీరు ఉన్నారని, రాష్ట్రంలో మీరు మోకాళ్ల యాత్ర చేపట్టిన అమలు కానీ హామీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారని అన్నారు.
తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖమ్మం నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీనే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు లక్షల మందితో జనగర్జన సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భట్టి విక్రమార్క భరత వాక్యం పలికాడని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్రమార్క తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించడానికి వేదికగా నిలిచింది.
ఇప్పటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వతంత్ర తెలంగాణ రాజకీయాలకు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా భట్టి పాదయాత్రతో కాంగ్రేస్ మేనియా మొదలైంది. తాజాగా ఖమ్మం నగరంలో తలపెట్టిన జనగర్జన సభతో భట్టి విక్రమార్క నామస్మరణం హోరెత్తుతున్నది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు.
పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల సర్కిల్ హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.
`కోట్ల విజయభాస్కరరెడ్డి ఏ పదవులు చేపట్టారో తెలుసా?
` ఎంతో తెలిసినట్లు బిల్డప్పు యాంకర్లు?
` ప్రశ్నించే ముందు చరిత్ర తెలుసుకోవాలి.
`ఒక మంత్రిని ఇంటర్వూ చేసినప్పుడు చరిత్రను వక్రీకరించొద్దు!
`చరిత్రకు మరకలంటించొద్దు!
`చరిత్రపై అవగాహన లేని జర్నలిస్టుల వల్ల సమాజానికి చాలా నష్టం!
` ఇటీవల మంత్రి కేటిఆర్ ఇంటర్వూలో యాంకర్ తప్పుడు ప్రశ్నలు?
` కోట్ల విజయభాస్కరరెడ్డి రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి?
`అడిగే ముందు కనీస అవగాహన ఎంతో ముఖ్యం?
` తొలుత1982 నుంచి 83 వరకు, తర్వాత 1992 నుంచి 1994 వరకు సిఎం గా పని చేశారు.
`అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ మంత్రి రాజీనామా చేయలేదు?
`నేదుమల్లి జనార్ధన రెడ్డి ఇంజనీరింగ్ , మెడికల్ సీట్ల విషయం ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి!
` ఎక్సైజ్ కాంట్రాక్టులు మంత్రులకు కేటాయింపులు సిఎం కు ముడుపులు అందినట్లు పెద్ద ఎత్తున ఆరోణలు చేశారు.
`దాంతో నేదురుమల్లి జనార్ధనరెడ్డి రాజీనామా చేయడం జరిగింది?
`చరిత్ర తెలియక తెలంగాణ సమాజాన్ని తప్పు తోవ పట్టించే ప్రయత్నం?
`ఇంకా తెలంగాణపై విషం చిమ్మడం వారి అతి తెలివికి నిదర్శనం?
హైదరబాద్,నేటిధాత్రి:
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా…అని అన్నట్లు…న్యూస్ ఛానళ్ల యాంకర్లకు నోరుంటే చాలు..ఆంధ్రా అయితే చాలు..ఈ రెండు క్వాలిఫికేషన్లు వుంటే చాలు. రాజకీయాలు అవసరంలేదు. చరిత్ర మీద అవగహన వుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అదే సాగుతోంది. తెలంగాణ మీద ఇప్పటికీ ఎలా విషం చిమ్మాలో ప్రయత్నం కొనసాగుతూనే వుంటుంది. తాము చెప్పిందే నిజమనట్టు నమ్మించడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఆనాడైనా, ఇప్పుడైనా తెలంగాణ సమాజానికి శాపంగా పరిణమించింది. నాలుకను రెండు సార్లు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు సూచించారు. ఒకటి తినేటప్పుడు, రెండోది మాట్లాడేటప్పుడు. రెండోది ఆంద్రా యాంకర్లకు అవసరం లేదన్నట్లుగా మారిపోయింది. నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం మళ్లీ మొదలుపెట్టారు. గతంలో 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఇలాగే తమ నోటి నుంచి వచ్చిందే మాట…మేం చూపిందే బాట…అన్నట్లు బరితెగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రనిధులను అవమానపర్చి, తెలంగాణలో బాయ్‌కాట్‌కు గురైన ఛానల్ అది. అయినా దానిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే అలాంటి ఛానళ్లలో ఎంత మేదావులైనా తెలంగాణ వారికి అందలం వుండదు. గుర్తింపు కనిపించదు. కాని ఆంధ్రా అయితే చాలు..అక్షరం సరిగ్గా రాకున్నా ఫరవాలేదు. అక్షరం సక్కగ తెలియకుడా ఫరావాలేదు. చరిత్ర అంతకన్నా అవసరం లేదు. మాకున్న తెలివి తెలంగాణ వారికి వుండదన్న అహంబావం ఇంకా వారిలో వున్నట్లుంది. అందుకే ఇంకా అతి తెలివితేటలను ప్రదిర్శిస్తూనే వున్నారు. అక్షర పరిజ్ఞానం లేకపోయినా, నాలుక సామార్ధ్యం మీద ఆధారపడి కాలం వెల్లబుచ్చడం, అదే గొప్ప అనంతగా భావించడం ఆది నుంచీ వారికి అలవాటే…తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో తెలిసి కూడా వారి అతి తెలివి ప్రదర్శన ఆపడం లేదు.
తాజాగా రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఓ ఛానల్ యాంకర్ గతంలో మంత్రులు రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు.
ఎవరు రాజీనామా చేశారు? అంటూ మంత్రి కేటిఆర్ సదరు యాంకర్‌ను ప్రశ్నిస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి అన్నారు. నిజానికి మంత్రి ఆ సమయంలో కొద్దిగా ఆలోచిస్తే ఆ యంకర్ పరువు అక్కడే పోయేది. కాని ఆ సమయంలో మంత్రి కేటిఆర్‌కు గుర్తుకు రాకపోవచ్చు. అంతే కాని మంత్రికి తెలియని విషయాన్ని తాను చెప్పినట్లు సదరు యాంకర్ ఏదో సాధించినంతగా నేను నిరూపించాన్నంత గర్వం చూపించారు. చరిత్ర మీద, తెలుగు రాజకీయాల మీద కనీసం అవగాహన లేని ఆ యాంకర్ అడిగిన ప్రశ్నే తప్పు. అందుకు మళ్లీ తానే చెప్పిన సమాధానం శుద్ద తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. కాని ఏనాడు వాటిపై చర్యలు లేవు. ఎందుకంటే బోర్డులో వుండేవారు చేసే తప్పుడు పనులవి. ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నట్లు మంత్రి కేటిఆర్‌కే పాఠాలు చెప్పినట్లు ముఖ కవలికలు మార్చాడు. తనకు తెలియనిది అబద్దమైన విషయం చెప్పడం ఆ యాంకర్ అతి తెలివికి నిదర్శనం. ఉమ్మడిరాష్ట్రంలో ఓ సందర్భంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఏకంగా ఓ జపాన్‌ను చెందిన ఓ బోగస్ కంపనీకి రూ.3కోట్లు చెల్లించడం జరిగింది. ఆ సమయంలో స్వయంగా మంత్రి బొత్స పోనాయ్..ఏటి సేత్తాం..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా ఏ ఒక్క ఛానల్ మాట్లాడలేదు. కాని ఇప్పుడు ఓ ఆంద్రా చరిత్రను పుక్కిట పట్టుకున్నట్టు నోటికి ఏది వస్తే అది చెప్పి ఆ యాంకర్ జర్నలిజం పరువు తీశాడు.
