భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఆరూరి రమేష్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అనంతరం మోర్చా జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ప్రజల ముందు ఉంచి అధికారంలో వచ్చి నెరవేర్చక ప్రజల ముందు కంపు కొట్టిన గుడ్డు లాగా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తమ తప్పులు కనిపించకుండా బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అన్నారు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తుందని అన్నారు కేవలం ఓట్ల కోసం దిగజారుడుతనానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటుపడుతున్నారు అన్నారు కెసిఆర్ లక్షల అప్పులు చేసినాడు రేవంత్ రెడ్డి కోట్ల అప్పులకు రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నారని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెల ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దొంగ హామీలు ఎలా నెరవేరుస్తుందో ప్రజలు ఆలోచించాలని పది సంవత్సరాల కాలంలో దేశాన్ని అప్పుల నుండి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీ ధీ అన్నారు దేశంలో నరేంద్ర మోడీ అభివృద్ధిని ఇతర దేశాలు కీర్తిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆవుల సంతు తాండ్ర హరీష్ చెటగొప్పుల అర్జున్ గట్ల శ్రీనివాస్ అన్రాజ్ అనిల్ సిల్వర్ కార్తిక్ జగజంపుల రమేష్ తొట్ల స్వామి ,బండి బండిరాజేందర్ తదితరులు పాల్గొన్నారు