ఆరూరి రమేష్ గెలుపుకై ఇంటింటి ప్రచారం చేసిన దొంగల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఆరూరి రమేష్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అనంతరం మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ప్రజల ముందు ఉంచి అధికారంలో వచ్చి నెరవేర్చక ప్రజల ముందు కంపు కొట్టిన గుడ్డు లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ తప్పులు కనిపించకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అన్నారు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తుందని అన్నారు కేవలం ఓట్ల కోసం దిగజారుడుతనానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటుపడుతున్నారు అన్నారు కెసిఆర్ లక్షల అప్పులు చేసినాడు రేవంత్ రెడ్డి కోట్ల అప్పులకు రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెల ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దొంగ హామీలు ఎలా నెరవేరుస్తుందో ప్రజలు ఆలోచించాలని పది సంవత్సరాల కాలంలో దేశాన్ని అప్పుల నుండి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీ ధీ అన్నారు దేశంలో నరేంద్ర మోడీ అభివృద్ధిని ఇతర దేశాలు కీర్తిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆవుల సంతు తాండ్ర హరీష్ చెటగొప్పుల అర్జున్ గట్ల శ్రీనివాస్ అన్రాజ్ అనిల్ సిల్వర్ కార్తిక్ జగజంపుల రమేష్ తొట్ల స్వామి ,బండి బండిరాజేందర్ తదితరులు పాల్గొన్నారు

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.

జెడ్పి సీఈవో విజయలక్ష్మి.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలైన సి ఆర్ పల్లి, కైలాపూర్, తిరుమలపూర్, ముచ్చినిపర్తి, కొత్తపేట, లక్ష్మి పురం తండా, పాఠశాలలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచినీటికి సంబంధించిన పనులను నాణ్యతతో తొందరగా పూర్తి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు, పంచాయితీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గల పలు గ్రామాల్లో ఎం సి పి ఐ యు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన జెండాలు ఎగురవేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో అమరవీరుల గుర్తులు అందరికీ వందనాలు స్ఫూర్తిని నిలిపి వెలుగును పంచే కార్మికుల ఆశయాల సాధన దినం కార్మికుల సమైక్య దినం మే డే’.1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన, ప్రదర్శన చోటు చేసుకున్నాయి.1రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధానడిమాండ్.ప్రపంచ వ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది.1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది.
ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు ఆడపిల్లలను భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగు తున్నది.పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంత వరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. ఈ కార్య క్రమంలో ఎం సిపిఐ యు మండల అధ్యక్షుడు భద్రయ్య మంద, కార్యవర్గ సభ్యుడు రంజిత్, పత్తిపాక గ్రామ అధ్యక్షుడు అంకేశ్వర పు మల్లయ్య పాల్గొన్నారు.

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని 

జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం రోజు పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ సన్మానించారు.
ఎస్ఐ, రెహమాన్, 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 41 సంవత్సరాల సర్విస్, వి.వేణు, ఏ ఎస్ ఐ 1984 లో బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల సర్విస్, నగేష్ నాథ్, ఏ ఎస్ ఐ 1989 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 35 సంవత్సరాల సర్వీస్, నారాయణ రెడ్డి, హెచ్ సి,1991 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 33 సంవత్సరాల సర్వీస్ పోలీసు శాఖ లో అమూల్యమైన సేవలు అందించి ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పదవి విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఏ.ఎస్.ఐగా, ఎస్.ఐగా పదోన్నతి పొంది సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించడం మరువమని, పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ప్రజా రక్షణ కోసం వీరు పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పీ అన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మీకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రాములు, డి.సి.ఆర్.బి డి.ఎస్.పి రమణారెడ్డి, ఏవో రుక్మిణి భాయ్, ఎస్.పి సిసి రామ్ రెడ్డి మరియు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రంనుఆకస్మిక తనిఖీ చేసిన జడ్పీ సీఈవో.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రం (1) కేంద్రము ను బుధవారం రోజున జడ్పీ సీఈవో విజయలక్ష్మి ఎంపీడీవో శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు, వారు సందర్భంగాగర్భిణీలు బాలింతలు పిల్లలతో మాట్లాడి తల్లి పిల్లల ఎప్పటికప్పుడు బరువు సమతలహారము ఆరోగ్య పరీక్షలను మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ చేయించుకోవాలన్నారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తల్లి పిల్లలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదని బయట తినుబండారాలు కూల్ డ్రింక్స్ బాగా చల్లని పానియలు తాగ వద్దని అవగాహన కల్పించినారు, బాలామృతం ఎగ్స్ వారి చేతుల మీదుగా పంపిణీ చేయనైనది, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జయప్రద సూపర్వైజర్ పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి, గర్భిణీలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు.