కోట్ల విజయభాస్కర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కేర్రదంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారంలోకి రావడానికి ముందు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు. అదేంటో గాని మళ్లీ 1994 లో కూడా ఆయనే సిఎంగా వున్నారు. రెండుసార్లు ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీకి అధికారం అందించారు. అలాంటప్పుడు పేపర్ల లీకేజీ ఎక్కడిది. ఆయన రాజీనామా చేసిందెక్కడ? అసలు ఆ యాంకర్‌కు తెలిసినచరిత్రేమిటి? సరే..ఇదిలా వుంటే 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురు మల్లి జనార్ధనరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కనీసం అది తెలుసా? ఆ రోజుల్లో ఇంజనీరింగ్ ,మెడికల్ ప్రైవేటు కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం కల్పించాడు. అది చట్ట విరుద్దం. నేరం కూడా..? అలాంటి కాలేజీలు వసూలు చేసిన ఫీజుల్లో వాటాలుతీసుకున్నాడని నేదురుమల్లి మీద పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయా కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. పేద విద్యార్ధులకు ఇంజనీరింగ్, వైద్య విద్యను దూరం చేశారు. అంతే కాదు ఆ రోజుల్లో రూ.5లక్షలు ఒక్క సీటు కోసం క్యాపిటేషన్ ఫీజు అంటే పెద్ద అమౌంట్. అంతలా అవినీతికి పాల్పడడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు, నాటి కాంగ్రెస్ నేతలు కూడా నేదురుమల్లి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా అప్పటి మంత్రులకు ఎక్జైజ్ కు చెందిన టెండర్లు అలాట్‌మెంటులో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది అప్పడు అభియోగం. దానితోపాటు ఆ కాలేజీలన్నీ ఇలా ఎక్జైజ్ వ్యాపారులైన మంత్రులకే కేటాయించారు. ఇలా విద్యావ్యవస్ధను భ్రష్టుపట్టించిన చరిత్ర ఆంధ్ర పాలకులది. ముఖ్యమంత్రి స్ధానంలో వుండి నేదురుమల్లి తన బంధువుల అమ్మాయికి మెడికల్ సీటు ఇప్పించారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్ అధిష్టానం నేదురమల్లిని అధికారంలో నుంచి దింపేసి, కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ అసలు చరిత్ర. ఇది కాకుండా 1985లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఓ పదో తరగతి పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగాయి. ప్రత్యక్షంగా అప్పటిమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమేయం వుందన్న వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అంతే కాకుండా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రాంతంనుంచి వచ్చిన వారికి తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పెద్దఎత్తున ఎలాంటి పరీక్షలు లేకుండానే లెక్చరర్లుగా ఉద్యోగ నియామాకాలు చేశారు. అది అప్పట్లో వివాదమైంది. దాంతో మంత్రిగా వున్న గాలిముద్దుకృష్ణమ నాయుడు రాజీనామా చేశాడు. కాని ఎన్టీఆర్ ఒప్పుకోకుండా కొంత కాలానికి విద్యాశాఖను మార్చి అటవీ శాఖను అప్పగించారు. ఇదీ అప్పట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఇలాంటి అన్యాయాల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమం మొదలుపెట్టింది. ఆనాడు నోరు మెదపని సీమాంద్ర మీడియా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని , వికాసవంతమైన తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికైనా మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పే ఆంధ్రా ఛానళ్ల మాటలు నిజాలు ఎప్పుడూ కావు. విలువలు లేని వ్యక్తులు జర్నలిజంలో చేరి సమాజాన్నే తప్పుదోవ పట్టించడం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వున్న పార్టీలు కూడా ప్రభుత్వం మీద సీమాంధ్ర మీడియాచేసే అసత్యాలను బాధ్యత కల్గిన తెలంగాణ పార్టీలు కూడా వ్యతిరేకించాలి.
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.
అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. నేతలను ఏకం చేసింది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతో, భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.
అటు బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పు పైన డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సమయంలోనే ఖమ్మం సభకు అధికార బీఆర్ఎస్ అవాంతరాలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. సభకు ముందు బస్సులు ఇవ్వటానికి అంగీకరించిన ఆర్టీసీ..
ఆ తరువాత నో చెబుతోంది. మంత్రుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లేని చెక్ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభ – భట్టి విక్రమార్క యాత్ర – రాహుల్ రాక – నేతల చేరికలు పైన ప్రగతి భవన్ లో చర్చలు సాగుతున్నాయి. నిఘా నివేదికల పైన తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
` 65 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దిగుబడి ఎలా సాధ్యమౌతోంది?
` కొత్తగా ఎనభై లక్షల ఎకరాల సాగు పెరగలేదా?
` తెలంగాణలో పారుతున్న కాలువలు కనిపచడం లేదా?
` పచ్చని పొలాలు నిజం కాదా?
` చెరువుల్లో మత్స్య సంపద చూడడం లేదా?
` తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి కావడం లేదా?
` ఇరవై నాలుగు గంటల కరంటు అందడం లేదా?
` భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ పారిపోలేదా?
