వనపర్తి నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణుల ఫెడరేషన్ రద్దు చేసిందని ఇట్టి ఫెడరేషన్ వెంటనే పునరుద్ధరించాల ని విశ్వబ్రాహ్మణులు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు డీకే అరుణ ను కలిసిన వారిలో విశ్వబ్రాహ్మణులు మహేష్ చారి ప్రభు చారి నరేంద్ర చారి శంకరాచారి రాజు చారి తదితరులు ఉన్నారు
