సిరిసిల్ల, మే – 1(నేటి ధాత్రి):
పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ తెలిపారు.స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహణ కోసం మహర్షి విద్యాలయంలో విషయ బోధకులచే కార్యశాల (వర్క్ షాప్)ఏర్పాటు చేసినట్లు వివరించారు.
విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఉన్న వ్యాకులతను తొలగించడానికి మరియు బాషా నైపుణ్యాలను పెంచడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నట్లు వివరించినారు.
నెల రోజుల పాటు ప్రతి దినం తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.10 మంది ఇంగ్లిష్ విషయ నిపుణులతో ఆంగ్ల విద్య బోదిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోర్సు డైరెక్టర్స్ గా ప్రముఖ ఆంగ్ల భాష బోధకులు బూర శ్రీనివాస్ మరియు చేరాల తిరుపతి లను నియమించినట్లు వివరించినారు.మే 5వ తేది ఆదివారం నుండి ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోపా సభ్యులు గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, బూర శ్రీనివాస్, చేరాల తిరుపతి, కోక్కుల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, బైరి రవీందర్, జయరాం, ఆడేపు వేణు, యం. వెంకటేశం, యం. మహేష్, కె .దత్తు లు పాల్గొన్నారు.