హైదరబాద్,నేటిధాత్రి:
నిజం చెప్పడానికి దమ్ముండాలి. ధైర్యముండాలి. అబద్దం చెప్పడానికి ఇవేవీ అవసరం లేదు. నోరుంటే చాలు. మోసపూరితమైన మనసుంటే చాలు. మభ్యపెట్టే గుణముంటే చాలు. కాని నిజం మాట్లాడాలంటే కూడా మంచి తనం వుండాలి. మంచి గుణం కూడా కావాలి. అవేవీ ప్రతిపక్షాలలో లేవు. ప్రతిపక్షాలు నిజాలు చూడలేవు. నిజాలు వినలేవు. నిజాలు మాట్లాడలేవు. దేశమంతా తెలంగాణ వెలుగులను చూసి ఆశ్యర్యపోతోంది. సంబరపడుతోంది. తొమ్మిదేళ్లలో జరిగిన సర్వతోముఖాభివృద్దిని చూసి అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా అభివృద్ది చెందితే బాగుండు అని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. ప్రతిపక్షాలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నా చూడలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కావడం వాళ్లకు గిట్టడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో వుండాలి. కష్టాలలో వుండాలి. అనే కోరుకుంటున్నాయి. తెలంగాణ బాగు పడుతుంటే కాంగ్రెస్, బిజేపి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. మాకు ఇక భవిష్యత్తులో అధికారం రాదన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిత్యం పనికి రాని వాదనలు ముందేసుకుంటున్నారు. అసలు సమస్యలు పక్కదోవ పట్టిస్తూ, పొద్దుపుచ్చకుంటున్నారు. అదికారం కోసూం గోతి కాడ ఎదరుచూసినట్లు చూస్తున్నారు. ప్రజలు బాగు పడుతుంటే చూడలేకపోతున్నారు. ప్రజలు గతంలో పడిన గోసను గుర్తు చేసుకొని, ఇప్పుడు తెలంగాణ అభివృద్దిని చూసి మురిసిపోతుంటే, ప్రతిపక్షాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఇంత సత్వర తెలంగాణ అభివృద్ది ప్రతిపక్షాలకు కళ్ల కనిపించడం లేదా? తెలంగాణలో ప్రతి మూలలో పారుతున్న నీళ్లు కనిపించడంలేదా? ఒకనాడు ఎండిన బీడులన్నీ పొలాలుగా మారి సిరుల పంటలు పండిస్తుంటే కనిపించడం లేదా? తెలంగాణలో వెల్లివిరిస్తున్న పచ్చదనం కనిపించడం లేదా? భూగర్భజలాలు పెరిగి, అటు చెరువులు నిండి, బావులు, బోర్లలో ఎండ కాలంలో కూడా పొలాలకు నీళ్లందుతుంటే కనిపించడం లేదా? ప్రతిపక్షాలలో రైతులు లేరా? వాళ్లకు పొలాలు లేవా? ఆయా పార్టీల నాయకులు సాగు చేయడం లేదా? రైతు బంధు పొందడం లేదా? ఒకనాడు పడావు బడ్డ భూములన్నీ కళకళలాడం లేదా? సాగు మా వల్ల కాదని, ఊళ్లలో వుంటే బతకలేమని పదుల ఎకరాలు వున్న రైతులు కూడా పట్టణాలకు వలసలు పోయిన బతికిన రోజులు గుర్తులేదా? ఆనాడు వలసలు పోయిన ప్రజలు మళ్లీ పల్లెలు బంగారు పంటలు పండిస్తూ, రైతే రాజు అన్న నానుడిని నిజం చేయడం లేదా? తెలంగాణ రైతన్న కాలు మీద కాలేసుకొని బతకడం లేదా? ఆఖరుకు అకాల వర్షాలకు ధాన్యం తడిసినా, ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం ఎప్పుడైనా చూశామా? ఇన్ని మంచి పనులు మన కళ్లముందు కనిపిస్తుంటే కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలను ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ కళ్లలో వున్న కుళ్లును కాళేశ్వరం నీళ్లతో కడుక్కొని పారుతున్న తెలంగాణ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడమని వారి నోళ్లు శుభ్రం చేసుకోవాలి. వారిలో అణువణువూ ఆహించిన అహాన్ని ఆ నీటిని తాగి పోగొట్టుకోవాలి. పారుతున్న జలంలో చేస్తున్న నిందలు వదిలేసి, ఒళ్లంతా కడుక్కోవాలి. తప్పైందని లేంపలేసుకోవాలి. తెలంగాణలో నీటి సిరులకు కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎవరైనా జేజేలు పలకాలంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ అభివృద్ధి విశేషాలు… ఆయన మాటల్లోనే…
అసలు కలగన్నామా? తెలంగాణ వస్తుందని ఊహించామా? అరవైఏళ్ల నిర్లక్ష్యాన్ని అనుభవించాం.
నీరు లేకున్నా కన్నీళ్ల సాగు చేశాం. కరంటు లేక పంటలు ఎండుతున్నా కన్నీళ్లను దిగమింగుకున్నాం. ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని కరంటుకు చార్జీలు చెల్లించాం. ఎప్పటికిప్పుడు ఎంత పెంచినా, నోరు మెదపకుండా బిల్లులు కట్టుకున్నాం. ఎండిన పంటలు చూసి కుమిలి ఏడ్చాం. ఆ గోసలన్నీ పోయాయి. ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణను అభివృద్ధి నమూనాగా మార్చిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ గోస చూసి చలించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చి గోస తీర్చిన నాయకుడు కేసిఆర్. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా..ఇదే సత్యం…ఇదే నిత్యం..అసలు పదేళ్ల కిందట తెలంగాణ ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? అన్నది ప్రతిపక్షాలకు తెలియందా? సరిగ్గా 2014లో తెలంగాణ వచ్చే నాటికి పండిన పంటలకు, ఇప్పుడు పండుతున్న పంటలు ఎన్ని రెట్లు పెరిగాయో! ప్రతిపక్షాలు చూడడం లేదా? ఆనాడు పండిన పంటలకు 70లక్షల టన్నులు మాత్రమే. మరి నేడు 3కోట్ల టన్నులకు పైగా వరి పండుతోంది. దానికి తోడు ఆరు తడి పంటలు పండుతున్నాయి. మొక్క జొన్న పండుతోంది. పప్పు దినుసలు పండుతున్నాయి. ఫామ్ ఆయిల్ సాగౌతోంది. ఇవన్నీ నీటి వసతులు కల్పించడం మూలంగా పంటలు సాగౌతున్నాయా? లేదా? అన్నది ప్రతిపక్షాలకు తెలియదా? ప్రతిపక్షాల నాయకులు రైతు బంధు తీసుకోవడం లేదా? నీటి సౌలత్ అందుకోవడం లేదా? వాళ్ల ఊర్లలో చెరువులు నిండిరది కనిపించడం లేదా? వాల్ల పొలాలకు నీళ్లు రాకుండానే సాగు చేస్తున్నారా? వాళ్ల ఊరి చెరువులో గతంలో నీటి చుక్క జాడ లేని రోజులే ఎక్కువ. అందులోనూ కాంగ్రెస్‌పార్టీ నేతలదే పాలన. మరి అప్పుడు చెరువుల్లో నీళ్లెందుకు లేవు?నేడు చెరువుల నిండా నీళ్లెందుకున్నాయి. ఆ చెరువుల్లో ఎప్పుడైనా చేపలు చూసిన చరిత్ర వుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపదనను తెలంగాణ ఎందుకు మించిపోయింది? ఒకప్పుడు తెలంగాణకు ఆంధ్రనుంచి చేపలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేపలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో సంపద సృష్టి ప్రతిపక్షాలకు కనిపించదు. పెరిగిన మత్స్య సంపద చూడలేరు. కాని ఇంటికి కొనుక్కెళ్లి తింటున్నారు. ఇదీ ప్రతిపక్షాల తీరు.
ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పధకం కాళేశ్వరం.
ఇది మొత్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంచే నిర్మాణం చేయబడిన ప్రాజెక్టు. కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా, రూపాయి సాయం చేయలేదు. పైగా తెలంగాణ రావడమే ఇష్టంలేని ప్రధాని మోడీ, తెలంగాణకు సాయం చేస్తాడని ఆశించలేదు. తెలంగాణ అంటేనే కళ్లలో నిప్పులు పోసుకునే బిజేపి పెద్దలకు తెలంగాణ అభివృద్దిని కోరుకుంటారా? అసలు తెలంగాణను నిధుల విషయంలో అన్యాయం చేస్తూ వున్నా, తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడేలా చేసిన ఘనత ఒక్క కేసిఆర్‌కే దక్కుతుంది. చరిత్రలో కేసిఆర్ లాంటి నాయకుడు మరొకరు కనిపించరు. ఎందుకంటే తన పుట్టిన నేల రుణంతీర్చుకున్న నాయకుడు కేసిఆర్. అలాంటి యుగపురుషుడు, త్యాగధనుడు, ఉద్యమ కారుడు ప్రపంచ చరిత్రలోనే లేరు. అంత గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు పెడుతుంది. తొమ్మిదేళ్లలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఏ రంగంలో చూసినా అన్ని విజయాలే. చిగురించిన ఆశలను ఆశయ ఫలాలుగా మార్చి ప్రజలకు అందించిన గొప్ప దార్శనికుడు కేసిఆర్. అలాంటి కేసిఆర్ పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులుకోరు. అధికారంలో వున్న నాడు తెలంగాణ కోసం పట్టించుకోలని కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఆదరించరు. తెలంగాణకు సాయం చేసే స్ధానంలో వుండి కూడా తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ నిందిస్తూ, తెలంగాణపై విషయం కక్కుతూ, తెలంగాణలో పాలన కోసం అర్రులు చాచే బిజేపిని ప్రజలు ఎప్పుడూ దరి చేరనివ్వరు. ఆ పార్టీకి చోటే కల్పించరు. తెలంగాణ అంటే కేసిఆర్. కేసిఆర్ అంటే తెలంగాణ. తెలంగాణలో బిఆర్‌ఎస్ తప్ప మరోపార్టీకి తావులేదు. ఆ పార్టీల జెండాలకు చోటు లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ నడిచిన భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పైన పర్యవేక్షణకు రంగంలోకి దిగారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ స్థాయి ఆదరణ తిరిగి దక్కుతుందని పార్టీ ముఖ్యులే అంచనా వేయలేదు. పార్టీ కోసం భట్టి చొరవ తీసుకొని పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రభత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో మమేకం అయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం అవసరమని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలంతా ఒక్కటయ్యారు. ఈ ఐక్యత, ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో భట్టి విక్రమర్కను సన్మానించనున్నారు.ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం, కాంగ్రెస్ పై ప్రజల ఆదరణ, కార్యకర్తల్లో జోష్, ఇవన్ని పెరగటం చూసిన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి.ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ నిర్వహణపైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణ పైన చర్చించారు.
అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జన గా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ గాంధీ వస్తుండటంతో మొదట టీపీసీసీ అధ్యక్షుడిగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కానీ మారుతున్న పరిణామాలు, నేరుగా రాహుల్ టీమ్ సభ పైన ఫోకస్ చేయటం, సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్ల పై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000000)
క్వీన్ ఆఫ్ పాప్’గా ప్రఖ్యాతిగాంచిన మడోన్నా (64) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం తన ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను వ్యక్తిగత సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
మడోన్నా ఆరోగ్య పరిస్థితిపై ఆమె వ్యక్తిగత సహయకుడు ఒసారీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘గత శనివారం మడోన్నా ఇంట్లో అచేతన స్థితిలో పడి ఉన్నారు. దీంతో ఆమెను న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం మడోన్నా ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నా, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది’ అని అన్నారు.
64 ఏళ్ల మడోన్నా జులై 15 నుంచి కెనడాలోని వాంకోవర్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని షెడ్యూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఒసారీ తెలిపారు. మరోవైపు, మడోన్నా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మ్యూజిక్ ప్రపంచంలో పాప్‌స్టార్‌గా చెరగని ముద్రవేసిన ఆమెకు అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అత్యధిక ఆల్బమ్స్ విక్రయమైన సింగర్స్ జాబితాలో మడోన్నా టాప్‌లో నిలిచారు. గాయనిగానే కాకుండా పలు సినిమాల్లోనూ ఆమె అలరించారు.
నేటిధాత్రి న్యూఢిల్లీ.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఖరారైంది. జూలై 8న వరంగల్ జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
ఈ మేరకు ప్రధాని టూరు కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు..
అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.*
రాష్ట్ర బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు 8న హైదరాబాద్లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.
ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్కు పునర్జీవం అయిం ది. కొత్త చరిత్రకు శ్రీకారం
చుట్టిం ది. ఉద్య మాన్ని తలపిం చేలా పీపుల్స్ మార్చ్ సాగిం చిన పోరాట
యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుం ది.
భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారిం ది. కేడర్ లో జోష్
పెం చిం ది. ఎన్ని కల వేళ సమరానానికి సైన్యం లో పోరాట కసిని పెం చిం ది.
దీనిని గుర్తిం చిన హైకమాం డ్ భట్టికి అరుదైన గౌరవం అం దిస్తోం ది. ఖమ్మం
గడ్డపైన లక్షలాది మం ది కార్య కర్తల సమక్షం లో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
పార్టీ తరపున సత్క రిం చనున్నా రు. ఇదే సభలో ముఖ్య నేతల
చేరికలు…తెలం గాణ భవిష్య త్ పై భరోసా ఇస్తూ ఎన్ని కల సమరశం ఖం
పూరిం చేం దుకు ఖమ్మం జనగర్జన వేదికగా నిలవనుం ది.
