వనపర్తి నేటిదాత్రి :
తెలుగుదేశం పార్టీ ఆద్యర్యంలో మే డే సందర్భంగా కార్మిక జెoడాఎగురవేశారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బి. రాములు గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పనిచేసే కర్షకులు నేటి వరకు కూడా 24 గంటలు శ్రమిస్తూనే ఉన్నారు. వీరికి ఇప్పటికీ పూర్తి స్వేచ్ఛ లేదు. ఇలా వివిధ రంగాల్లో ఎక్కువ పని గంటలు పనిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు చట్టబద్ధతను పాటించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పని గంటల్లో మార్పు రావాలని కోరారు అలాగే చిన్నపిల్లలు కూడా పనిలో ఉండకుండా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా స్వర్గీయమాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడు ,గూడు, నీడ అనే నినాదంతో శ్రామికుల చిహ్నంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఏర్పాటు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్న గొప్ప నాయకుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో హోటల్ బలరాం , అవుల శ్రీను ,చిన్నయ్య, హుస్సేన్, మ్యాదరి బాలయ్య, కాగితాల లక్ష్మయ్య ,చిట్యాల బలరాజ్, రాధాకృష్ణ , బాలయ్య ,గోపాలకృష్ణ ,కార్మిక నాయకులు కొత్త గొల్ల శంకర్, ద్యారపోగు బాలరాజు, ఫారుక్, గంధం కృష్ణయ్య తదితరులు పాల్గన్నార
