మేడే వర్ధిల్లాలి
సాధించుకున్న పని గంటలను పరిరక్షించు కుందాం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో గల కూడలి వద్ద ఎంసీపీఐ యు, సిపిఐ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య జెండానుఎగురవేశారు.అనంతరం మాట్లాడుతూ కార్మికులు ఒకవైపు రక్తం చిందించుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడచిన చుక్కలతోనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్రజెండా పైకెత్తి ధనికులు భూస్వాములు పెత్తందారులు దోపిడీదారులు గుండెలు పగిలిపోయేలా కార్మికుల ఐక్యత పోరాట రూపమే మేడే అని ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయం జరుపుకునే కార్మికుల దినోత్సవం నాటి కార్మికులు కర్షకులు ఎర్రజెండా వారసుల త్యాగాల ఫలితమేనని అన్నారుశారీరక శ్రమ చేసే కార్మిక వర్గం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగ వర్గంఉన్నత విద్యావంతులైన, సాంకేతిక నిపుణులు సాఫ్ట్ వేర్ వంటి ఉద్యోగస్తులుసైతం అధిక సమయం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి గురై, శ్రమకు తగ్గ ఫలితం వేతనము ప్రతినెల జీతాలు పని గంటల తగ్గింపు 138వ మే డే సందర్భంగా యావత్ సమాజము జీతభత్యాలు సౌకర్యాలు హక్కులు జీవన ప్రమాణాలు ఉద్యోగ భద్రత సాధించుటకు చికాగో విప్లవస్ఫూర్తిని పొంది ప్రజా పోరాటాలు ద్వారా హక్కులు సాధించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంకేశ్వరం ఐలయ్య, ఆడెపు అశోక్, తట్ల రమేష్ ఉస్మాన్, నాలికే రాజ మొగిలి, సూర్య ప్రకాష్, అనిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.