ఒక్క తెలం గాణలోనే కాదు…కాం గ్రెస్ పార్టీలో గల్లీ నుం చి ఢిల్లీ వరకు వినిపిస్తున్న
పేరు మల్లు భట్టి విక్రమార్క . దక్షిణాదిని కర్ణాటక తరువాత కాం గ్రెస్ నాయకత్వం
ఫోకస్ చేసిన రాష్ట్రం తెలం గాణ. తెలం గాణ ఇచ్చిన రాష్ట్రం గా కాం గ్రెస్ క
అధికారం దక్కా లి…రాహుల్ ప్రధాని కావాలి. ఈ రెం డు అం శాలే లక్ష్యం గా
బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్య తిరేక నిర్ణయాల పై ప్రజల మధ్య నుం చే భట్టి
నిలదీసారు. వారికి అం డగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం
అయ్యా రు. ఎన్ని ఇబ్బం దులు వచ్చినా..అనారోగ్య సమస్య లు తలెత్తినా వెనుకడుగు
వేయలేదు. ఈ యాత్రతో నేతలం దరు ఏకం అయ్యా రు. కాం గ్రెస్ శ్రేణులు తరలి
వచ్చారు. అగ్ర నేతలు సం ఘీభావం ప్రకటిం చారు. ప్రజలు మద్దతుగా నిలిచారు.
అం దుకే ఇప్పు డు భట్టి పీపుల్స్ మార్చ్ కు ఇం త పాపులారిటీ వచ్చిం ది.
భట్టి యాత్ర ద్వా రా తెలం గాణ కాం గ్రెస్ లో వచ్చిన మార్పు ను హైకమాం డ్
గుర్తిం చిం ది. దీం తో భట్టి యాత్రకు సరైన గుర్తిం పు ఇవ్వా లని నిర్ణయిం చిం ది.
ఇదే సమయం లో పార్టీలో ముఖ్యు ల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నా లు
సఫలం అయ్యా యి. అన్నిం టికీ సరైన వేదిక ఖమ్మం గా నిర్ణయిం చారు. ఇక్క డ
నుం చే పార్టీ నేత రాహుల్ గాం ధీ తెలం గాణ పైన తమకున్న అభిమానం
చాటుతూ..భవిష్య త్ లో ఏ విధం గా తెలం గాణ కోసం ఎటువం టి నిర్ణయాలు
అమలు చేసేది ప్రకటిం చనున్నా రు. ఇక్క డ నుం చే బీఆర్ఎస్ ప్రభుత్వం పై
గర్జనకు సిద్ధమయ్యా రు. ఈ సభకు జనగర్జనగా పేరు ఖరారు చేసారు.
సీఎల్పీ నేత భట్టితో తాజాగా పార్టీ రాష్ట్ర వ్య వహారాల ఇం ఛార్జ్ థాక్రే
సమావేశమయ్యా రు, ఖమ్మం సభ ఏర్పా ట్ల పైన చర్చిం చారు. పార్టీలో చేరనున్న
మాజీ ఎం పీ పొం గులేటిని సమావేశానికి ఆహ్వా నిం చారు. ఖమ్మం సభ వం ద
ఎకరాల్లో నిర్వ హిం చేలా కసరత్తు ప్రారం భిం చారు. భట్టి చారిత్రాత్మ క యాత్ర
ముగిం పు సభగా.. పొం గులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వ హిం చేం దుకు
నిర్ణయిం చారు. ఈ సభ ద్వా రా కాం గ్రెస్ అధికారం లోకి వస్తూనే దగా పడిన
తెలం గాణ ప్రజల కోసం ఏం చేయనుం దో స్ప ష్టత ఇవ్వ నున్నా రు. ఖమ్మం సభకు
రాష్ట్ర వ్యా ప్తం గా కాం గ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నా రు. కాం గ్రెస్ ప్రభం జనం ఖమ్మం
నుం చే మొదలు కానుం ది. కర్ణాటక ఎన్ని కల్లో విజయం తరువాత ఇప్పు డ
కాం గ్రెస్ వరుస నిర్ణయాలతో దేశ వ్యా ప్తం గా అం దరి చూపు ఖమ్మం జనగర్జన
సభ వైపే చూస్తోం ది. ఈ సభ కోసం ఏర్పా ట్లు ప్రతిష్ఠాత్మ కం గా జరుగుతున్నా యి.
` ఆ నలుగురు కుటుంబ సభ్యులే కాదు.. తెలంగాణ పోరాట వీరులు … ఉద్యమ సైనికులు.
` అపుడువాళ్లే …ఇప్పుడూ వాళ్లే!?
` వాళ్లు వారసులు కాదు..ఉద్యమ బాధ్యులు.
` పోరాట యోధులు..తెలంగాణ రక్షకులు.
`ఆనాడు తెలంగాణ అన్యాయం కాకుండా చూశారు.
` ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
` ప్రగతిలో తెలంగాణ ను ఉన్నతంగా నిలబెడుతున్నారు.
` మూడు పదుల వయసులో జీవితం ఉద్యమానికి అంకితం చేశారు.
`దశాబ్ద కాలం తెలంగాణ పోరాటం చేశారు.
`ఉన్నత ఉద్యోగాలు వదిలి తెలంగాణ కోసం కొట్లాడారు.
` విలాస వంతమైన జీవితాలు కాదనుకొని తెలంగాణ పోరాటం చేశారు.
` ఏ బిజేపి నాయకుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు.
` ఏ కాంగ్రెస్ నాయకుడి వారసులు పోరాటం చేయలేదు.
` కేసిఆర్ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి రాలేదు?
` కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యమ అడుగుల వేశారు?
`ఆనాడు ఏ నాయకుడు మేమున్నామని అడుగులు వేయలేదు?
`హేళన చేశారు… రాజకీయ స్వార్థమన్నారు?
` ఇప్పుడు కుటుంబ పాలనంటున్నారు?
`తెలంగాణ తెచ్చేనాడు ఎవరూ కలిసి రాలేదు?
`ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరూ తెలంగాణ కోసం కదిలిన వాళ్లు కాదు?
`బిజేపి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు?
` బిజేపి ఏ నాయకుడిది కేసిఆర్ స్థాయి కాదు?
` కేసిఆర్ రాజకీయాలతో ఎదిగిన నాయకుడు కాదు?
` తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు.
` కొట్లాడి తెలంగాణ తెచ్చిన యుగపురుడు.
`తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడు.
`కేసిఆర్ తో పోల్చుకునే స్థాయి బిజేపి లో ఒక్కరికి కూడా లేదు?