మోదీ గ్యారంటీలతో పేదలకు ఒరిగేది ఏమీ లేదు:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :
మోదీ గ్యారెంటీలు వేల కోట్ల ప్రజాధనాన్ని అదానీ,అంబానీలకు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప, కార్మికులు,కర్షకులకు ఒరిగేది ఏమీ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మే డే సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ పాలనలో పేదల బతుకులు ఛిద్రం అయ్యాయని అన్నారు.కార్మిక కర్షక లోకానికి మోడీ చేసింది ఏమీ లేదన్న ఆయన, బిజెపిని గెలిపిస్తే కార్మిక లోకం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు.
కేసీఆర్ హయంలో కార్మికుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఉందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కార్మికులకు న్యాయం చేసిన పార్టీ భారాసను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హామీ నెరవేరలేదన్నారు. పెన్షన్ల కార్యక్రమంలో నాగర్ కర్నూలు బీ ఆర్ ఎస్ ఎంపీ అబ్యర్ధి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ బైకని శ్రీనివాస్ యాదవ్,వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు,  నాయకులు వాకిటి శ్రీధర్,లక్ష్మయ్య, విజయ్ కుమార్,నందిమల్ల అశోక్, ఉంగ్ల మ్మ్.తిరుమల్,గంధం. బాలపేరు,గంధం.పరంజ్యోతి,మాణిక్యం, ధర్మా ,మహేశ్వర రెడ్డి కౌన్సిలర్ కంచె.రవి,నాగన్న యాదవ్,బండారు.కృష్ణ,గడ్డం మహేస్,సూర్యావంశం.గిరి, జో హే బ్ హస్సెన్,చిట్యాల.రాముతదితర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి(సి)గ్రామ కమ్యూనిటీ హాల్ దగ్గర హమాలీ సంఘం అధ్యక్షులు పుల్ల సమ్మయ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య , ఎంపీటీసీ 2 ధబ్బెట అనిల్ పాల్గొని మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు,హమాలీలు తమ హక్కులను కాపాడుకోవడానికి అందరు ఏకం కావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే మొదటి రోజు కార్మికుల దినోత్సవం జరుపుకుంటారని కార్మికుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, తమ సమస్యలు పరిష్కారం కోసం కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోల్కొండ సురేష్ హమాలీ సంఘం నాయకులు పుల్ల రాజయ్య దబ్బెట భద్రయ్య ,పుల్ల భద్రయ్య,పుల్ల శైలేందర్, పుల్ల భద్రయ్య, మాస్ కుమార్,పుల్ల శైలేందర్, పుల్ల సదయ్య పుల్ల మల్లయ్య లద్దునూరి ప్రభు నద్దునురి భద్రయ్య, సదయ్య (బంటి) పుల్ల రవి లద్దునూరి ఐలయ్య ఆలూరి మొగిలి పుల్ల శైలేందర్ పుల్ల సదయ్య కనకం భద్రయ్య చెరుకు సారయ్య సనిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చాలి చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం

– అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యలను పరిష్కరించండి
– రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
“మే” డే సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లాకి విచ్చేసిన బీసీ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి , కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ ని మర్యాద పూర్వకంగా కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యొక్క సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ గత బి.ఆ.ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కుటుంబాల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ లను వెట్టి చాకిరి చేయించి వారికి చాలి చాలని జీతాలతో మరియు ఉద్యోగ భద్రత లేక వారి కుటుంబాలు రోడ్డున పడడానికి కారణమయ్యేలా కేసిఆర్ ప్రభుత్వం పని చేశారనీ అన్నారు. దీని వలన వారంతా కేసీఆర్ ప్రభుత్వం పైన విసుగు చెంది కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారంతా కృషి చేసారన్నారు. వారి ప్రధాన సమస్యలైన వాటిలో 60 సంవత్సరాలు నిండిన వారి రిటైర్మెంట్ మెంట్ విషయంలో వారికి న్యాయం చేయాలని, వారికి వేసవి సెలవులు కల్పించాలని, వారికి నెలనెలా 1 తేదీన జీతాలు చెల్లించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విన్నవించడం జరిగిందన్నారు. ఇట్టి సమస్యల పైన వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెంటనే చరవాణి లో మాట్లాడించడం జరిగిందన్నారు. అలాగే త్వరలో సీతక్కని సిరిసిల్లా కి రావాలని కోరుతూ చెప్పడం జరిగిందన్నారు. అందుకు సీతక్క త్వరలో వారి సమస్యలు అన్ని తీరుస్తామని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి, అంగన్వాడీ లను నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన తో పట్టణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సానియా, 21 వ వార్డు అధ్యక్షురాలు గోనె శరణ్య, కార్యదర్శి ఎదురుగట్ల వనిత, 22 వ వార్డు అధ్యక్షురాలు రోజా, పట్టణ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్ , నాయకులు రెబ్బ శ్రీను, రమేష్, అల్లం సాయి, రఫీక్ , ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఎం గోపిని పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ తెల్లం. వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచల పట్టణం కొత్త కాలనీకి చెందిన ఎం గోపి అనారోగ్యంతో భద్రాచల పట్టణంలోని శ్రీ సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాస్పిటల్ కి వెళ్లి పేషెంట్ గోపి సహాయకులను పరామర్శించి డాక్టర్ లోకేష్ గారిని పేషెంట్ యొక్క ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అలాగే కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరం ఉంటే తెలియజేయమని ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్,ఎం డి నవాబ్, చుక్క సుధాకర్, గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి లు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… కార్మికులకు, కర్షకులకు 138వ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికుల, భూస్వాముల, పెత్తందారుల, దోపిడీదారుల గుండెలు పగిలిపోయేలా చేసిన కార్మికుల ఐక్యత పోరాట రూపమే మేడే అని తెలిపారు. ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. చికాగో ఇప్పుడు స్ఫూర్తిని పొంది ప్రజా పోరాటాల ద్వారా కార్మికుల హక్కులు సాధించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శంకర్ ,మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజయ్య, సంఘం సభ్యులు మహిళలు పాల్గొన్నారు.

తెలంగాణలో విశ్వబ్రాహ్మణుల ఫెడరేషన్ పునరుద్ధరించాలి

వనపర్తి నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణుల ఫెడరేషన్ రద్దు చేసిందని ఇట్టి ఫెడరేషన్ వెంటనే పునరుద్ధరించాల ని విశ్వబ్రాహ్మణులు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు డీకే అరుణ ను కలిసిన వారిలో విశ్వబ్రాహ్మణులు మహేష్ చారి ప్రభు చారి నరేంద్ర చారి శంకరాచారి రాజు చారి తదితరులు ఉన్నారు

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో పెద్ద పల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు,పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపెల్లి మండలం పడకల్ గ్రామంలో ఐకేపీ రైతులు హమాలీల తో మరియు ఉపాధి హామీ కూలీలతో కారు గుర్తు కు ఓటువేసి ఈశ్వర్ ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ కంది లావణ్య గ్రామశాఖ అధ్యక్షులు మేకల అంజి గాధం భాస్కర్ తెలంగాణ ఉద్యమ కారుడు పడిదం వెంకటేష్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చింతల తిరుపతి ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు గౌరి చిరంజీవి పాల్గొన్నారు*

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం వేడుకలు.

కార్మిక వ్యతిరేకబిజెపి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించండి.

టిఏజిఎస్.జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
భారతీయ మజ్దూర్ సంగ్, భారత జనతా పార్టీ లకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు.

