భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచల పట్టణం కొత్త కాలనీకి చెందిన ఎం గోపి అనారోగ్యంతో భద్రాచల పట్టణంలోని శ్రీ సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాస్పిటల్ కి వెళ్లి పేషెంట్ గోపి సహాయకులను పరామర్శించి డాక్టర్ లోకేష్ గారిని పేషెంట్ యొక్క ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అలాగే కుటుంబ సభ్యులకు ఏదైనా అవసరం ఉంటే తెలియజేయమని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్,ఎం డి నవాబ్, చుక్క సుధాకర్, గాడి విజయ్, మాచినేని భాను తదితరులు పాల్గొన్నారు