`తెలంగాణ కోసం కొట్లాడిన నాడు అదే కుటుంబం…
` ఇప్పుడు తెలంగాణకు వన్నె తెచ్చింది అదే కుటుంబం.
` తెలంగాణ లో కుటుంబ పాలన కాదు.
` నరం లేని ప్రతిపక్షాల నాలుకల మాటలు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు.
` తెలంగాణ పాలించే అర్హత బిజేపి కి అసలే లేదు.
`తెలంగాణ ప్రజలు బిజేపిని ఆదరించరు.
` బిజేపి మాయ మాటలు ఎవరూ నమ్మరు.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో వున్నది కేసిఆర్ కుటుబ పాలన కాదు.. ప్రజా పాలన. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల వసుదైక పాలన. తెలంగాణలో కేసిఆర్ కుటుంబం బాగుపడిరదన్న మాటలు మాట్లాడడం అందరూ అలవాటు చేసుకున్నారు. వారితో పాటు కుటుంబ పాలన అంటూ ఇటీవల ప్రధాని మోడీ కూడా మాట్లాడడం విడ్డూరంగా వుంది. కుటుంబ పాలన అనేది ఎక్కడైనా వర్తిస్తుందేమో కాని తెలంగాణలో కాదు. ఎదుకంటే తెలంగాణ స్వయంగా ఏర్పాటైన రాష్ట్రం కాదు. అరవైఏళ్లపాటు ఇతర ప్రాంతాల పెత్తనం కింత నలిగిన ప్రాంతం. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా వున్న ప్రాంతాన్ని సీమాంధ్రతో కలిపిన ప్రాంతం. ఆ ఉమ్మడి రాష్ట్రం నుంచి అరవైఏళ్ల పాటు అస్ధిత్వంకోసం పోరాటం చేసిన ప్రాంతం. అయినా తెలంగాణ సాధన జరగక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పొందలేక, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడలేక, నాటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. అప్పుడు గతంలో ఏనాయకుడు చేయనంత సుధీర్ఘమైన పోరాటం చేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ కోసం కేసిఆర్ తన ప్రయాణం మొదలు పెట్టిన నాడు ఎవరూ కలిసి వచ్చిన వారు కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ సభ్యులే కొందరు ఆయనతో అడుగులు వేశారు. కాని ఏ ఒక్క బిజేపి నాయకుడు ఆనాడు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమం చేపట్టలేదు. తెలంగాణ వాదాన్ని పిడివాదమంటూ హేళన చేసింది కూడా బిజేపి నేతలే అన్నది మర్చిపోవద్దు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి నేతల కేసిఆర్ తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు రాజకీయ స్వార్ధం అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసిఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నాడన్నారు. అయినా ఎవరు ఎన్ని రకాలా మాటలు మాట్లాడినా అన్నింటినీ దిగమింగుకొని తెలంగాణ ఉద్యమం సాగించిన నాయకుడు కేసిఆర్. ఆయనకు తోడుగా వచ్చి కుటుంబం మొత్తం తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఒక్క కేసిఆర్ కుటుంబానిదే. అమెరికాల విలాసవంతమైన జీవితాలు. లక్షల్లో జీతాలు వదులుకున్నారు. జీవితం సంతోషంగా గడపాల్సిన నిండా మూడు పదులు వయసులేని సమయంలో తెలంగాణ కోసం అమెరికానుంచి వచ్చిన నాయకుడు కేటిఆర్. కవిత కూడా అంతే. భూతల స్వర్గంగా చెప్పుకునే అమెరికాలో జీవితం వదులుకొని, ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడుతుంటే, నేనేందుకు కొట్లాడొద్దు అని వచ్చిన ఆడపడుచు కవిత. తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ వికాసం కోసం, తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమం చేసిన బతుకమ్మ కవిత. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మమేకమైన నాయకుడు హరీష్‌రావు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌తో పాటు ఉద్యమంలో బాగస్వామ్యమైన నాయకుడు సంతోష్‌రావు. వీళ్లెవరు తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌లోకి రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు అందుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన పోరాట యోధులు. అంతే కాదు ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ది పెద్ద కుటుంబం. అయినా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ నలుగురు తప్ప ఉద్యమంలో కీలకం కాని ఏ బంధువునూ ప్రభుత్వంలో బాగస్వాములను చేయలేదు. ఇదీ కేసిఆర్ నిబద్దత. అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అనే అర్హత బిజేపి నేతలు ఎవరికీ లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కనీసం జై కొట్టని పార్టీకి ప్రశ్నించే అర్హత లేదు. అసలు బిజేపికి తెలంగాణలో చోటే లేదు.
ఒక్కసారి జన బాహుళ్యంలోకి రండి…తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో చూడండి…వారినే నేరుగా అడగండి…వారు చెప్పింది వినండి…అంతే కాని ఏనాడైనా బిజేపి జాతీయ నాయకత్వం ప్రజలతో మమేకమైన సందర్భం వుందా?