మహా ముత్తారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు, ముందుగా మినీ గూడ్స్ అసశేషయాన్ మండల అధ్యక్షులు లింగమల్ల సడవాలి రావు జెండా ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో కచ్చిన 10 సంవత్సరాల కాలం నుండి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కులను బిజెపి పార్టీ కాలరాస్తుందని అన్నారు, అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడలుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. కనీసం సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తుందన్నారు, కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని,కనీసం కార్మికుల శ్రమను గుర్తించడం గాని,కార్మికులను గోరవించడం లేదని అన్నారు. ఎంతోమంది కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మారిస్తేనే ఈ దే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను భుజాలపై మోసేవారే కార్మికులు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జంగేడు గ్రామంలో మే డే ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీమతి కంప అక్షయ కార్మిక చట్టాల యొక్క ఫలాలను ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కొండముచ్చుల రఘు, జంగా కృష్ణమూర్తి, పొక్కూరి రమేష్, కొత్తపెల్లి కుమార్, జంగం కుమార్, గూడెపు కార్తీక్, నిమ్మల శంకర్, గూడెపు రాజయ్య, మోర్పురి ఓదెలు, గూడెపు శివరాజ్, తులాల శ్రీనివాస్, దుర్గం కృష్ణస్వామి, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరిరక్షణలో కార్మికుల పాత్ర చాలా కీలకం

– పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి
సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
సిరిసిల్ల పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుల సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన “మే” డే ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు..
ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ… “మే”డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనీ అన్నారు..
సిరిసిల్ల పురపాలక సంఘ అభివృద్ధిలో పరిశుభ్రత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పురపాలక సంఘ కార్మికుల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు..
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విది నిర్వహణలో భాగంగా పట్టణ పరిశుభ్రత కోసం వెలకట్టలేనిదని పారిశుధ్య కార్మికుల పట్ల గౌరవంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని పారిశుధ్య కార్మికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా మాట్లాడుతూ ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ అందరికీ ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ తెలిసిన నాయకులుగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను గౌరవప్రదంగా పెంచి వారికి విధినిర్వహణలో అవసరమగు సేఫ్టీ కిట్లను అందిస్తూ ప్రభుత్వపరంగా వారికి అందించాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. అంతే కాకుండ కరోన సమయంలో పారిశుద్ధ కార్మికులు నిర్వహించిన సేవలకు గుర్తింపుగా వారికి 5 వేల రూపాయల చొప్పున గౌరవ ప్రోత్సాహాకన్ని అందించారని గుర్తు చేశారు. అంతేకాకుండా వారికి పి.ఎఫ్ మరయు ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పిస్తూ ప్రతినెల కార్మికులకు క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూశారని గుర్తు చేశారు..
అనంతరం పారిశుధ్య కార్మిక నాయకులు దేవయ్య తో పతాకావిష్కరణ చేయించి ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముసం రమేష్, కొడం రమణ, పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆద్యర్యంలో మే డే

వనపర్తి నేటిదాత్రి :
తెలుగుదేశం పార్టీ ఆద్యర్యంలో మే డే సందర్భంగా కార్మిక జెoడాఎగురవేశారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బి. రాములు గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పనిచేసే కర్షకులు నేటి వరకు కూడా 24 గంటలు శ్రమిస్తూనే ఉన్నారు. వీరికి ఇప్పటికీ పూర్తి స్వేచ్ఛ లేదు. ఇలా వివిధ రంగాల్లో ఎక్కువ పని గంటలు పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు చట్టబద్ధతను పాటించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పని గంటల్లో మార్పు రావాలని కోరారు అలాగే చిన్నపిల్లలు కూడా పనిలో ఉండకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా స్వర్గీయమాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడు ,గూడు, నీడ అనే నినాదంతో శ్రామికుల చిహ్నంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఏర్పాటు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్న గొప్ప నాయకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో హోటల్ బలరాం , అవుల శ్రీను ,చిన్నయ్య, హుస్సేన్, మ్యాదరి బాలయ్య, కాగితాల లక్ష్మయ్య ,చిట్యాల బలరాజ్, రాధాకృష్ణ , బాలయ్య ,గోపాలకృష్ణ ,కార్మిక నాయకులు కొత్త గొల్ల శంకర్, ద్యారపోగు బాలరాజు, ఫారుక్, గంధం కృష్ణయ్య తదితరులు పాల్గన్నార

ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు

మేడే వర్ధిల్లాలి

సాధించుకున్న పని గంటలను పరిరక్షించు కుందాం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో గల కూడలి వద్ద ఎంసీపీఐ యు, సిపిఐ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య జెండానుఎగురవేశారు.అనంతరం మాట్లాడుతూ కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికులు భూస్వాములు పెత్తందారులు దోపిడీదారులు గుండెలు పగిలిపోయేలా కార్మికుల ఐక్యత పోరాట రూపమే మేడే అని ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయం జరుపుకునే కార్మికుల దినోత్సవం నాటి కార్మికులు కర్షకులు ఎర్రజెండా వారసుల త్యాగాల ఫలితమేనని అన్నారుశారీరక శ్రమ చేసే కార్మిక వర్గం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగ వర్గంఉన్నత విద్యావంతులైన, సాంకేతిక నిపుణులు సాఫ్ట్ వేర్ వంటి ఉద్యోగస్తులుసైతం అధిక సమయం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి గురై, శ్రమకు తగ్గ ఫలితం వేతనము ప్రతినెల జీతాలు పని గంటల తగ్గింపు 138వ మే డే సందర్భంగా యావత్ సమాజము జీతభత్యాలు సౌకర్యాలు హక్కులు జీవన ప్రమాణాలు ఉద్యోగ భద్రత సాధించుటకు చికాగో విప్లవస్ఫూర్తిని పొంది ప్రజా పోరాటాలు ద్వారా హక్కులు సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంకేశ్వరం ఐలయ్య, ఆడెపు అశోక్, తట్ల రమేష్ ఉస్మాన్, నాలికే రాజ మొగిలి, సూర్య ప్రకాష్, అనిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

“పోపా” ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ తెలిపారు.స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహణ కోసం మహర్షి విద్యాలయంలో విషయ బోధకులచే కార్యశాల (వర్క్ షాప్)ఏర్పాటు చేసినట్లు వివరించారు.
విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఉన్న వ్యాకులతను తొలగించడానికి మరియు బాషా నైపుణ్యాలను పెంచడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నట్లు వివరించినారు.
నెల రోజుల పాటు ప్రతి దినం తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.10 మంది ఇంగ్లిష్ విషయ నిపుణులతో ఆంగ్ల విద్య బోదిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోర్సు డైరెక్టర్స్ గా ప్రముఖ ఆంగ్ల భాష బోధకులు బూర శ్రీనివాస్ మరియు చేరాల తిరుపతి లను నియమించినట్లు వివరించినారు.మే 5వ తేది ఆదివారం నుండి ప్రారంభమవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోపా సభ్యులు గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, బూర శ్రీనివాస్, చేరాల తిరుపతి, కోక్కుల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, బైరి రవీందర్, జయరాం, ఆడేపు వేణు, యం. వెంకటేశం, యం. మహేష్, కె .దత్తు లు పాల్గొన్నారు.

పి జడ్చర్ల టౌన్ దళిత బస్తీ లో బిజెపి ఇంటింట ప్రచారం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

బీజేపీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీ కే అరుణమ్మ గెలుపు కోసం బిజెపి ఇంటింట ప్రచార కార్యక్రమంలో 140,141,142 పోలింగ్ బూత్లలో నరసింహులు చిన్న అంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొంగళి శ్రీకాంత్ పాల్గొని, నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాము చిన్న అన్న ఎస్సీ మోర్చా టౌన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ యువ నాయకులు మొగలిహ్య రాము చిన్న దీపల్లి శ్రీనివాసులు రాజు సురేష్, ముఖ్య నాయకులు అండాలు శోభా పాల్గొన్నారు

యువకుడి ఆత్మహత్య

క్రెడిట్ కార్డు కలెక్షన్ సిబ్బంది వేదింపులే కారణం?

వరంగల్లో విషాదం

నేటిధాత్రి, వరంగల్

క్రెడిట్ కార్డు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకున్న యువకుడు సంస్థ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి విష్ణువర్ధన్ (23) బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ ప్రాంతానికి చెందిన కమ్మంపాటి యాకయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడైన విష్ణువర్ధన్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!
Exit mobile version