ఎంత సేపు డిల్లీనుంచి రావడం..నాయకులు చెప్పింది వినడం. అంతే కాని నాయకులతో, కార్యకర్తలో కలిసి మాట్లాడిన సందర్భం వుందా? మాట్లాడినట్లు చరిత్ర వుందా? లేదు. కాని మేం చెపిందే నిజం…అనుకునే భ్రమలో వున్న బిజేపి ప్రజలను మాయ చేయాలని చూస్తే ఇంకా చెల్లదు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. కనీసం మీకు మీరుగా తెలంగాణలో ఏం జరుగుతోందన్నదానిని తెలుసుకోలేకపోయినా, కనీసం కొంతమంది మేధావులు, ఇతర రాజకీయ నాయకులు చెబుతున్న మాటలైనా వినండి. అప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా పురోగమిస్తోందో..తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏం చెప్పాడో వినండి. కనీసం అలా అయినా తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ది చెందిందో తెలుస్తుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో నాలుగు ఎకరాలు కొనుగోలు చేసే పరిస్ధితి వుండేది. కాని ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 50 నుంచి 100 ఎకరాలే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు అని సాక్ష్యాత్తు నారా చంద్రబాబు నాయుడు అన్నారంటే తెలంగాణలో భూములకు ఎంత డిమాండ్ ఏర్పడిరదో అర్ధమౌతుంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతాన్ని తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారు. ఆశ్యర్యపోతున్నారు. తెలంగాణలో వుండడానికే ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎందుకు తెలంగాణ నుంచి విడిపోయామా? అని మధనపడుతున్నారు. ఇక మరో నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణకు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల్లో కీలకమైన నాయకుడు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, సమైక్యాంధ్రకోసం ఎంతో చేసిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణ వస్తే జనజీవనం అస్తవ్యవస్ధమౌతుందని చెప్పిన నాయకుడు. తెలంగాణ కరువుతో అల్లాడుతుందన్నారు. ఆకలి కేకలు వినిపిస్తాయన్నాడు. కరంటు వుండదన్నాడు. ఆంధ్రప్రదేశ్ తో కలిసి లేకుంటే తెలంగాణ మనుగడ సాధ్యం కాదన్నాడు. అంతే కాదు తాను కూడా దీక్ష చేయగలనని నిమ్స్‌లో చేరాడు. రకరకాల రాజకీయ విన్యాసాలు వేశాడు. ఆఖరుకు తెలంగాణ బిల్లు ఆమోదిస్తున్న సమయంలో లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చేసి, పార్లమెంటు పరవు తీశాడు. ఎంతకైనా తెగించి బిల్లు ఆపాలని ప్రయత్నించిన నాయకుడు లగడపాటి రాజగోపాల్. ఆయన కూడా తెలంగాణ ఇలా అభివృద్ది జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. సాగు నీరు లేని తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, రిజర్వాయర్లు కట్టడం, చెరువులు బాగు చేయడం, చెరువులు పునరుద్దరించడం, ఇరవై నాలుగు గంటలు కరంటు ఇవ్వడం , ఇంటింటికీ సురక్షితమైన మంచి నీరు అందించడం అంటే మాటలు కాదు. వాటిని ఇంత తక్కువ సమయంలో సాక్ష్యాత్కరించడం అన్నది ఎంతో చిత్తశుద్ది వుంటేనే పూర్తి చేయగలరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రశంసంలు కురిపించారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన అసలు నేను హైదరాబాద్‌లో వున్నానా? లేక లండన్, అమెరికాలో వున్నానా? అన్న అనుమానం కల్గిందని చెప్పారు. ఇవన్నీ ఎవరో చెప్పమంటే చెప్పిన మాటలు కాదు. వాళ్లకు వాళ్లుగా తెలంగాణ అభివృద్ధిని చూసి చెప్పిన మాటలు. అంతే కాదు మరో సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ తెలంగాణ అభివృద్దిపై ఎంతో ప్రశంసలు కురిపించారు. కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అసవరమని అన్నారు. అరవై ఏళ్లపాటు తెలంగాణ ప్రజలు మాకు నీళ్లు కావాలంటే ఇవ్వలేదు. అసలు ప్రాజెక్టులు కట్టడం సాధ్యం కాదన్నారు. అదే ఆనాడు తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఏనోడో బాగు పడేది. కాని అప్పటి పాలకులు చేసిన నిర్లక్ష్యం చాల వుందని కూడా చెప్పారు. అంతే కాదు ఒక దశలో తానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకి తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తే బాగుంటందని సలహా ఇచ్చాను. కాని చంద్రబాబు తెలంగాణలో సాధ్యం కాదన్న కాదన్నారు. కాని ఇప్పుడెలా సాధ్యమైందంటే అది కేసిఆర్ గొప్పదనం అన్నాడు. ఇక మరో నటి లయ కూడా చాలా కాలం తర్వాత ఆమె అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత నేను ఎక్కడ దిగాను అన్నంత ఆశ్చర్యపోయారట. నేను హైదరాబాద్‌కే వచ్చానా? అన్న అనుమానం కల్గిందంట. అంటే ఇంత తక్కువ సమయంలో హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసిఆర్ కు తోడుగా, నీడగా నిలిచి, రాత్రనక, పగలనక పనిచేసిన మంత్రి కేటిఆర్, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ హరితవనం కావడంలో ఎంపి. సంతోష్ కృషి ఎంత వుందో చూస్తేనే అర్ధమౌతుంది.
Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March :
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం..వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని..వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందాయి.
కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారింది. తెలంగాణలో భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ యాత్ర కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో పార్టీకి అధికారం.. ప్రధానిగా రాహుల్ లక్ష్యంగా భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కనున్నారు. భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. ఈ వేదిక అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. వీరందరినీ భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.
ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల పైన భట్టి ప్రజల మధ్యనే ఉంటూ పోరాటం ప్రారంభించారు. పేద ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ..పేద వర్గాలతో మమేకం అయ్యారు. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని, ముఖాముఖి మాట్లాడుతూ, సభలు పెడుతూ.. ప్రజలతో నడుస్తూ భట్టివిక్రమార్క ప్రజలకు చేరువయ్యారు. పార్టీ నేతలతో భట్టికి ఉన్న సత్సంబంధాలతో అందరివాడుగా నిలిచారు. భట్టి యాత్రలో నేతలతా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ నేతలు హాజరైన మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు.
ఈ నెల 15న భట్టి జన్మదినం నాడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ భట్టి పాదయాత్ర గురించి ఆరా తీస్తున్నారు. భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారినికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ హాజరు కానున్నారు. ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు స్పూర్తిగా మారుతోంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో జోష్..ఇది నిజమైన మాటేనా? ఎవరు చెప్పారు? ఎవరు చెబుతున్నారు? ఎవరు సంకేతాలు ఇచ్చారు? కర్నాకట ఎన్నికలకు తెలంగాణకు సంబంధం ఏమిటి? కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బూమ్ ఎందుకొస్తుంది? అక్కడి స్ధానిక పరిస్ధితులు, అవసరాలకు , తెలంగాణ వాస్తవ పరస్ధితులకు వ్యత్యాసం లేదా? తెలంగాణ గడ్డలో వున్న రాజకీయ చైతన్యం ఏమైనా తక్కువా? పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందా? గతంలో కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదా? కర్నాకటలో 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. కాని చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. పొరుగు రాష్ట్రంలో వున్న రాజకీయ పరస్ధితులు వేరు. మన పరిస్ధితులు వేరు. తర్వాత ఇక్కడ, అక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలు వున్నప్పటికీ కర్నాకట ప్రభుత్వాలు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ వెళ్లి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశాయి. రాజకీయాలను అంచనా వేయడం అంటే అక్కడ గెలిస్తే, ఇక్కడ గెలుస్తామన్న లెక్కలు ఎక్కడైనా వర్తిస్తాయేమోకాని రాజకీయాల్లో కాదు. పైగా కర్నాటక ప్రజలు బిజేపి పాలనపై విసుగెత్తి వున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన జేడిఎస్ కర్నాకటలో గోడ మీది పిల్లి వాటం రాజకీయాలు చేస్తూ వస్తోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకున్నా, వారిలో కొంత మందిని లాగేసి, బిజేపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిపాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. అందుకే ప్రజలు బిజేపిని ఓడిరచారు. అక్కడ కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం లేదు. దాంతో కాంగ్రెస్ గెలిచింది. అంతే కాని కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్త లోకాన్ని సృష్టిస్తుందని కాదు…ఇది తెలిసికూడా కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోంది. ఊపు వాపుగా మార్చుకొని రాజకీయం మొదలుపెట్టినట్లు కలలుకంటోంది.
కర్నాటక ఎన్నికల దాకా బిజేపి మురిసింది.
ఇక మాకు ఎదురులేదని చెప్పుకున్నది. అధికార బిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ప్రజలు మావైపే వున్నారు. ఇక ఎన్నికల జరగడమే తరువాయి…? అంటూ సన్నాయి నొక్కులు మూడేళ్లపాటు నొక్కారు. ఏమైంది? కర్నాకట ఎన్నికలతో ఒక్కసారిగా బిజేపిలో నిస్తేజం ఆవహించింది. అంతా సైలెంట్ అయ్యింది. ఆధిప్యత రాజకీయాలు ఒక్కసారిగా చల్లారాయి. ఆ పార్టీ వెంట పడుతున్నారంటూ చెప్పిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారంటూ చెప్పిన మాట చెప్పకుండా చెప్పి, చెప్పి ఆశ పల్లకిలో ఊరేగారు. కనీసం బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినప్పుడైనా బిజేపి కళ్లు తెరవాల్సివుండే! కాని ఆ పని చేయలేదు. ప్రజల మద్దతు మాకే వుంటూ ఊదరగొట్టింది. ఉట్టికెగురుదామనుకొన్నది. కాని వాస్తవ పరిస్ధితులు ఏమిటో కర్నాకట ప్రజలు చూపించే సరికి దిక్కులు చూస్తున్నది. ఇలాంటి సమయం కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చినట్లు వుంది. అందుకే తెగ హడావుడి చేస్తోంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు కొన్ని రోజులు ఎంటర్మైంట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
అసలు కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు ఎవరు?
అన్నది ఒకసారి బాగా ఆలోచించాలి. ముందుగా ఖమ్మం జిల్లాకు చెందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అనూహ్యంగా తెలంగాణ రాజకీయాలపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసిసి తరుపున ఎంపిగా గెలిచారు. కాని తెలంగాణలో వైసిపి పార్టీని నిర్వహించడం తన వల్ల కాదని తేల్చుకున్న ఆంధ్రప్రదేశ్ సిఎం. జగన్ , అక్కడి రాజకీయాల మీదనే దృష్టిపెట్టారు. తెలంగాణలో వైసిపిని వదిలేసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిపోయారు. ఇంత వరకు బాగానే వుంది. నిజంగా పొంగులేటి ఎంతో సమర్ధవంతమైన నేత అని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప, ఆనాడు వైఎస్. జగన్ మూలంగా గెల్చిన నేతలే తప్ప, వ్యక్తిగత ప్రతిష్ట అంతగా వున్న నేత కాదు. కాని తనకు తాను అతిగా ఊహించుకున్న శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ పరిమితి, పరిజ్ఞానం ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసు. అందుకే ఎక్కడ వుంచాలో అక్కడ శ్రీనివాస్‌రెడ్డిని వుంచారు. అయితే గత ఎన్నికల్లో తాను జిల్లా మొత్తం గెలిపించుకొస్తా అని చెప్పిన శ్రీనివాస్‌రెడ్డి మూలంగానే బిఆర్‌ఎస్ అనుకున్నంత మేర సీట్లు సాధించలేదన్నది నిజం. అందుకే ఆయన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. ఆనాటి నుంచి ఆయన ఎప్పుడు సమయం దొరుకుతుందా? అనుకుంటూ ఎదురుచూస్తున్నాడు. రాష్ట్రంలో బిజేపి కొంత ఊపు మీదకు వచ్చిందన్నది గ్రహించి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని కొంత మందిని ఇబ్బందులకు గురి చేయడం మొదలు పెట్టడంతో శ్రీనివాస్‌రెడ్డి తన అసమ్మతి గళం వినిపించడం మొదలు పెట్టారు. వీలు చిక్కినప్పుడల్లా తన అసంతృప్తిని వెల్లగక్కుతూ వచ్చారు. ఆఖరుకు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లి, బిజేపిలో చేరాలని అనుకున్నాడు. కర్నాకటలో కాంగ్రెస్ గెలవడంతో ఆయన తన రూట్ మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయంతీసుకున్నాడు. ఖమ్మం జిల్లానుంచి బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేట్ దాకా రానివ్వను అంటూ శపథాలు చేస్తున్నాడు. నిజంగా ఆయనకు అంత శక్తి వ ఉంటే గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఎందుకు సీట్లు తేలేకపోయాడు? నిజానికి అప్పుడు బిఆర్‌ఎస్ మంచి ఊపు మీద వున్నది. ఎవరూ ఊహించనంత మెజార్టీని సొంతం చేసుకున్నది. మరి అలాంటప్పుడే పొంగులేటి పనితనం ఎక్కడా కనిపించలేదు.
నిజానికి తెలంగాణలో బిఆర్‌ఎస్ అత్యంత బలంగా వుంది.
ప్రస్తుత తరుణంలో ప్రతిపక్షపాత్ర ఎవరిది అన్నదానిపై చర్చ జరగాల్సిన సమయంలో , పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు వారికున్న బలమెంత? వారి రాజకీయ అనుభవం ఎంత? పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లో చేరుతున్నవారి రాజకీయ చరిత్ర ఎంత? గతంలో ప్రజలు ఎందుకు వారిని ఓడిరచారు? అన్నదానిని ప్రజలు పరిగణలోకి తీసుకోకుండానే ఎన్నుకుంటారా? ఇదిలా వుంటే కాంగ్రెస్‌లో చేరుకముందు వున్న ప్రాధాన్యత చేరిన తర్వాత గాని తెలియదు. కాంగ్రెస్ మహాసముద్రం. అందులో ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యత వుండదు. గుర్తింపు అసలే వుండదు. అలాంటిది సిఎల్‌పి నాయకుడైన భట్టి విక్రమార్క ప్రాతినిధ్యాన్ని కాదని పొంగులేటికి ప్రాధాన్యత ఇస్తారని నమ్ముడం అంటే మబ్బులను చూసి, ముంత ఒలకబోసుకున్నట్లే…అంటే పొంగు చల్లారినట్లే? అంతే…!!
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.